https://oktelugu.com/

War 2 Movie:   జూనియర్ ఎన్టీఆర్ తో సల్మాన్ ఖాన్..’దేవర’ తర్వాత ఫ్యాన్స్ కి ఫ్యూజులు ఎగిరే అప్డేట్!

బ్రహ్మాస్త్ర ఫేమ్ అయాన్ ముఖర్జీ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో హృతిక్ రోషన్ హీరో గా నటిస్తుండగా, ఎన్టీఆర్ విలన్ గా నటిస్తున్నాడు. కియారా అద్వానీ ఇందులో హీరోయిన్ గా నటిస్తుంది. శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలను జరుపుకుంటున్న ఈ సినిమా ఆగస్టు 14 వ తేదీన విడుదల అయ్యేందుకు సిద్ధంగా ఉన్నట్టు లేటెస్ట్ గా వినిపిస్తున్న టాక్.

Written By:
  • Vicky
  • , Updated On : October 11, 2024 / 09:41 PM IST

    War 2 Movie

    Follow us on

    War 2 Movie:  నందమూరి అభిమానులు ప్రస్తుతం ‘దేవర’ మూవీ సక్సెస్ తో మంచి ఊపు మీదున్న సంగతి అందరికీ తెలిసిందే. సినిమా విడుదలై రెండు వారాలు పూర్తి అయ్యినప్పటికీ కూడా, ఇప్పటికీ డీసెంట్ స్థాయి వసూళ్లను రాబడుతూ ముందుకు దూసుకుపోతుంది. ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రం ఇప్పటికే 400 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించిందని, ఫుల్ రన్ లో 500 కోట్ల రూపాయలకు దగ్గరగా వెళ్లే అవకాశం ఉందని అంటున్నారు. యావరేజ్ టాక్ తో, పాన్ ఇండియా డైరెక్టర్ సహకారం లేకుండా, ఈ స్థాయి వసూళ్లు రావడం అంటే ఎన్టీఆర్ బాక్స్ ఆఫీస్ స్టామినా ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఇకపోతే ఈ సినిమా సక్సెస్ ని ఎన్టీఆర్ పూర్తిగా ఎంజాయ్ చేయకముందే, వార్ 2 సెట్స్ లోకి ఈ నెలాఖరున అడుగుపెట్టబోతున్నాడని లేటెస్ట్ గా వినిపిస్తున్న సమాచారం.

    బ్రహ్మాస్త్ర ఫేమ్ అయాన్ ముఖర్జీ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో హృతిక్ రోషన్ హీరో గా నటిస్తుండగా, ఎన్టీఆర్ విలన్ గా నటిస్తున్నాడు. కియారా అద్వానీ ఇందులో హీరోయిన్ గా నటిస్తుంది. శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలను జరుపుకుంటున్న ఈ సినిమా ఆగస్టు 14 వ తేదీన విడుదల అయ్యేందుకు సిద్ధంగా ఉన్నట్టు లేటెస్ట్ గా వినిపిస్తున్న టాక్. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్స్ లో ఒకరైన సల్మాన్ ఖాన్ అతిథి పాత్రలో కనిపించబోతున్నట్టు తెలుస్తుంది. స్పై సిరీస్ లో ఏక్ తా టైగర్ గా సల్మాన్ ఖాన్ మధ్యలో స్పెషల్ రోల్ ద్వారా కనిపించి వెళ్తుంటాడు. అలా ఒక ఫైట్ సన్నివేశం లో హృతిక్ రోషన్, ఎన్టీఆర్, సల్మాన్ ఖాన్ కనిపిస్తారని లేటెస్ట్ గా బాలీవుడ్ మీడియా లో వినిపిస్తున్న వార్త. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే రానుంది అని సమాచారం. 2019 వ సంవత్సరం లో సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వం లో తెరకెక్కిన ‘వార్’ చిత్రం కమర్షియల్ గా అప్పట్లో పెద్ద వసూళ్ల సునామినే సృష్టించింది. అప్పట్లో సుమారుగా 350 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రానికి సీక్వెల్ అంటే అంచనాలు ఎలా ఉంటాయో చెప్పక్కర్లేదు.

    1000 నుండి 2000 కోట్ల రూపాయిల గ్రాస్ వరకు రాబట్టే స్టామినా ఉన్న చిత్రమిది. తెలుగు లో అయితే ఎన్టీఆర్ తన స్టామినా తో ఎక్కడికో తీసుకెళ్లగలడు. ఇక హృతిక్ రోషన్ గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు, ఆయన యాక్షన్ జానర్ లో సినిమా చేసినప్పుడల్లా బాక్స్ ఆఫీస్ షేక్ అయ్యింది. ఇప్పుడు ఎన్టీఆర్ కూడా తోడు అవ్వడంతో పాజిటివ్ టాక్ వస్తే బాహుబలి 2 లైఫ్ టైం కలెక్షన్స్ ని అవలీలగా బద్దలు కొట్టే సినిమా అవుతుంది. దసరా కానుకగా ఈ చిత్రం నుండి టీజర్ విడుదల అవుతుందని అభిమానులు ఊహించారు కానీ, అది ఇప్పట్లో కుదిరేలా లేదు, క్రిస్మస్ లేదా న్యూ ఇయర్ రోజు టీజర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి.