Game changer movie : ‘గేమ్ చేంజర్’ చిత్రానికి సరికొత్త కష్టాలు..టైటిల్ ని మార్చే ఆలోచనలో నిర్మాత దిల్ రాజు!

గేమ్ చేంజర్ కి ఇప్పుడు కొత్త తలనొప్పి వచ్చి పడింది. ఇటీవల జరిగిన ఒక ఇంటర్వ్యూ లో 'గేమ్ చేంజర్' టైటిల్ పెట్టేందుకు మూవీ టీం ఎంత ఇబ్బంది పడాల్సి వచ్చిందో చెప్పుకొచ్చాడు ఆ చిత్ర నిర్మాత దిల్ రాజు. ఆయన మాట్లాడుతూ 'ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో విడుదల కాబోతుంది కాబట్టి, అందరికీ అర్థం అయ్యేలా ఒకే కామన్ టైటిల్ పెట్టాలని డైరెక్టర్ శంకర్ అనుకున్నాడట.

Written By: Vicky, Updated On : October 11, 2024 8:18 pm

Game Changer Movie

Follow us on

Game changer movie :  గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘గేమ్ చేంజర్’ చిత్రం కోసం ఆయన అభిమానులు మాత్రమే కాదు, కోట్లాది మంది సినీ అభిమానులు ఎంత ఆతృతగా ఎదురు చూస్తున్నారో మన అందరికీ తెలిసిందే. సౌత్ ఇండియన్ సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కి ఒక ప్రత్యేకమైన బ్రాండ్ ఇమేజి ఉంది. అలాంటి బ్రాండ్ ఇమేజి ఉన్న డైరెక్టర్, రామ్ చరణ్ లాంటి స్టార్ తో సినిమా అంటే అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. కానీ శంకర్ గత చిత్రం ‘ఇండియన్ 2’ భారీ డిజాస్టర్ ఫ్లాప్ అవ్వడంతో, దాని ప్రభావం ఈ చిత్రం ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ పై కొన్ని ప్రాంతాల్లో పడింది. ముఖ్యంగా ఓవర్సీస్ లోని నార్త్ అమెరికా లో ఈ చిత్రానికి కేవలం 4.5 మిలియన్ డాలర్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.

ఇది త్వరలో విడుదలకు సిద్ధంగా ఉన్నటువంటి పాన్ ఇండియన్ సినిమాలకంటే తక్కువ అని చెప్పొచ్చు. పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓజీ చిత్రానికి 6.5 డాలర్ల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ జరగగా, రీసెంట్ గా విడుదలైన ‘దేవర’ మూవీ ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ 5 మిలియన్ డాలర్స్ కి జరిగింది. కానీ ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ ప్రాంతాల్లో మాత్రం భారీ ఫ్యాన్సీ రేట్స్ కి ఈ చిత్రం బిజినెస్ జరుగుతుందని సమాచారం. రేపు ఈ చిత్రానికి సంబంధించిన బ్రాండ్ న్యూ పోస్టర్ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తుందట మూవీ టీం, ఈ పోస్టర్ పై విడుదల తేదీ కూడా ఉంటుందట. ముందుగా డిసెంబర్ 20 వ తేదీన ఈ చిత్రాన్ని విడుదల చేద్దామని అనుకున్నారు, కానీ మెగాస్టార్ చిరంజీవి ‘విశ్వంభర’ సంక్రాంతి రేస్ నుండి తప్పుకోవడంతో, ‘గేమ్ చేంజర్’ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయబోతున్నారట.

ఇదంతా పక్కన పెడితే గేమ్ చేంజర్ కి ఇప్పుడు కొత్త తలనొప్పి వచ్చి పడింది. ఇటీవల జరిగిన ఒక ఇంటర్వ్యూ లో ‘గేమ్ చేంజర్’ టైటిల్ పెట్టేందుకు మూవీ టీం ఎంత ఇబ్బంది పడాల్సి వచ్చిందో చెప్పుకొచ్చాడు ఆ చిత్ర నిర్మాత దిల్ రాజు. ఆయన మాట్లాడుతూ ‘ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో విడుదల కాబోతుంది కాబట్టి, అందరికీ అర్థం అయ్యేలా ఒకే కామన్ టైటిల్ పెట్టాలని డైరెక్టర్ శంకర్ అనుకున్నాడట. అందుకు ఆయన ‘గేమ్ చేంజర్’ టైటిల్ ని ఫిక్స్ చేశారట. కానీ ఒక భాషలో మాత్రం గేమ్ చేంజర్ టైటిల్ తెగ ఇబ్బంది పెట్టింది. అప్పటికే ఆ టైటిల్ ని ఫిలిం ఛాంబర్ లో వేరే నిర్మాతలు రిజిస్టర్ చేయించి ఉన్నారు. వాళ్ళు ఆ టైటిల్ ని ఇచ్చేందుకు ముందుగా ఒప్పుకోలేదు. దీంతో టైటిల్ ని మార్చే ఉద్దేశ్యం మొన్నటి వరకు ఉన్నింది. కానీ ఇప్పటికే టైటిల్ జనాల్లోకి బాగా వెళ్ళిపోయింది. ఈ సమయంలో టైటిల్ మారిస్తే సినిమా మీద నెగటివిటీ ఏర్పడుతుందని, ఆ టైటిల్ రైట్స్ కలిగి ఉన్న నిర్మాతలకు కోరిన డబ్బులిచ్చి విడిపించుకున్నాము’ అంటూ చెప్పుకొచ్చాడు దిల్ రాజు.