IPL 2023 Final GT Vs CSK: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ ఎడిషన్ ఫైనల్ మ్యాచ్ వ్యూయర్షిప్ ప్రపంచ రికార్డు సృష్టించింది. జియో సినిమా యాప్ లో ఐపీఎల్ మ్యాచ్ లు లైవ్ స్ట్రీమ్ అవుతున్న విషయం తెలిసిందే. అయితే, ఫైనల్ మ్యాచ్ ను ప్రపంచంలోనే ఇప్పటి వరకు ఏ మ్యాచ్ ను చూడని విధంగా కోట్లాది మంది అభిమానులు జియో సినిమాలో వీక్షించారు. గుజరాత్ టైటాన్స్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో మూడు మిలియన్ల మందికిపైగా అంటే 3.2 కోట్ల మంది మ్యాచ్ ను వీక్షించారు. గతంలో ఎప్పుడు ఒక లైవ్ స్ట్రీమింగ్ మ్యాచ్ ను యాప్ లో ఇంత మంది చూడలేదట. దీంతో ఈ మ్యాచ్ ప్రపంచ రికార్డును నమోదు చేసింది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫైనల్ మ్యాచ్ అత్యంత ఆసక్తిగా సాగింది. ఫైనల్ మ్యాచ్ గుజరాత్ లోని అహ్మదాబాద్ నగరంలో గల నరేంద్ర మోడీ స్టేడియంలో నిర్వహించారు. ఫైనల్ మ్యాచ్ బంతి బంతికి ఉత్కంఠగా సాగింది. విజయం ఏ క్షణాన ఎవరు పక్షం నిలుస్తుందో తెలియదు అన్నట్టుగా సాగింది. క్రీజులో స్టార్ బ్యాట్స్ మెన్ ఉన్నా విజయంపై ఓ రేంజ్ లో సస్పెన్స్ కొనసాగింది. ఇరు జట్ల మధ్య విజయం తోబూచులాడుతూ ఆఖరుకు చెన్నై జట్టును వరించింది. సాధారణంగా ఫైనల్ మ్యాచ్ పట్ల ఆసక్తి పెరగడానికి చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కారణం. ఐపీఎల్ కు ధోని ఈ ఏడాది తరువాత గుడ్ బై చెబుతాడు అన్న ప్రచారం జరగడంతో పెద్ద ఎత్తున చెన్నై, ధోని అభిమానులు మ్యాచ్ చూసేందుకు స్టేడియాలకు వచ్చారు. టికెట్లు దొరకని మ్యాచ్ చూసేందుకు అవకాశం లేని కోట్లాది మంది టీవీల్లో, జియో సినిమా యాప్ లో మ్యాచ్ లైవ్ టెలికాస్ట్ చూశారు.
రికార్డు సృష్టించిన జియో సినిమా వ్యూస్..
ఐపీఎల్ 2023 అధికారిక డిజిటల్ స్ట్రీమింగ్ పార్టనర్ అయిన జియో సినిమా సోమవారం నాడు 3.2 కోట్ల మంది వీక్షకులతో సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. ఈ సంవత్సరం ఐపీఎల్ ను వీక్షించడంలో లైవ్ స్ట్రీమ్ ప్రపంచ రికార్డును బద్దలు కొట్టింది ఫైనల్ మ్యాచ్. దీనికి ముందు గుజరాత్ టైటాన్స్ – ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన రెండో క్వాలిఫైయర్
మ్యాచ్ లో గుజరాత్ ఇన్నింగ్స్ సుబ్ మన్ గిల్ సంచలన సెంచరీ నమోదు చేసిన సమయంలో 2.57 కోట్ల మంది జియో సినిమాలో వీక్షించారు. జులై 2019లో జరిగిన ఒక మ్యాచ్ లో ఏక కాలంలో 2.5 కోట్ల మంది వీక్షకులను ఆకర్షించింది. ఇది చాలా సంవత్సరాలుగా చెక్కు చెదరని రికార్డు. జియో సినిమా ఈ సంవత్సరం ఐపీఎల్ మొదటి ఏడు వారాల్లో 1500 కోట్ల వీడియో వీక్షణలు సాధించడంతోపాటు డిజిటల్ స్పోర్ట్స్ వీక్షణ ప్రపంచంలో గ్లోబల్ బెంచ్ మార్కులను సెట్ చేసింది.
Web Title: Jiocinema broke the world record with 3 2 crore viewers for the ipl final
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com