https://oktelugu.com/

NTR Shoes: జూనియర్ ఎన్టీఆర్ వేసుకున్న ఈ షూస్ ధరతో ఒక కుటుంబం మొత్తం బ్రతికేయొచ్చు తెలుసా!

సినిమా విడుదలకు మూడు వారాల ముందు ఇలాంటి ట్రెండ్ ఉందంటే కచ్చితంగా ప్రీమియర్ షోస్ నుండి 3 మిలియన్ డాలర్లకు పైగా గ్రాస్ వసూళ్లు రాబడుతుందని అంటున్నారు ట్రేడ్ పండితులు. ప్రభాస్ నటించిన 'కల్కి' చిత్రం నార్త్ అమెరికా నుండి 3.4 మిలియన్ డాలర్ల వసూళ్లు కేవలం ప్రీమియర్ షోస్ నుండి రాబట్టింది.

Written By:
  • Vicky
  • , Updated On : September 10, 2024 / 04:08 PM IST

    NTR Shoes

    Follow us on

    NTR Shoes: యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన ‘దేవర’ చిత్రం ఈ నెల 27 వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అవ్వబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ సినిమా మేనియా నే కనిపిస్తుంది. ఈ చిత్రం లోని పాటలు సోషల్ మీడియా ని ఊపేసాయి. రోజురోజుకి అభిమానుల్లో, ప్రేక్షకుల్లో అంచనాలు పెంచేలా చేసాయి. నేడు సాయంత్రం ఈ సినిమాకి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ కూడా విడుదల కాబోతుంది. ట్రైలర్ విడుదలకు ముందే ఈ సినిమాకి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ఓవర్సీస్ లో మొదలయ్యాయి. అనేక ప్రాంతాలలో రికార్డు స్థాయి బుకింగ్స్ జరగగా, నార్త్ అమెరికా లో దాదాపుగా 1 మిలియన్ డాలర్స్ కి దగ్గరగా గ్రాస్ వసూళ్లు అడ్వాన్స్ బుకింగ్స్ నుండి రాబట్టింది ఈ చిత్రం.

    సినిమా విడుదలకు మూడు వారాల ముందు ఇలాంటి ట్రెండ్ ఉందంటే కచ్చితంగా ప్రీమియర్ షోస్ నుండి 3 మిలియన్ డాలర్లకు పైగా గ్రాస్ వసూళ్లు రాబడుతుందని అంటున్నారు ట్రేడ్ పండితులు. ప్రభాస్ నటించిన ‘కల్కి’ చిత్రం నార్త్ అమెరికా నుండి 3.4 మిలియన్ డాలర్ల వసూళ్లు కేవలం ప్రీమియర్ షోస్ నుండి రాబట్టింది. ఇప్పుడు ఈ రికార్డు దాదాపుగా బద్దలు అయినట్టే అని అంటున్నారు ట్రేడ్ పండితులు. ఇదంతా పక్కన పెడితే జూనియర్ ఎన్టీఆర్ హిందీ ప్రొమోషన్స్ ని చాలా సీరియస్ గా తీసుకున్నట్టు తెలుస్తుంది. త్వరలోనే ఆయన ప్రముఖ దర్శకుడు సందీప్ వంగ తో చేసిన లేటెస్ట్ ఇంటర్వ్యూ విడుదల కాబోతుంది. ఈ ఇంటర్వ్యూ కి సంబంధించిన ఒక ఫోటో సోషల్ మీడియా లో లీక్ అయ్యింది. ఇందులో సందీప్ వంగ ఎదురుగా నిల్చొని ఉండగా, ఎన్టీఆర్ స్టైల్ గా నిల్చొని ఉన్న ఫోజుని మనం గమనించొచ్చు. ఈ ఫోజులో ఎన్టీఆర్ వేసుకున్న షూస్ అభిమానులను ప్రత్యేకంగా ఆకర్షించింది. వైట్ & బ్లాక్ కాంబినేషన్ లో చూసేందుకు చాలా స్టైలిష్ గా కనిపిస్తున్న ఈ షూస్ ‘బాలెన్సియాగా’ అనే కంపెనీ కి సంబంధించినది. ఎన్టీఆర్ ధరించే దుస్తులు, షూస్, వాచులు కొనుగోలు చెయ్యాలని అనుకునే అభిమానులు, ఈ షూస్ ధర ఎంత ఉంటుందో తెలుసుకునేందుకు గూగుల్ మొత్తం వెతికారు.

    ఆ షూస్ ధర చూసిన తర్వాత అభిమానులకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యినంత పని అయ్యింది. ఈ షూస్ ధర అక్షరాలా 995 డాలర్లు ఉంది. అంటే దాదాపుగా 80 వేల రూపాయలకు పైమాటే. ఈ డబ్బులతో ఒక మధ్య తరగతి కుటుంబం నెల మొత్తం ఎలాంటి చీకుచింతా లేకుండా బ్రతికేయొచ్చు. కానీ ఎన్టీఆర్ లాంటి వారికి ఇలాంటి వస్తువులు చాలా చౌక ధర అని చెప్పొచ్చు. ఈ షూస్ ఇప్పుడు సోషల్ మీడియా లో తెగ ట్రెండింగ్ గా మారింది. ఎంత డబ్బులైనా పర్వాలేదు, కొనేయాలి అని కొంతమంది అభిమానులు చూస్తుంటే, అంత డబ్బులు పెట్టుకునే స్తొమత మనకి ఎక్కడుంది, ఉన్న దాంతో సర్దుకుపోదాం అని మరికొంతమంది అనుకుంటున్నారు.