Jasprit Bumrah : ఇదే నెలలో టీమిండియా ఇంగ్లాండ్ (England) జట్టుతో టి20, వన్డే సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్లో టి20 టోర్నీకి సూర్యకుమార్ యాదవ్ (Surya Kumar Yadav), వన్డే జట్టుకు ( Rohit Sharma) నాయకత్వం వహిస్తారు. ఇంగ్లాండ్ జట్టుతో సిరీస్ ముగిసిన తర్వాత టీమ్ ఇండియా ఛాంపియన్స్ ట్రోఫీ (champions trophy) ఆడేందుకు దుబాయ్ (Dubai) వెళ్తుంది. ఈ టోర్నీ వచ్చే నెలలో జరుగుతుంది. ఈ టోర్నికి ముందు టీమిండియా కు బిగ్ షాక్ తగిలింది. ఎందుకంటే ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా స్పీడ్ తుఫాన్ బుమ్రా(Bhumra) ఆడే అవకాశం లేదట.. ఎందుకంటే ఆస్ట్రేలియా సిరీస్ లో బుమ్రా వెన్ను నొప్పి తో ఇబ్బందిపడ్డాడు. సిడ్ని టెస్టులో అతడు ఆడలేకపోయాడు. రెండవ ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ కు వచ్చిన అతడు కేవలం 3 బంతులు మాత్రమే ఎదుర్కొన్నాడు. వెంటనే అవుట్ అయ్యాడు. అయితే అతడు బౌలింగ్ కు వస్తాడని అందరూ అనుకున్నారు. కానీ అతడు బౌలింగ్ కు రాలేదు. అయితే అతడిని పరీక్షించిన వైద్యులు..వెన్ను నొక్కితో బాధపడుతున్నాడని గుర్తించారు. ఆ తర్వాత అతడు ఇండియాకు వచ్చిన అనంతరం వైద్యులు పరీక్షించారు. అయితే అతడికి దాదాపు 3 నెలల పాటు విశ్రాంతి అవసరమని తేల్చారు. ఫలితంగా అతడు ఛాంపియన్స్ ట్రోఫీ లో ఆడేది అనుమానమేనని తేలిపోయింది.
విశ్రాంతి ఇచ్చారు
ఛాంపియన్స్ ట్రోఫీ ని దృష్టిలో పెట్టుకొని టీ మీడియా మేనేజ్మెంట్ బుమ్రాకు ఇంగ్లాండ్ సిరీస్ కు విశ్రాంతి ఇచ్చింది. టి20, వన్డేలలో అతడి స్థానంలో మిగతా బౌలర్లకు అవకాశం ఇచ్చింది. ఇంగ్లాండ్ తో జరిగే వన్డే, టి20 ద్వారా టీమిండియాలోకి షమీ(shami) ఎంట్రీ ఇవ్వనున్నాడు. అతడు దాదాపు ఏడాది గ్యాప్ తర్వాత టీమ్ ఇండియాలోకి వస్తున్నాడు.. బుమ్రా ఛాంపియన్స్ ట్రోఫీ లో ఆడేది కష్టం కావడంతో.. అతడి స్థానాన్ని షమీ భర్తీ చేస్తారని తెలుస్తోంది. అభిమానులు కూడా ఇదే దిశగా ఆలోచిస్తున్నారు. గత వన్డే వరల్డ్ కప్ లో బుమ్రా కు దరిదాపుగా షమీ వికెట్లు సాధించాడు. బుమ్రా చాంపియన్స్ ట్రోఫీలో ఆడేది కష్టమే అని వైద్యులు చెప్పడం.. బీసీసీఐ అధికారులు కూడా దీనిని ధ్రువీకరించడంతో టీమ్ ఇండియా ఫ్యాన్స్ ఆందోళనలో కూరుకు పోయారు. మరోవైపు 2017లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ లో భారత్ ఫైనల్ లో పాకిస్తాన్ చేతిలో ఓడిపోయింది. ఈసారి ఆ తప్పుకు తావు ఇవ్వకుండా.. ట్రోఫీ గెలవాలని భావిస్తోంది. అయితే బుమ్రాకు గాయం కావడంతో ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది.