Mahesh Babu-Rajamouli movie : సినిమా ఇండస్ట్రీలో దర్శక ధీరుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న దర్శకుడు రాజమౌళి ఈయన చేసిన ప్రతి సినిమా మంచి విజయాన్ని సాధిస్తూ వస్తున్నాయి. ఇక దాంతో ఇప్పుడు మహేష్ బాబుతో పాన్ వరల్డ్ లో ఒక సినిమాను తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక ఈ సినిమాలో నటీనటుల ఎంపిక విషయంలో రాజమౌళి చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన పూజ కార్యక్రమాలను కూడా రీసెంట్ గా నిర్వహించడంతో ఇప్పుడు నటునటుల విషయాన్ని బయటకు తెలియజేయడానికి ఆసక్తి చూపిస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి ఏది ఏమైనా కూడా రాజమౌళి పూజా కార్యక్రమం జరిగినప్పుడే ఈ సినిమాకు సంబంధించిన ప్రెస్ మీట్ పెట్టి సినిమా స్టోరీ ఏంటో ఎక్స్ ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటాడు. కానీ ఈ సినిమా విషయంలో మాత్రం అలాంటిది ఏది చేయకుండా ఉన్నాడు. కారణం ఏదైనా కూడా ఈ సినిమాలో ఒక స్టార్ హీరోని భాగం చేయబోతున్నారనే వార్తలైతే వినిపిస్తున్నాయి. ఇక ఇప్పటికే ఈ సినిమా మీద హైప్ ఉన్న నేపథ్యంలో మరింత హైప్ ని మూటగట్టుకోవడానికే ఆ స్టార్ ని ఈ సినిమాలో భాగం చేస్తున్నారట. ఇంతకీ ఆయన ఎవరు అంటే తమిళ్ సినిమా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సంపాదించుకున్న కమల్ హాసన్ ఈ సినిమాలో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ లో నటించబోతున్నాడనే విషయమైతే తెలుస్తోంది.
ఇక ఆయన క్యారెక్టర్ ఏంటి అనేది ఎవరు చెప్పనప్పటికీ ఆయన మాత్రం ఈ సినిమాలో నటించబోతున్నాడు అంటూ సినిమా యూనిట్ నుంచి కొన్ని వార్తలైతే బయటికి వస్తున్నాయి. ఇక ఇప్పటికే ఆయన చేయబోయే సినిమాలో విలన్ గా నటించే విషయం మనకు తెలిసిందే. కాబట్టి మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్ లో వస్తున్న సినిమా మీద కూడా ఆయన మొదటి నుంచి ఆసక్తిగా ఉన్నాడు.
అయితే రాజమౌళి క్యారెక్టర్ కి పలు రకాల హీరోలను అనుకున్నప్పటికి వాళ్ళు ఎవరూ దానికి సెట్ అవ్వదని రాజమౌళి ఎట్టకేలకు కమల్ హాసన్ తో ఆ పాత్రను చేయించాలనే ప్రయత్నం చేస్తున్నారట. మరి కమల్ హాసన్ ఆ పాత్రకి సరిపోతాడా లేదా అనే కోణంలో మరికొన్ని అనుమానాలైతే వ్యక్తం అవుతున్నాయి.
ఇక ఏది ఏమైనా కూడా జక్కన్న తీసుకునే నిర్ణయంలో చాలా క్లారిటీ ఉంటుంది. కాబట్టి ఆయన డిసిజన్ తీసుకున్నాడు అంటే అది ఫైనల్ అయినట్టే… కాబట్టి కమల్ హాసన్ కూడా ఈ సినిమాలో నటిస్తున్నాడు అంటూ కొన్ని వార్తలైతే బయటకు వస్తున్నాయి…