Jasprit Bumrah Match Winning Spell Vs England Semi Final: ప్రతి బంతి ఒక బుల్లెట్ లాగా వెళ్ళింది. ఎక్కడ కూడా ప్రత్యర్థి ఆటగాడికి అవకాశం ఇవ్వలేదు. ముఖ్యంగా ఇంగ్లాండ్ బ్యాటర్లు వీరవిహారం చేస్తున్న వేళ.. అతడు సంధించిన బంతులు చుక్కలు చూపించాయి. ఫలితంగా టీమిండియా విజయం సాధించింది. ఉత్కంఠ గా సాగిన పోరులో.. ఇంగ్లాండ్ జట్టును మట్టి కరిపించింది.
Also Read: రాష్ట్ర రాజకీయాల్లో ముగిసిన నితీశ్ శకం.. బీజేపీ ఖాలాలోకి బిహార్!
ముంబై వేదికగా గురువారం రాత్రి జరిగిన సెమీఫైనల్ మ్యాచ్లో టీమిండియా ఏడు పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో టీమిండియా ముందుగా పరుగుల వేట మొదలు పెట్టింది. ఏకంగా 253 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం బ్యాటింగ్ మొదలుపెట్టిన ఇంగ్లాండ్ జట్టు 246 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ జట్టులో బెతెల్ 105 పరుగులు చేశాడు. విల్ జాక్స్ 35.. బట్లర్ 25 పరుగులు చేశారు.
ప్లాట్ మైదానం కావడంతో పరుగుల వరద పారింది. ఇంగ్లాండ్ బౌలర్ల మాదిరిగానే.. భారత బౌలర్లు కూడా దారుణంగా పరుగులు ఇచ్చారు.. అర్ష్ దీప్ సింగ్ నాలుగు ఓవర్లలో 51, హార్దిక్ పాండ్యా నాలుగు ఓవర్లలో 38, వరుణ్ చక్రవర్తి అయితే నాలుగు ఓవర్లలో 64, అక్షర్ పటేల్ మూడు ఓవర్లలో 35, శివం దుబే ఒక ఓవర్ వేసి 22 పరుగులు సమర్పించుకున్నారు. కానీ బుమ్రా మాత్రం అదిరి పోయే రేంజ్ లో బౌలింగ్ వేశాడు. నాలుగు ఓవర్ల పాటు బౌలింగ్ వేశాడు. 33 పరుగులు ఇచ్చి, ఒక వికెట్ కూడా పడగొట్టాడు.
ముఖ్యంగా 18 ఓవర్ వేయడం ద్వారా బూమ్రా మ్యాచ్ మొత్తాన్ని ఇండియా వైపు తిప్పాడు. ఆ ఓవర్లో అతడు కేవలం ఆరు పరుగులు మాత్రమే ఇచ్చాడు. బెతల్ భీకరమైన ఫామ్ లో ఉన్నప్పటికీ.. బుమ్రా బంతులకు తలవంచాల్సి వచ్చింది. సామ్ కరణ్ కూడా దూకుడును తగ్గించాల్సి వచ్చింది. ఈ ఓవర్లో ఆరు పరుగులు రావడం ద్వారా ఇంగ్లాండ్ జట్టు మీద ఒత్తిడి పెరిగిపోయింది. ఆ తర్వాత ఓవర్లో హార్దిక్ పాండ్యా 9 పరుగులు ఇచ్చాడు. సామ్ కరణ్ ఔట్ కావడంతో మ్యాచ్ మొత్తం భారత జట్టు వైపు మళ్ళిపోయింది.