Vijay Deverakonda And Naveen Polishetty: ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో యంగ్ హీరోలు ముందుకు దూసుకెళ్తున్నారు. డిఫరెంట్ సబ్జెక్టులను ఎంచుకొని పాన్ ఇండియా ప్రేక్షకులను సైతం మంత్ర ముగ్ధులను చేస్తున్నారు. ఇప్పటివరకు చేసిన సినిమాలన్నింటిని పక్కనపెట్టి ఇప్పటినుంచి డిఫరెంట్ పంథా లో ముందుకు సాగాలనే ప్రయత్నంలో ఉన్నారు. ఇక విజయ్ దేవరకొండ నవీన్ పోలిశెట్టి లాంటి నటులు మాత్రం వైవిధ్య భరితమైన సినిమా లను చూపిస్తున్నారు… ఇండస్ట్రీ కి వచ్చే ముందు వీళ్ళు థియేటర్ ఆర్ట్స్ నేర్చుకున్నారు. అక్కడ విపరీతమైన నాటకాలను వేసి ఆ పాత్రలోని హావభావాలు ఎలా ఉంటాయి? వాటిని మనం ఎలా పలికించాలి అనేది కూడా చాలా చక్కగా నేర్చుకున్నారు. దాని వల్లే వీళ్ళు ఇప్పుడు ఎలాంటి పాత్రనైనా సరే చాలా అలవోకగా చేసి మెప్పించగలుగుతున్నారు…
Also Read: తెలుగు రాష్ట్రాల్లో ‘ధురంధర్ 2 ‘ కి బయ్యర్స్ కరువు.. కారణం ఏంటంటే!
ఇక రీసెంట్ గా నవీన్ పోలిశెట్టి ‘అనగనగా ఒక రాజు’ అనే సినిమాతో సూపర్ సక్సెస్ ను సాధించాడు. ఇక గత సంవత్సరం విజయ్ దేవరకొండ చేసిన ‘కింగ్ డమ్’ మూవీ చేసి ప్లాప్ ను మూట గట్టుకున్నాడు. అయిన కూడా తన మార్కెట్ కి మాత్రం ఎలాంటి ఇబ్బంది కలుగలేదు… వీళ్ళిద్దరు కెరియర్ స్టార్టింగ్ లో శేఖర్ కమ్ముల చేసిన ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ సినిమాలో నెగెటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లో నటించారు. ఇక ఈ క్రమంలోనే నవీన్ పోలిశెట్టి లవర్ గా శ్రియ నటించింది.
ఇంకా ఆ సమయంలో శ్రియ మీద విజయ్, నవీన్ ఇద్దరు పంచులు వేస్తూ ఆమెను ఫుల్ గా నవ్వించే వారట. అప్పుడప్పుడు ఆమెకు చిరాకు కూడా పుట్టించే వారట. మొత్తానికైతే వీళ్ళు చేసిన కోతి పనుల వల్ల ఆమె చాలా బాగా నవ్వుకున్నానని సినిమా ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుందని పలు సందర్భాల్లో తెలియజేసింది.
ప్రస్తుతం శ్రియ కొన్ని ఇంపార్టెంట్ క్యారెక్టర్ లలో మాత్రమే నటిస్తుంది. ఇక నవీన్ పోలిశెట్టి విజయ్ దేవరకొండ ఇద్దరు కూడా సూపర్ సక్సెస్ లను సాధించడానికి తీవ్రమైన ప్రయత్నాలు చేస్తున్నారు. తొందర్లోనే వాళ్ళు అనుకున్న సినిమాలను చేసి భారీ విజయాలను సాధిస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది…