Jaspreet Bumrah : బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత జట్టు అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో రెండవ టెస్ట్ ఆడుతోంది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత జట్టు 180 పరుగులకు కుప్పకూలింది. తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి 42 పరుగులతో హైయెస్ట్ స్కోరర్ గా నిలిచాడు. కేఎల్ రాహుల్ 37, గిల్ 31, అశ్విన్ 22, 21 పరుగులు చేసి ఆకట్టుకున్నారు. కోహ్లీ 7, రోహిత్ 3 పరుగులకు ఔటై అభిమానుల అంచనాలను అందుకోలేకపోయారు. ఓపెన్ యశస్వి జైస్వాల్, హర్షిత్ రాణా, బుమ్రా 0 పరుగులకే అవుట్ అయ్యారు.
కొంచెం తీపి కొంచెం చేదు..
బుమ్రా (డిసెంబర్ 6) శుక్రవారం 31 వ సంవత్సరంలోకి అడుగు పెట్టాడు. ఖవాజా ను అవుట్ చేయడం ద్వారా 2024లో టెస్ట్ క్రికెట్లో 50 వికెట్లు సాధించిన బౌలర్ గా బుమ్రా రికార్డు సృష్టించాడు. ఇదే దశలో పుట్టినరోజు నాడు డక్ అవుట్ అయిన ఆటగాడిగా చెత్త రికార్డు నమోదు చేసుకున్నాడు. 1978 భారత జట్టు వెస్టిండీస్ తో టెస్ట్ మ్యాచ్ ఆడుతోంది. ఆ మ్యాచ్ లో భారత ఆటగాడు సయ్యద్ కీర్మాణి డక్ అవుట్ అయ్యాడు. ఇంగ్లాండ్ జట్టుతో 1996లో జరిగిన మ్యాచ్లో టీమిండి ఆటగాడు వెంకటపతి రాజు సున్నా పరుగులకే పెవిలియన్ చేరుకున్నాడు. ఇంగ్లాండ్ జట్టుతో 2018 లో జరిగిన మ్యాచ్లో భారత ఆటగాడు ఇశాంత్ శర్మ తన పుట్టినరోజు నాడు డక్ అవుట్ అయ్యాడు. ఇప్పుడు వీరి సరసనే బుమ్రా చేరిపోయాడు. దీంతో పుట్టినరోజు నాడు 50 వికెట్ల క్లబ్లో చేరిన విషయం తీపిని పంచగా.. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు సున్నా పరుగులకు అవుట్ కావడం బుమ్రా కు చేదు ఫలితాన్ని ఇచ్చింది. అడిలైడ్ వేదికగా జరిగిన మ్యాచ్లో బుమ్రా 8 బంతులు ఎదుర్కొన్నాడు. ఒక్క పరుగు కూడా చేయలేకపోయాడు. కమిన్స్ బౌలింగ్లో ఉస్మాన్ ఖవాజాకు క్యాచ్ ఇచ్చి బుమ్రా అవుట్ అయ్యాడు. ఆస్ట్రేలియా ఓపెనర్ ఉస్మాన్ ఖవాజాను అవుట్ చేసి 2024 లో టెస్ట్ క్రికెట్లో 50 వికెట్లు సాధించిన బౌలర్ గా బుమ్రా ఆవిర్భవించాడు.
కాగా, పెర్త్ ఓటమి నుంచి త్వరగానే కోరుకున్న ఆస్ట్రేలియా.. అడిలైడ్ టెస్టులో తొలి రోజు పై చేయి సాధించింది. ముందుగా టీం ఇండియాలో 180 పరుగులకు కుప్ప కూల్చిన ఆస్ట్రేలియా జట్టు.. తర్వాత ఇన్నింగ్స్ మొదలు పెట్టింది. వికెట్ నష్టానికి 86 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజ్ లో లబూషేన్(20), మెక్ స్వీని(38) ఉన్నారు.