Jagan And Sharmila: చిన్న తప్పిదాలే రాజకీయాల్లో శాపంగా మారుతాయి. దానికి భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు జగన్ కు ఎదురైంది అదే. 2019 ఎన్నికల్లో గెలిచిన తర్వాత షర్మిల విషయంలో తప్పు చేశారు జగన్. అదే ఆయనకు శాపంగా మారింది. ఆస్తి పంపకాల విషయంలో సైలెంట్ గా ఉన్న షర్మిల.. తాజాగా జగన్ ఎన్సీఎల్టీలో వేసిన పిటిషన్ తో భగ్గుమన్నారు. అయితే అటు తర్వాత ఆమె వేసిన అడుగులు..తల్లి విజయమ్మ వైఖరి కుటుంబాన్ని కుదిపేస్తున్నాయి. అంతకుమించి జగన్ కు తీవ్ర నష్టానికి గురిచేస్తున్నాయి.రాజకీయంగా దెబ్బతీస్తున్నాయి. వైయస్సార్ అంటే విశ్వసనీయత. అదే స్లోగన్ తో ముందుకు సాగారు జగన్.ఇచ్చిన మాట తప్పకుండా నెరవేరుస్తారనేది జగన్ పై ప్రజలకు ఉండే నమ్మకం. మొన్నటి ఎన్నికలతో ఆ నమ్మకం సడలింది. ఇప్పుడు కుటుంబం రూపంలో జగన్ పై కొత్త విమర్శ ప్రారంభం అయ్యింది. సొంత కుటుంబం సైతం జగన్ పై నమ్మకం లేక బయటపడింది. మద్దతు తెలిపిన సొంత భార్య ఇప్పుడు జగన్ ను వ్యతిరేకిస్తున్నారు. అయితే జగన్ వైఖరితో.. చెల్లెలి చెంతకు చేరిపోయారు తల్లి విజయమ్మ. దీనికి ముమ్మాటికీ జగన్ వైఖరి కారణం.వారిద్దరూ ఇప్పుడు ఆగర్భ శత్రువులుగా మారిపోయారు. పైకి కేవలం ఇది కుటుంబ ఆస్తి వివాదం. కానీ దీని మాటున జగన్ కు జరుగుతున్న నష్టం అంచనాలకు అందనిది.
* రచ్చ చేస్తే అంతే మరి
కుటుంబ వివాదాలు నాలుగు గోడల మధ్య పరిష్కారం అయితేనే సమసిపోతాయి. ఒక్కసారి రచ్చకు ఎక్కితే మాత్రం జనంలో పలుచన కావడం ఖాయం. అందునా ఎంతో చరిత్ర కలిగిన వయస్ కుటుంబం రచ్చకెక్కడం వల్ల రాజకీయంగాను, ఆస్తుల పరంగాను, పరపతి పరంగాను షర్మిల కంటే జగన్ కి ఎక్కువ నష్టం. చెల్లెలితో ఆస్తి వివాదాలు పరిష్కరించుకోవచ్చు కానీ.. గత ఎన్నికల్లో షర్మిల కొట్టిన దెబ్బ మాత్రం జగన్ మరిచిపోలేరు. మానసికంగా అది ఎప్పుడు వెంటాడుతూనే ఉంటుంది.
* జగన్ కి కష్టకాలం
ఈ ఎన్నికల్లో వైసీపీ దారుణంగా ఓడిపోయింది. కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. రాజకీయంగా అడుగులు ఎటు వేయాలో తెలియక జగన్ మల్లగుల్లాలు పడుతున్నారు. చెల్లెలి రూపంలో ఎదురైన సమస్యను పరిష్కరించలేకపోతున్నారు. తల్లిని సైతం దూరం చేసుకున్నారు. సహజంగానే ఇది ప్రత్యర్థులకు అస్త్రంగా మారుతుంది. మహిళల విషయంలో జగన్ వైఖరి జనాల్లో రోజు చర్చకు దారితీస్తోంది. అయితే ఇది కోలుకోలేని నష్టం. పూడ్చుకోవడం కూడా. కేవలం షర్మిల ఆస్తి వివాదంలోనే కాదు. రేపు ఇండియా కూటమిలోకి జగన్ వెళ్ళినా.. రాజకీయ అడుగులకు ఎప్పటికప్పుడు బ్రేక్ వేస్తూనే ఉంటారు. రాజకీయంతో పాటు అధికారాన్ని షేర్ చేయాల్సిందేనని పట్టుబడతారు. ఒక విధంగా చెప్పాలంటే ఇది జగన్ స్వయంకృతాపరాధమే. గోటితో పోయేదానికి గొడ్డలి దాకా తీసుకొచ్చారని విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. మరి ఎలా పరిష్కరించుకుంటారో చూడాలి.