https://oktelugu.com/

Ind Vs Nz 3rd Test: 12 పరుగులకో వికెట్.. టీమిండియా బౌలర్లు రెచ్చిపోతే ఇలానే ఉంటుంది మరి

బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో పేస్ వికెట్ రూపొందించారు. వర్కౌట్ కాలేదు. పూణే మైదానంపై స్పిన్ వికెట్ తయారు చేశారు. ఇక్కడ కూడా అదే ఫలితం. ముంబైలోని వాంఖడే మైదానాన్ని స్పిన్ వికెట్ తో తీర్చిదిద్దారు. ఫలితం కనిపించింది.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : November 1, 2024 / 05:12 PM IST

    Ind Vs Nz 3rd Test(2)

    Follow us on

    Ind Vs Nz 3rd Test: బెంగళూరు, పూణే టెస్టులలో రవీంద్ర జడేజా పెద్దగా రాణించలేదు. రవిచంద్రన్ అశ్విన్ సత్తా చాటలేదు. దీనికి తోడు బ్యాటర్ల వైఫల్యం.. ఫలితంగా పుష్కరకాలం తర్వాత టీమ్ ఇండియా స్వదేశంలో టెస్ట్ సిరీస్ కోల్పోయింది. ఆస్ట్రేలియా, శ్రీలంక చేతిలో ఓడిపోయిన న్యూజిలాండ్ మన మీద గెలిచింది. ఆ జట్టు టెస్ట్ క్రికెట్ చరిత్రలో తొలిసారిగా మనపై సిరీస్ నెగ్గింది. టెస్ట్ సిరీస్ కోల్పోవడం ద్వారా భారత్.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్స్ లోకి వెళ్లాలంటే మిగతా మ్యాచ్ లలో గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక ముంబైలో ప్రారంభమైన మూడో టెస్టులో టీమిండియా బౌలర్లు రెచ్చిపోయారు. స్పిన్ వికెట్ పై పండగ చేసుకున్నారు.. ముఖ్యంగా రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ న్యూజిలాండ్ బ్యాటర్లకు చుక్కలు చూపించారు. భారీ స్కోర్ చేయకుండా ఎక్కడికక్కడే కట్టడి చేశారు. ఆరుగురు బ్యాటర్లను సింగిల్ డిజిట్ కు పరిమితం చేశారు. వీరిలో ఒక బ్యాటర్ గోల్డెన్ డక్ గా వెనుతిరిగాడు.

    టాస్ గెలిచి

    టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ జట్టుకు అదిరిపోయే ఆరంభం లభించలేదు. ఈ సిరీస్ లో సూపర్ ఫామ్ లో ఉన్న ఓపెనర్ కాన్వే నాలుగు పరుగులు మాత్రమే చేసి ఆకాష్ దీప్ బౌలింగ్లో వికెట్ల మధ్య దొరికిపోయాడు. కెప్టెన్లాతం 28 పరుగుల వద్ద వాషింగ్టన్ సందర్భంలో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. సూపర్ ఫామ్ లో ఉన్న రచిన్ రవీంద్ర అయిదు పరుగులు మాత్రమే చేసి వాషింగ్టన్ సందర్భంగా క్లీన్ బోర్డ్ అయ్యాడు. టామ్ బ్లాండిల్ రవీంద్ర జడేజా బౌలింగ్ లో బౌల్డ్ అయ్యాడు. గెన్ ఫిలిప్స్ కూడా జడేజా బౌలింగ్ లోనే బౌల్డ్ అయ్యాడు. ఇష్ సోది రవీంద్ర జడేజా బౌలింగ్లో వికెట్ల ముందు దొరికిపోయాడు యంగ్ (71), మిచల్(82) మాత్రమే భారత బౌలర్లను కాస్తలో కాస్త కాచుకున్నారు. వీరిద్దరు కనుక నిలబడకపోయి ఉంటే.. న్యూజిలాండ్ వంద పరుగుల లోపే చాప చుట్టేది.. 15 పరుగుల వద్ద కాన్వే రూపంలో న్యూజిలాండ్ జట్టు తొలి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత లాతం, యంగ్ రెండో వికెట్ కు 44 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఆ తర్వాత లాతం 28 పరుగుల వద్ద సుందర్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. ఐదు పరుగులు చేసిన రచన్ రవీంద్ర జట్టు స్కోరు 72 పరుగుల వద్ద ఉన్నప్పుడు సందర్భంలో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత యంగ్, మిచెల్ నాలుగో వికెట్ కు 87 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అయితే ఈ జోడిని సుందర్ విడదీశాడు.

    నిరాటంకంగా వికెట్ల పతనం

    ఆ తర్వాత న్యూజిలాండ్ జట్టు వికెట్ల పతనం నిరాటంకంగా సాగింది. 76 పరుగుల వ్యవధిలోనే మిగతా అన్ని వికెట్లను న్యూజిలాండ్ కోల్పోయింది. రవీంద్ర జడేజా నిప్పులు చేరడంతో న్యూజిలాండ్ జట్టు బ్యాటరీలు క్రీజ్ లో కుదురుకోవడానికే ఇబ్బంది పడ్డా. ముఖ్యంగా చివరి 4 వికెట్లను భారత బౌలర్లు వేగంగా పడగొట్టారు. 12 పరుగులకు ఒక వికెట్ చొప్పున తీసి.. న్యూజిలాండ్ జట్టును 235 పరుగులకే కుప్ప కూల్చారు. న్యూజిలాండ్ కెప్టెన్ తొలి రోజే ఆలౌట్ చేయడం పట్ల భారత బౌలర్ల పై ప్రశంసల జలు కురుస్తోంది. భారత బౌలర్లు స్వింగ్ లో ఉంటే ఇలానే ఉంటుందని సోషల్ మీడియాలో అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.