
ఐపీఎల్ లో పెను సంచలనం నమోదైంది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా సంచలనం సృష్టించాడు. దంచికొట్టాడు. అతడి ధాటికి ఐపీఎల్ లోనే అత్యధిక వికెట్లు తీసిన పర్పుల్ క్యాప్ హోల్డర్ గా ఉన్న హర్షపటేల్ బుక్కయ్యాడు.
టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన చెన్నై మొదట నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 191 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓపెనర్లు గైక్వాడ్ 33, డుప్లెసిస్ 50 పరుగులతో శుభారంభం చేశారు. సురేష్ రైనా 24 రాణించాడు.
అయితే చివర్లో బ్యాటింగ్ కు వచ్చిన ఆల్ రౌండర్ జడేజా మెరుపులు మెరిపించాడు. చివరి ఓవర్ వేసిన హర్ష పటేల్ బౌలింగ్ ను ఉతికి ఆరేశఆడు. జడేజా ఆ 6 బంతుల్లోనే ఐదు సిక్సులు, ఒక బౌండరీ, ఒక డబుల్ రన్ తో మొత్తం 37 పరుగులు వచ్చాయి. అందులో ఒక నోబాల్ కు కూడా రన్స్ వచ్చాయి.
సాధారణంగా 6 బంతుల్లో 6 సిక్సులు కొడితే 36 పరుగులు వస్తాయి. కానీ నోబాల్ తో ఫస్ట్ టైం ఒక ఓవర్ లో 37 పరుగులు అత్యధికంగా వచ్చాయి. ఇది ఒక రికార్డుగా చెప్పొచ్చు. నంబర్ 1 బౌలర్ ను ఉతికేసి జడేజీ ఈ రికార్డు సృష్టించాడు.