
దేశంలో కరోనా విలయతాండవం చేస్తున్న వేళ కాంగ్రెస్ ప్రధాన నేత రాహుల్ గాంధీ ప్రధాని మోదీ మరోసారి మోదీపై విమర్శనాస్త్రాలు సంధించారు. ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా విఫలమైందన్నారు. ప్రధాని మోదీ మన్ కీ బాత్ లో మాట్లాడిన నేపథ్యంలో రాహుల్ గాంధీ స్పందించారు. యంత్రాంగం విఫలమైంది. జన్ కీ బాత్ గురించి మాట్లాడాల్సిన సమయమిది అని ట్వీట్ చేశారు. ఈ సంక్షోభ సమయంలో దేశానికి బాధ్యతాయుతమైన పౌరులు అవసరమన్నారు రాహుల్.