Australian open 2025 : సినర్ వరుసగా రెండవ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ ను సొంతం చేసుకున్నాడు.. ఫైనల్ పోరులో సినర్.. జీవ్ పై అద్భుతమైన విజయాన్ని అందుకున్నాడు. ముచ్చటగా మూడోసారి ఫైనల్ చేరిన జ్వెరెవ్..మూడో సారి కూడా ఓటమిపాలయ్యాడు.. దీంతో అతడి గురించి నెట్టింట తీవ్ర చర్చ జరుగుతుంది. ” జ్వెరేవ్ అద్భుతమైన ఆట తీరు కొనసాగించాడు. టోర్నీ ప్రారంభించి అటాకింగ్ ఆట తీరుతో ఆకట్టుకున్నాడు. కానీ ఫైనల్ ఫోబియాను మాత్రం అధిగమించలేకపోయాడు. ముచ్చటగా మూడోసారి కూడా ఓటమిపాలయ్యాడు. ట్రోఫీ అందుకునే దశలో విఫలమయ్యాడు.. ఫలితంగా సినర్ రెండోసారి విజేతగా ఆవిర్భవించాడు.
హోరాహోరీగా..
ఆస్ట్రేలియన్ ఓపెన్ 2025 పురుషుల సింగిల్స్ ఫైనల్ ఆదివారం హోరాహోరీగా సాగింది. చివరి పోరిలో జర్మనీ ఆటగాడు అలెగ్జాండర్ జ్వెరేవ్ తన సత్తాను ప్రదర్శించాడు.. క్రమంలో సినర్ తనకు మాత్రమే సాధ్యమైన అటాకింగ్ ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. 6-3, 7-6(7-4), 6-3 తేడాతో జ్వెరేవ్ పై ఘన విజయం సాధించాడు. ఈ గెలుపు ద్వారా మూడవ గ్రాండ్ స్లామ్ టైటిల్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ ఘనత సాధించిన తొలి ఇటాలియన్ ఆటగాడిగా రికార్డ్ దక్కించుకున్నాడు.. గత ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్, యుఎస్ గ్రాండ్ స్లామ్ టైటిల్స్ ను సిరెన్ సొంతం చేసుకున్నాడు.
సినర్.. ఈ టోర్నీలో టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగాడు. చివరి వరకు అతడు అదే జోరు కొనసాగించాడు. తొలి సెట్ లో సినర్, జ్వెరేవ్ హోరాహోరిగా ఆడారు. ఫలితంగా 3-3 వద్ద నిలిచారు. కానీ ఆ తర్వాత సినర్ ఫామ్ లోకి వచ్చాడు. సెట్ సాధించాడు.. రెండవ సెట్లో జ్వెరేవ్ బౌన్స్ బ్యాక్ అన్నట్టుగా దూకుడు కొనసాగించాడు. 4-3 తేడాతో లీడ్ లోకి వచ్చాడు. అనంతరం ఇద్దరు కొదమసింహాల్లాగా పోరాడారు. దీంతో పాయింట్లు 6-6 సమం అయ్యాయి. దీంతో టై బ్రేకర్ తప్పలేదు. మొదట్లో జ్వెరేవ్ లీడ్ లో ఉన్నాడు. ఆ తర్వాత సినర్ పుంజుకున్నాడు. రెండవ సెట్ అందుకున్నాడు. మూడో సెట్లో జ్వెరేవ్ దూకుడుగా ఆడాడు. గట్టి పోటీ ఇచ్చాడు. కానీ అదే స్పీడ్ కొనసాగించలేకపోయాడు.. దీంతో సినర్ మూడో సెట్ లో తన స్పీడ్ కొనసాగించి..ఈ సెట్ కూడా దక్కించుకొని విజేతగా నిలిచాడు.. ఇక ఈ పోరులో సినర్ 6 ఏస్ లు కొట్టాడు. జ్వెరేవ్ 12 ఏస్ లు సంధించాడు. అయితే జ్వెరేవ్ పదేపదే తప్పులు చేశాడు. చివరికి మూల్యం చెల్లించుకున్నాడు. ఇక సినర్ రెండుసార్లు జ్వెరేవ్ సర్వీస్ ను బ్రేక్ చేయడం విశేషం.