టి20 మినహా మిగతా అన్ని ఫార్మాట్లలో రోహిత్ శర్మ టీమ్ ఇండియాకు సారధిగా ఉన్నాడు. ఇటీవలి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా రోహిత్ నాయకత్వం వహించాడు. అయితే ఆ సిరీస్ లో భారత్ దారుణంగా విఫలమైంది. దీంతో రోహిత్ క్రికెట్ కు వీడ్కోలు పలికేయాలని డిమాండ్ తెరపైకి వచ్చింది. ఈ క్రమంలో కోల్పోయిన తన ఫామ్ అందిపుచ్చుకోవడానికి రోహిత్ శర్మ అంజి మ్యాచ్ లు ఆడక తప్పడం లేదు. అయితే జమ్ము కాశ్మీర్ తో ఇటీవల జరిగిన రంజి మ్యాచ్ లో రోహిత్ ముంబై జట్టు తరఫున బరిలోకి దిగాడు. అయితే కేవలం మూడు పరుగులు మాత్రమే చేసి రోహిత్ అవుట్ అయ్యాడు. దీంతో రోహిత్ పై మళ్లీ విమర్శలు మొదలయ్యాయి. ఇలా ఆడితే ఎలా అంటూ అభిమానులు సోషల్ మీడియా వేదికగా రోహిత్ శర్మను ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలో పదిహేను సంవత్సరాల అభిమాని రోహిత్ శర్మను ఉద్దేశించి రాసిన లేఖ సామాజిక మాధ్యమాలలో సంచలనంగా మారింది.
ఇంతకీ ఆ లేఖలో ఏముందంటే..
” నాకు ఆరాధ్య ఆటగాడు. నాకు ఇష్టమైన క్రికెటర్.. అన్ని సమయాలలో నాకు అద్భుతమైన బ్యాటర్.. లక్షల మంది మీకు అభిమానిగా ఉన్నారు. వారందరి మాటను మీతో వ్యక్తం చేస్తున్నాను. మీకోసమే అద్భుతమైన క్రికెట్ ను చాలాకాలంగా నేను చూస్తున్నాను. ఈ కాలంలో మీరు క్రికెట్ ఆడుతున్నారు. మీరు ఆడుతున్న ఈ సందర్భంలోనే నేను పుట్టాను. ఇది నా గత జన్మ కాల అదృష్టంగా భావిస్తున్నాను. ఫామ్ అనేది తాత్కాలిక మాత్రమే. మీ ఆడే స్టైల్ శాశ్వతం.. ఇటీవల కాలంలో మీరు ఎన్ని ఇన్నింగ్స్ లు ఆడారు? ఏ స్థాయిలో పరుగులు చేశారు? అనేవి ప్రశ్నలు మాత్రమే కాదు. అసలు అవి ప్రశ్నలకు కూడా కాదు. మీరు అద్భుతమైన ట్రాక్ మీద ఉన్నారు. ఛాంపియన్స్ ట్రోఫీలో మీరు అద్భుతంగా ఆడతారని నాకు నమ్మకం ఉంది. రంజీలలో మీరు కొట్టిన మూడు సిక్సర్లు నాకు ఇప్పటికీ కళ్ళ ముందు కనిపిస్తూనే ఉన్నాయి. ఆరోజు నాకు మాథ్స్ క్లాస్.. అయినప్పటికీ అది ఎగ్గొట్టి మ్యాచ్ చూసాను. అది నాకు అత్యంత ముఖ్యం కాబట్టి అలానే చూశాను.. మిమ్మల్ని వ్యతిరేకించేవారు ఎప్పటికీ వ్యతిరేకిస్తూనే ఉంటారు. మీ సారథ్యం అద్భుతం. ప్రతి ఫార్మాట్లో మీరు ఆటగాడిగా విజయవంతమయ్యారు. నాయకుడిగాను విజయాలు అందుకున్నారు. ఉత్తమమైన ఆటగాడిగా మీరు కొనసాగుతూనే ఉన్నారు. మీకోసమే మేము ప్రతి మ్యాచ్ చూస్తాము.. ఎట్టి పరిస్థితుల్లో మీరు వీడ్కోలు పలకకండి.. మీరు ఓపెనింగ్ చేసేందుకు రాకపోతే.. నేను ఎందుకు టీవీ ఆన్ చేయాలి.. అసలు టీవీ ఎలా ఆన్ చేయగలను.. ఆవుహ నన్ను చాలా ఇబ్బంది పెడుతోంది.. క్రీడ విశ్లేషకుడు కావాలనేది నా జీవితాశయం. వస్తున్నా వయసు 15 సంవత్సరాలు.. రాజస్థాన్ జట్టులో నా ఇంటర్న్ షిప్ పూర్తి చేసుకున్నాను. ఒకవేళ మీరు నాకు ఏదైనా హెల్ప్ చేయగలిగితే.. అది నాకు తెలిసేలా చేయండి.. ఐ లవ్ యు రోహిత్.. మీరు కచ్చితంగా మీ పూర్వపు లయను అందుకుంటారని” ఆ బాలుడు తన లేఖలో పేర్కొన్నాడు.