సన్‌ రైజర్స్‌కు ఇది డూ ఆర్‌‌ డై మ్యాచ్‌

ఐపీఎల్‌ 2020 చివరి దశకు చేరుకుంటోంది. ఇందుకు మరో మ్యాచ్‌ మాత్రమే మిగిలి ఉంది. ఈ మ్యాచ్‌తో లీగ్‌ దశ ముగియనుంది. అలాగే.. ఇప్పటికే మూడు జట్లు ప్లే ఆఫ్స్‌కు చేరగా.. నాలుగో జట్టు కూడా ఏంటో తేలనుంది. టాప్‌లో ఉన్న ముంబయితో నేడు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తలపడబోతోంది. షార్జా వేదికగా జరుగనున్న ఈ మ్యాచ్‌లో సన్‌ రైజర్స్‌ గెలిస్తే ప్లేఆఫ్స్‌ ఆశలు సజీవం అవుతాయి. ఓడితే కోల్‌కతా నైట్‌ రైడర్స్‌కు మార్గం సుగమం అవుతుంది. Also […]

Written By: NARESH, Updated On : November 3, 2020 3:04 pm
Follow us on

ఐపీఎల్‌ 2020 చివరి దశకు చేరుకుంటోంది. ఇందుకు మరో మ్యాచ్‌ మాత్రమే మిగిలి ఉంది. ఈ మ్యాచ్‌తో లీగ్‌ దశ ముగియనుంది. అలాగే.. ఇప్పటికే మూడు జట్లు ప్లే ఆఫ్స్‌కు చేరగా.. నాలుగో జట్టు కూడా ఏంటో తేలనుంది. టాప్‌లో ఉన్న ముంబయితో నేడు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తలపడబోతోంది. షార్జా వేదికగా జరుగనున్న ఈ మ్యాచ్‌లో సన్‌ రైజర్స్‌ గెలిస్తే ప్లేఆఫ్స్‌ ఆశలు సజీవం అవుతాయి. ఓడితే కోల్‌కతా నైట్‌ రైడర్స్‌కు మార్గం సుగమం అవుతుంది.

Also Read: పీవీ సింధూ రిటర్ మెంట్.. ట్విస్ట్ ఇచ్చిందిలా!

ప్రస్తుతం పాయింట్ల పట్టికలో నైట్ రైడర్స్, సన్ రైజర్స్ జట్లు నాలుగు, అయిదు స్థానాల్లో ఉన్నాయి. కోల్‌కతా ఖాతాలో 14 పాయింట్లు, సన్ రైజర్స్ అకౌంట్‌లో 12 పాయింట్లు ఉన్నాయి. ముంబై ఇండియన్స్‌తో షార్జాలో ఈ సాయంత్రం జరిగే మ్యాచ్‌లో హైదరాబాద్ గెలిస్తే.. 14 పాయింట్లకు చేరుకుంటుంది. పాయింట్ల పరంగా సమానంగా ఉన్నప్పటికీ.. నైట్ రైడర్స్‌తో పోల్చుకుంటే మెరుగైన నెట్ రన్‌రేట్ ఉన్నందునా సన్ రైజర్స్ ప్లేఆఫ్‌కు చేరుకుంటుంది.

కానీ.. ఈ మ్యాచ్‌లో ముంబయితో ఢీకొంటున్న సన్‌రైజర్స్‌కు గెలుపు అంత ఈజీ కాదు. డేవిడ్ వార్నర్ సారథ్యంలోని సన్ రైజర్స్‌ కంటే బలంగా ఉంది ముంబయి. బ్యాటింగ్, బౌలింగ్ లైనప్ పకడ్బందీగా ఉంది. నిప్పులు చెరిగే బంతులను సంధించగల బౌలర్లు ఉన్నారు. పిడుగుల్లాంటి షాట్లను ఆడగల బ్యాటింగ్‌ వీరులతో నిండి ఉంది ఆ టీమ్. రోహిత్ శర్మ లేనప్పటికీ.. అతని స్థానాన్ని కీరన్ పొలార్డ్ భర్తీ చేశాడు. క్వింటన్ డికాక్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ వంటి హిట్లర్లు హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా వంటి ఆల్‌రౌండర్లతో టీమ్‌ సంపూర్ణ ప్రతిభతో ఉంది. అందులోనూ.. ఈ సీజన్‌లో అన్నింటి కంటే ముందే ప్లే ఆఫ్‌కు చేరింది.

Also Read: ప్లేఆఫ్స్‌ రేసులో సన్‌రైజర్స్ హైదరాబాద్ నిలిచేనా..!

ఏ విధంగానూ చూసినా ముంబయితో పోల్చుకుంటే సన్ రైజర్స్ కాస్త బలహీనమే. మిడిలార్డర్ చెప్పుకోదగ్గ బలంగా లేదు. ఓపెనర్లు డేవిడ్ వార్నర్, బెయిర్‌స్టో లేదా వృద్ధిమాన్ సాహా, మనీష్ పాండే మినహాయిస్తే మిడిలార్డర్‌లో నిలదొక్కుకుని భారీ షాట్లను ఆడే బ్యాట్స్‌మెన్ లేడు. జమ్మూ కాశ్మీర్‌కు చెందిన కొత్త కుర్రాడు అబ్దుల్ సమద్‌‌కు భారీ షాట్లు ఆడే సత్తా ఉన్నప్పటికీ.. అతను తడబడుతున్నాడు. టెయిలెండర్లలో జేసన్ హోల్డర్, రషీద్ ఖాన్ దూకుడుగా ఆడగలరు. వారు ఎంత సేపు క్రీజ్‌లో నిలదొక్కుకుంటారనే దాని మీదే టీమ్ ఆధారపడి ఉంది. చిన్న స్టేడియం షార్జాలో ముంబై ఇండియన్స్ బ్యాట్స్‌మెన్ల దూకుడును ఎలా అడ్డుకుంటారనేది ఆసక్తి రేపుతోంది. కాగా.. ఇప్పటివరకు సన్‌రైజర్స్‌, ముంబయి మధ్య జరిగిన మ్యాచ్‌లలో మాత్రం సమ ఉజ్జీవులుగా నిలిచాయి. మొత్తం 15 సార్లు రెండు జట్లు తలపడగా.. ముంబయి 8, సన్‌రైజర్స్‌ 7 సార్లు విజయం సాధించాయి.