ఫైటింగ్ చేసేందుకు భయపడుతున్న హీరోలు..!

టాలీవుడ్ సినిమా కమర్షియల్ చట్రంలో ఎప్పుడో ఇరుక్కుపోయింది. తెలుగు సినిమా నిర్మాతలు, దర్శకులు ప్రయోగాలకు ఎప్పుడో పుల్ స్టాప్ పెట్టారు. ఒకటి అర మినహా సినిమాలు మినహా అన్ని సినిమాలు ఒకే ఫార్మూలాను ఫాలో అవుతూ ఉంటాయి. సినిమా అంటే నాలుగు పాటలు.. నాలుగు ఫైట్స్.. హీరోహీరోయిన్ల రోమాన్స్ అనేలా ట్రెండ్ మారిపోయింది. మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్ పాటలు.. ఫైట్స్.. ప్రేమ.. కామెడీ.. రోమాన్స్ వీటినే తిప్పితిప్పి చూపించడం దర్శకులు అలవాటు చేసుకున్నారు. […]

Written By: NARESH, Updated On : November 3, 2020 3:03 pm
Follow us on

టాలీవుడ్ సినిమా కమర్షియల్ చట్రంలో ఎప్పుడో ఇరుక్కుపోయింది. తెలుగు సినిమా నిర్మాతలు, దర్శకులు ప్రయోగాలకు ఎప్పుడో పుల్ స్టాప్ పెట్టారు. ఒకటి అర మినహా సినిమాలు మినహా అన్ని సినిమాలు ఒకే ఫార్మూలాను ఫాలో అవుతూ ఉంటాయి. సినిమా అంటే నాలుగు పాటలు.. నాలుగు ఫైట్స్.. హీరోహీరోయిన్ల రోమాన్స్ అనేలా ట్రెండ్ మారిపోయింది.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

పాటలు.. ఫైట్స్.. ప్రేమ.. కామెడీ.. రోమాన్స్ వీటినే తిప్పితిప్పి చూపించడం దర్శకులు అలవాటు చేసుకున్నారు. అయితే కరోనా ప్రభావంతో సినిమాల్లో కొత్త మార్పులు వచ్చే అవకాశం కన్పిస్తోంది. టాలీవుడ్లో ఇప్పుడిప్పుడే సినిమాల సందడి మొదలైంది. యంగ్ హీరోలు, నటీనటులంతా సినిమా షూటింగుల్లో పాల్గొంటుగా అగ్రహీరోలు మాత్రం ఆచితూచి వ్యవహరిస్తున్నారు.

Also Read: చిరు సినిమాపై కీర్తిసురేష్ మౌనం.. అందుకేనా?

యంగ్ హీరో అయినా.. స్టార్ హీరో సినిమా అయినసరే ఇదే రోటిన్ ఫార్ములాతో 2.30 గంటల సినిమా ఉండనుంది. వీటికి భిన్నంగా ఏదైనా సినిమా తెరకెక్కిందంటే మాత్రం అది పెద్ద ప్రయోగంగానే చెప్పొచ్చు. అలాంటి సినిమాలను తెలుగు ప్రేక్షకులు ఒక్కొసారి ఆదరిస్తుండగా మరోసారి నిరాకరిస్తున్నారు. దీంతో దర్శక, నిర్మాతలంతా రోటిన్ ఫార్మూలానే ఫాలో అవుతున్నారు.

కరోనా పరిస్థితుల నేపథ్యంలో సినిమాలో ఫైట్స్ సీన్స్ చేసేందుకు హీరోలు భయపడుతున్నట్లు తెలుస్తోంది. ఫైట్ సీన్స్ చేయాలంటే కనీసం వంద మంది జూనియర్ ఆర్టిస్టులు ఉండాల్సిందే. వందమందిని హీరో ఒంటిచేత్తో తుక్కుతుక్కు కొడితేనే ఆడియన్స్ కు కనెక్ట్ అవుతుంది. లేకుంటే అది ఫైట్ సీన్ అనిపించుకోదు. దీంతో ఇప్పుడున్న పరిస్థితుల్లో అంత మందితో ఫైట్ సీన్స్ చేయాలంటే హీరోలు భయపడుతున్నారు.

Also Read: పెళ్లిపై.. ఫుల్ క్లారిటీగా ఉన్న బొమ్మాళీ అనుష్క..!

ప్రస్తుతం నేపథ్యంలో ఫైట్స్ సీన్స్ వద్దని దర్శకులకు హీరోలు సూచిస్తున్నారట. కరోనా పరిస్థితులు తగ్గిన తర్వాత చూసుకుందాం అని చెబుతున్నారట. లేకుంటే డూప్ తోనే కానిచ్చేయండి అని చెబుతున్నారట. అంతేగానీ ఫైట్స్ జోలికి వెళ్లడం లేదట. కొందరు హీరోలు మాత్రం సోలో ఫైట్స్ మాత్రమే చేస్తామంటున్నారు. దీంతోపాటు పాటల్లోనూ గ్రూప్ సాంగ్స్ పెట్టొద్దని చెబుతున్నారట. ఇలా చేయడం వల్ల వందలాది జూనియర్ డాన్సర్లకు.. ఫైటర్లకు పని లేకుండా పోతుంది.