ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీలో కుమ్ములాటలు మొదలైనట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో ఈ తంతు కనిపిస్తోంది. ప్రకాశం జిల్లా చీరాల వైఎస్సార్‌సీపీలో వార్ ముదురుతోంది. ఎమ్మెల్యే కరణం వర్సెస్ మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ వర్గాల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమంటోంది. శనివారం రాత్రి రెండు వర్గాలు పెద్ద గొడవకు దిగాయి. రాళ్లు రువ్వుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు కనిపించాయి. రెండు గ్రూపులు ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకున్నారు. ఆ వెంటనే ఈ పంచాయితీ అధిష్టానం దగ్గరకు చేరింది. అధినేత జగన్ కూడా ఈ వ్యవహారంపై సీరియస్‌గా స్పందించినట్లు తెలుస్తోంది.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్
అధికార పార్టీలో ఉండి.. ఈ గ్రూపు పోరు చేస్తుండడంపై జగన్ ఫైర్ అయ్యారని సమాచారం. దీంతో ఆ ఇద్దరినీ పార్టీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి పిలిపించినట్లు సమాచారం. ఇరువురితో వేర్వేరుగా సమావేశం అయి గొడవకు దారితీసిన కారణాలపై చర్చించినట్లు తెలుస్తోంది. కరణం వర్గీయులు కవ్వింపులకు దిగుతున్నారని ఆమంచి అధిష్టానానికి ఫిర్యాదు చేశాడు.
Also Read: టీడీపీ తమ్ముళ్లతో వైసీపీ క్యాడర్ దోస్తానా?
చీరాల వైసీపీలో ఆరు నెలలుగా ఈ వార్ నడుస్తోంది. 2019 ఎన్నికలకు ముందు ఆమంచి టీడీపీని వీడి వైసీపీలో చేరారు. ఆ పార్టీ నుంచి పోటీ చేసి టీడీపీ అభ్యర్థి కరణం బలరాం చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత కృష్ణమోహన్ చీరాల వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జిగా కొనసాగుతున్నారు. కానీ.. తర్వాత ఎమ్మెల్యే కరణం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు మద్దతు ఇచ్చారు. కుమారుడు వెంకటేష్‌ను పార్టీలో చేర్చారు. దీంతో చీరాల రాజకీయం ఒక్కసారిగా మలుపులు తిరిగింది. ఫలితంగా పార్టీలో రెండు వర్గాలు ఏర్పడ్డాయి. అంతకుముందు ఎమ్మెల్సీ పోతుల సునీత కూడా జగన్‌కు జై కొట్టారు.. ఆమె కూడా కరణం వర్గంతోనే ఉన్నారు.
Also Read: జగన్ ప్రభుత్వానికి కేంద్రం గుడ్‌న్యూస్
ఒకే నియోజకవర్గంలో రెండు వర్గాలు ఏర్పడడంతో ఇక పార్టీ కార్యక్రమాలు పోటాపోటీగా జరుగుతున్నాయి. ఎవరికి వారుగా కార్యక్రమాలు నిర్వహిస్తుండడంతో ఒకటి రెండు దఫాల్లో ఘర్షణలు కూడా జరిగాయి. ఆ గొడవలను అధిష్టానం దృష్టికి కూడా తీసుకెళ్లారు. అధినేత జగన్‌కు ఫిర్యాదు చేశారు. ఇదే క్రమంలో శనివారం రాత్రి చీరాలలో మరోసారి వివాదం రాజుకుంది. దీంతో మరోసారి వాతావరణం వేడెక్కింది. దీంతో అధిష్టానం రంగంలోకి దిగింది. ఈ గ్రూప్ వార్‌కు చెక్ పెట్టాలని భావిస్తోంది.