MS Dhoni: టీ20 ప్రపంచకప్ లో టీమిండియాకు మెంటర్ గా ఎంఎస్ ధోని వస్తే మొత్తం కథ వేరే లెవల్లో ఉంటుందని అంతా అనుకున్నారు. కానీ తొలి మ్యాచ్ లో పాకిస్తాన్ చేతిలో ఘోర పరాజయం తర్వాత మన ధోని తెలివితేటలు ఏమయ్యాయి? అని అంతా ప్రశ్నిస్తున్నారు. కానీ ధోని ఎంత ప్లాన్ చేసినా మైదానంలో అప్పటికప్పుడు పరిస్థితులు మారుతాయి. సో అప్పటికప్పుడు వ్యూహాలు మార్చి ప్రయోగిస్తేనే విజయాలు.. మైదానం బయట చేసిన ప్లాన్లు.. మైదానంలో అలానే జరుగుతాయని అనుకోలేం. అందుకే టీం కెప్టెన్ గా మైదానంలో ఉండి అప్పటికప్పుడు వ్యూహాలు రచిస్తేనే గెలుపు అన్నది పాకిస్తాన్ తో మ్యాచ్ లో అందరికీ అర్థమైంది. ఇదే ధోని కెప్టెన్సీలో జరిగింది.. ఇప్పుడు కోహ్లీ కెప్టెన్సీలో జరగనిది అంటున్నారు. మ్యాచ్ మధ్యలోనే వ్యూహాలు రచించి అమలు చేసిన వారిదే విజయం అని తేలిపోయింది.

టీమిండియా కెప్టెన్ కోహ్లీది క్రికెట్ బుర్ర కాదని ఇట్టే అర్థమవుతుంది. ఎందుకంటే అతడి కెప్టెన్సీలో ఒక్క వరల్డ్ కప్ కూడా టీమిండియా అందుకోలేదు. కీలకమైన ఫైనల్స్, ఇతర మ్యాచ్ లలో టీమిండియా చేతులెత్తేస్తుంటుంది. కోహ్లీ ప్లాన్ లు అన్నీ బెదిసికొడుతుంటాయి.
ఇటీవల పాకిస్తాన్ తో మ్యాచ్ లో బ్యాటింగ్ చేస్తున్న పాక్ కు చివరి మూడు ఓవర్లలో 16 పరుగులు కావాలి. అప్పుడు బుమ్రా చేతికి బంతిని ఇచ్చిన కోహ్లీ తర్వాత మనసు మార్చుకొని షమీకి ఇచ్చాడు. షమీ భారీగా పరుగులు ఇవ్వడంతో మ్యాచ్ ఆ ఓవర్ లోనే ముగిసింది. షమీ ముస్లిం కావడంతోనే పాకిస్తాన్ గెలిపించాడని పలువురు అనడం.. అది పెద్ద వివాదాస్పదం కావడం జరిగిపోయింది. నిజానికి ధోని కూడా బుమ్రాకే ఆ ఓవర్ ఇవ్వాలన్నా కోహ్లీ వినలేదట.. ఇలా క్రికెట్ మైదానంలో తక్షణ నిర్ణయాలు.. మంచి వ్యూహాలు తీసుకున్న వారే జట్టును విజేతగా నిలపగలరు. తాజాగా ఇదే మాటను ప్రముఖ ఆల్ రౌండర్ అన్నాడు. సమకాలీన క్రికెట్ లో ధోని లాంటి క్రికెట్ మేధావి లేడని.. అతడి వ్యూహాలు అద్భుతం అని తాజాగా ఆస్ట్రేలియన్ ఆల్ రౌండర్ మార్కస్ స్టాయినిస్ చెప్పుకొచ్చాడు.
చెన్నైతో ఐపీఎల్ సెమీస్ ఆడేటప్పుడు ఢిల్లీ తరుఫున స్టాయినిస్ ఆడాడు. ఈ క్రమంలోనే ధోని వ్యూహాలను తాను దగ్గరి నుంచి చూశానని స్టాయినిస్ చెప్పుకొచ్చాడు. ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లను రెండు రకాలుగా విభజించి అప్పటికప్పుడు మైదానంలో ప్రణాళికలు రచించి వాటిని అమలు చేస్తాడని స్టాయినిస్ చెప్పుకొచ్చాడు. తనకు ఇదే విషయాన్ని ధోని చెప్పాడని వివరించాడు. దూకుడుగా ఆడేవారికి ఒక ప్లాన్.. చివరి వరకూ క్రీజులో ఉండి మ్యాచ్ లు గెలిపించే వారికి మరో ప్లాన్ ను సిద్ధం చేసి వెంటనే అమలు చేస్తాడని వివరించాడు. ఈ విధంగానే తన జట్టును సెట్ చేస్తాడని తెలిపారు. ఇదే ధోని(MS Dhoni) క్రికెట్ రహస్యం అని.. అతడి అద్భుత మైండ్ సెట్ ఎవరికి లేదని స్టాయినిస్ కొనియాడారు. సమకాలీన క్రికెట్ లో ధోనికి ఉన్న క్రికెట్ బుర్ర అసామాన్యం అని స్టాయినిస్ పొగిడేశాడు.
దీన్ని బట్టి కోహ్లీ ఎందుకు ఫెయిల్ అవుతున్నాడు? ధోని ఎందుకు సక్సెస్ అయ్యాడన్నది ఇట్టే తెలిసిపోతుంది. మైదానంలో పరిస్థితులకు తగ్గట్టుగా వ్యూహాలు మార్చే వారే టీంను విజయతీరాలకు చేర్చగలరని.. ఈవిషయంలో కోహ్లీ ప్లాన్లు వర్కవుట్ కావన్నది తేలింది.
Also Read: ఏంటీ బ్యాక్ లైవ్స్ మ్యాటర్’.. సౌతాఫ్రికా క్రికెట్ లో ఎందుకీ సంక్షోభం?