Pushpa Movie: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ ల కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం ” పుష్ప”. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదల అవుతున్నది. ఆర్య, ఆర్య 2 తర్వాత వీరిద్దరు కలిసి ఈ మూవీతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్దమయ్యారు. ఈ సినిమా తొలి భాగం క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 17 వ తేదీన విడుదల కాబోతుంది. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తుంది. కాగా తాజాగా ఈ సినిమా నుంచి అభిమానులకు ఓ గుడ్ న్యూస్ ఇచ్చారు.

ఇక తాజాగా సినిమాలోని మూడో సింగిల్ ” సామి సామి ” పూర్తి పాట ను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ పాటలో రష్మిక మండన్న, అల్లు అర్జున్ ల కెమిస్ట్రీ అదిరిపోయింది అని చెప్పాలి. ముఖ్యంగా రష్మిక మాత్రం ఈ పాటలో తన డాన్స్, ఎక్స్ ప్రెషన్స్ తో అభిమానులకు ఫుల్ ట్రీట్ ఇచ్చినందని చెప్పాలి. అలాగే ఈ పాటలోని లిరిక్స్ కూడా అందరినీ ఆకట్టుకుంటున్నాయి.
ఇక ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన దాక్కొ దాక్కో మేక, శ్రీవల్లి పాటలు యూట్యూబ్ సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. అలానే ఈ చిత్రంలో మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ విలన్ గా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాలో టీజర్లు, పోస్టర్లు జనాల్లో భారీ అంచానలనే పెంచేస్తున్నాయి. దేవీ శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్న విషయం తెలిసిందే. మరోసారి తన పాటలతో రాక్ స్టార్ మ్యాజిక్ చేస్తున్నాడనే చెప్పాలి.