Romantic: పూరీ జగన్నాథ్ తనయుడిగా తెలుగు తెరకు పరిచయం అయ్యాడు ఆకాష్ పూరి. చైల్డ్ ఆర్టిస్ట్ గా చాలా సినిమాల్లో నటించిన ఈ కుర్రాడు. ఇప్పుడు హీరోగా మారి సినిమాలు చేస్తున్నాడు. ఆంధ్రా పోరి సినిమాతో హీరోగా మారి వెండి తెరకు ఎంట్రీ ఇచ్చిన ఆ సినిమా ఎలా వచ్చిందో.. .ఎలా వెళ్లిన్దో కూడా ప్రేక్శకులకు గుర్తులేదని చెప్పాలి. ఆ తర్వాత రిలీజ్ అయిన ” మెహబూబా ” సినిమా కూడా ప్రేక్షకులకు నిరాశ కలిగించింది. ఈ తరుణంలో ఈ యంగ్ హీరో చేస్తున్న మరో చిత్రం “రొమాంటిక్ “… ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నారు ఆకాష్.
ఈ సినిమాకు పూరి శిష్యుడు అనిల్ పాదూరి దర్శకత్వం వహించారు. అలాగే కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ పూరి జగన్నాథ్ అందించారు. ఈ సినిమాకు హీరోయిన్ గా నటిస్తున్న… కేతిక శర్మ మూవీ కి ప్రత్యేక ఆకర్షణ అని చెప్పాలి. ఈ చిత్రంలో రమ్యకృష్ణ, దండుపాళ్యం మకరంద్ దేశ్పాండే, ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు , పాటలు, ట్రైలర్ లు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ సినిమా ట్రైలర్ ను పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లాంచ్ చేశారు. దీపావళి కానుకగా అక్టోబర్ 29న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు.
ఈ నేపధ్యంలో ఈ సినిమా ప్రోమోషన్స్ ఫుల్ స్వింగ్ లో జరుగుతున్నాయి. ఈ మేరకు తాజాగా ఈ సినిమాలోని ” ఇఫ్ యు ఆర్ మాడ్ ” అనే వీడియొ సాంగ్ ను రిలీజ్ చేశారు. సినిమా పరిశ్రమలో పలువురు హీరోలకు సూపర్ హిట్ లు ఇచ్చిన పూరి … తన కొడుక్కి సూపర్ హిట్ ఇవ్వలేక పోతున్నాడు. మరి ఈ సినిమా అయిన ఆకాష్ కి హిట్ ఇస్తుందో లేదో చూడాలి.
https://youtu.be/2xBihr0qLXs
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Read MoreWeb Title: If you are mad video song released from romantic movie
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com