Asia Cup 2023 India Squad: ఆసియాకప్ 2023 టోర్నమెంట్ కు సర్వం సిద్దమైంది. ఇక ఈ మెగా టోర్నీ ప్రారంభం కావడానికి సరిగ్గా 13 రోజుల సమయం మిగిలి ఉంది. ఇప్పటికే టోర్నమెంట్ లో పాల్గొనే టీమ్స్ కప్ గెలుచుకోవడం కోసం సిద్దం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత్ సెలెక్షన్ కమిటీ టోర్నమెంట్లో పాల్గొనబోయే టీమ్ ఇండియా జట్టును ప్రకటించాల్సింది పోయి నిమ్మకు నీరెత్తినట్లు కూర్చుని ఉంది. పరోక్షంగా సీనియర్ బ్యాటర్స్ అయిన కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్‌ల రీ ఎంట్రీ కోసం సెలక్షన్ కమిటీ ఎదురుచూస్తున్నట్లు కనిపిస్తోంది.
ఈ ఇద్దరు నేషనల్ క్రికెట్ అకాడమీ ఫిట్నెస్ సాధించడం కోసం ఎంతో కష్టపడుతున్నారు. ఈ ఇద్దరు ఆటగాళ్లు గత నాలుగు నెలలుగా గాయాల కారణంగా జట్టుకు దూరంగా ఉన్నారు. మరోపక్క టీమిండియా మాజీ ఛీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ మాత్రం ఇప్పటికీ ఈ ఇద్దరు ప్లేయర్స్ ను జట్టుకు దూరంగా ఉంచడమే మంచిదని పరోక్షంగా సూచించారు. తాజాగా జరిగిన అధికారిక బ్రాడ్ క్యాస్ట్ స్టార్ స్పోర్ట్స్ ఛానల్ లో మాట్లాడుతూ ఆసియాకప్ పోటీ కోసం ప్లేయర్స్ గురించి ఒక అంచనా కూడా వేసారు.
ఈ సీరీస్ కు తిలక్ వర్మ కు అవకాశం కల్పిస్తే మంచిదని వాళ్లు భావిస్తున్నారు. మొన్న జరిగిన వెస్టిండీస్ పర్యటనలో మెరుగైన ప్రదర్శనమే కాకుండా తీవ్రమైన ఒత్తిడిలో కూడా తిలక్ వర్మ రాణించాడు. టాప్ ఆర్డర్ బ్యాటర్స్ ఫెయిల్ అయిన పరిస్థితిలో కూడా అసాధారణమైన ఇన్నింగ్స్ ఆడిన తిలక్ వర్మనే నాలుగో స్థానానికి కరెక్ట్ అని ఎమ్మెస్కే ప్రసాద్, రవి శాస్త్రి కూడా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
ప్రస్తుతం టీం లో లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ అవసరం ఉండడం,తిలక్ వర్మ కు కలిసొచ్చే అంశం గా మారింది.ఎమ్మెస్కే ప్రసాద్ తన అంచనా ప్రకారం టీం ఇండియా జట్టు సభ్యుల గురించి వెల్లడించారు…శుభ్‌మన్ గిల్, రోహిత్ శర్మ, తిలక్ వర్మ, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్, జస్‌ప్రీత్ బుమ్రా ఈ సీరీస్ కోసం ఇండియన్ జట్టు కు కరెక్ట్ అనేది ప్రసాద్ అభిప్రాయం.
గాయాలతో ఇబ్బంది పడుతూ ప్రస్తుతం టీం లోకి రావడానికి ప్రయత్నిస్తున్న ప్లేయర్స్ కంటే కూడా బాగా పర్ఫార్మ్ చేసే యువ క్రికెటర్లకు అవకాశం కల్పించడం ఎంతో మంచిదని అందరూ భావిస్తున్నారు. ఆసియా కప్ లో పాల్గొన్న పోయే టీం ఇండియా జట్టు గురించి బీసీసీ మరొక రెండు రోజుల్లో అనౌన్స్ చేసే అవకాశం ఉంది. ఈ మ్యాచ్ కు సంబంధించి ఆగస్టు 23 నుంచి బెంగళూరులో ప్రాక్టీస్ క్యాంపు కూడా నిర్వహించనున్నారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఆసియాకప్ కు ఎంపిక చేసిన టీం వివరాలు ఇలా ఉన్నాయి..
శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్, జస్‌ప్రీత్ బుమ్రా.