https://oktelugu.com/

Ravichandran Ashwin Retirement: అశ్విన్ సడన్ గా రిటైర్ మెంట్ ఇవ్వడం వెనక అసలు కారణం ఇదేనా..?

మూడో టెస్ట్ ముగిసిన తర్వాత రిటర్మెంట్ ప్రకటించాడనే వార్తలైతే వినిపిస్తున్నాయి. ఇంతకీ ఏంటా కారణాలు అంటే అశ్విన్ ప్రస్తుతం అంత మంచి ఫామ్ లో అయితే కనిపించడం లేదు. ఇక దానికి తగ్గట్టుగానే మూడోవ టెస్ట్ మ్యాచ్ లో రవీంద్ర జడేజా 77 పరుగులు చేసి ఇండియన్ టీమ్ బరువు మొత్తాన్ని తనే మోశాడు.

Written By:
  • Gopi
  • , Updated On : December 18, 2024 / 06:52 PM IST

    Ravichandran Ashwin Retirement(1)

    Follow us on

    Ravichandran Ashwin Retirement: ప్రస్తుతం ఇండియన్ టీమ్ తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తోంది. ఆస్ట్రేలియాతో ఆడుతున్న టెస్ట్ సిరీస్ లో భాగంగా గబ్బ వేదిక గా జరిగిన మూడోవ టెస్ట్ మ్యాచ్ డ్రా ముగిసింది. ఇక ఈ మ్యాచ్ ముగిసిన వెంటనే అశ్విన్ తన రిటైర్ మెంట్ ప్రకటించాడు… ఇక ఇదిలా ఉంటే ఇండియన్ టీమ్ ఈ మ్యాచ్ లో దారుణంగా ఓడిపోతుంది అని అందరూ అనుకున్నారు. కానీ అనూహ్యమైన రీతిలో రవీంద్ర జడేజా 77 పరుగులు చేసి ఇండియన్ టీమ్ కి ఫాలో ఆన్ కష్టాల్లో పడకుండా తప్పించాడు…ఇక ఇదిలా ఉంటే ఈ టెస్ట్ మ్యాచ్ ముగిసిన వెంటనే ఇండియన్ టీమ్ స్పిన్ దిగజంగా మంచి గుర్తింపును సంపాదించుకున్న రవి చంద్రన్ అశ్విన్ అన్ని ఫార్మాట్లకు గుడ్ బై చెప్పడం అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది…ఇక ఐదు టెస్టుల్లో భాగంగా మూడో టెస్టు ముగిసిన తర్వాత ఆయన సడన్ గా ఇలాంటి ఒక డిసీజన్ తీసుకోవడం అనేది ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఇక దానికి తగ్గట్టుగానే ఈ సిరీస్ ముగిసిన తర్వాత కూడా ఆయన రిటైర్ మెంట్ ని ప్రకటించొచ్చు. కానీ అనుకోని కారణాలవల్ల ఆయన సడన్ గా మధ్యలోనే రిటర్మెంట్ ప్రకటించడం పట్ల కొంతమంది దిగ్గజ క్రికెటర్లు సైతం ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఎందుకు మూడోవ టెస్ట్ ముగిసిన తర్వాతే రిటర్మెంట్ ప్రకటించాడు అనేదానిమీద కొంతమంది కొన్ని రకాల చర్చలైతే జరుపుతున్నారు. ఇక కొన్ని కారణాలను మనసులో పెట్టుకొని ఆయన మూడో టెస్ట్ ముగిసిన తర్వాత రిటర్మెంట్ ప్రకటించాడనే వార్తలైతే వినిపిస్తున్నాయి. ఇంతకీ ఏంటా కారణాలు అంటే అశ్విన్ ప్రస్తుతం అంత మంచి ఫామ్ లో అయితే కనిపించడం లేదు. ఇక దానికి తగ్గట్టుగానే మూడోవ టెస్ట్ మ్యాచ్ లో రవీంద్ర జడేజా 77 పరుగులు చేసి ఇండియన్ టీమ్ బరువు మొత్తాన్ని తనే మోశాడు.

    ఒక రకంగా ఈ మ్యాచ్ డ్రా అయింది అంటే అది ఆయన వల్లే అని చెప్పాలి. లేకపోతే ఫాలో ఆన్ కూడా దాటకపోయేది. తద్వారా ఇండియన్ టీమ్ విపరీతమైన కష్టాల్లో పడేది…దీనివల్ల ఆస్ట్రేలియాకు ఈజీగా విజయం అనేది దక్కేది. కాబట్టి తదుపరి రెండు మ్యాచ్ ల్లో తప్పకుండా జడేజా ఆడతాడు. ఇక దానికి తగ్గట్టుగానే మరో స్పిన్నర్ అయిన వాషింగ్టన్ సుందర్ కూడా ఇప్పుడు మంచి ఫామ్ లో ఉన్నాడు.

    తనను కూడా పక్కన పెట్టే పరిస్థితి అయితే లేదు. ఇక ఈ మూడు మ్యాచ్ ల్లో కేవలం మూడోవ టెస్టు మ్యాచ్ లో మాత్రమే రవిచంద్రన్ అశ్విన్ కి అవకాశం దక్కింది. కాబట్టి మిగిలిన రెండు మ్యాచ్ ల్లో అవకాశం దక్కే ఛాన్సులు కూడా లేవు. కాబట్టి ఈ మ్యాచ్ లో రిటర్మెంట్ ప్రకటిస్తే గౌరవప్రదంగా ఉంటుందనే ఉద్దేశ్యంతోనే తను ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది…ఇక రవిచంద్రన్ అశ్విన్, వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా వీళ్ళు ముగ్గురు కూడా ఆల్ రౌండర్స్ కావడంతో ముగ్గురిలో ఎవరో ఇద్దరు మాత్రమే టీమ్ లో ఆడాల్సిన పరిస్థితి అయితే నెలకొంటుంది.

    కాబట్టి ఈయనకి మ్యాచ్ లు ఆడే అవకాశం అయితే రావడం లేదు. ఇక వాషింగ్టన్ సుందర్ కూడా న్యూజిలాండ్ తో జరిగిన టెస్ట్ సిరీస్ లో చాలా అద్భుతమైన ప్రదర్శనను కనబరిచాడు. ఇక అప్పటి నుంచి ఇండియన్ టీమ్ లో ఆల్ రౌండర్ ప్రదర్శనను ఇస్తూ కీలక పాత్ర వహిస్తూ వస్తున్నాడు. కాబట్టి అతన్ని కూడా బీసిసిఐ ఎంకరేజ్ చేసే ఉద్దేశ్యంతో అతనికి ఎక్కువ అవకాశాలను ఇస్తు వస్తున్నారు. ఇక తను ఫ్యూచర్ లో ఇండియన్ టీమ్ కి హెల్ప్ అవుతాడనే ఉద్దేశ్యంతోనే అతన్ని ఎక్కువగా ఎంకరేజ్ చేస్తూ ఎక్కువ మ్యాచ్ ల్లో తీసుకుంటున్నారు… దీనివల్లే అశ్విన్ మిగితా మ్యాచుల్లో తనకి అవకాశం రాదనే ఉద్దేశ్యంతో ఈ మ్యాచ్ లోనే రిటర్ మెంట్ ప్రకటిస్తే మంచిదని ఇలా చేశాడని కొంతమంది క్రికెట్ దిగ్గజాలు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు…