Ajith Kumar : అజిత్ కుమార్ గురించి పరిచయం అవసరం లేదు. ఈ హీరో గురించి చాలా మందికి తెలిసిందే. ఎన్నో సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గర అయ్యాడు. ఈయన సినిమాల కోసం ఎదురు చూసే ఫ్యాన్స్ కూడా ఉన్నారు. ఇక ఈయనకు రైడ్ అంటే చాలా ఇష్టం అనే విషయం తెలిసిందే. చాలా రైడ్స్ కి వెళ్తుంటాడు అజిత్. ఎన్నో సార్లు రైడ్లు చేస్తూ తన అనుభవాలను కూడా పంచుకున్నాడు. మంచి బైక్ లను కూడా ఉపయోగిస్తుంటాడు. అయితే అజిత్ కుమార్ కాస్త లావుగా ఉంటాడు అనే విషయం తెలిసిందే. అయినా తన హైట్ వల్ల లావు పెద్దగా కనిపించదు. అయినా సరే బరువు తగ్గడానికి చాలా ప్రయత్నాలు చేశాడు. చివరకు మొత్తం బరువు తగ్గాడు. ఏకంగా ఒకే సారి 25 కిలోల బరువు తగ్గాడు ఈ హీరో. వామ్మో ఇదెలా సాధ్యం అనుకుంటున్నారా? మరి ఓ సారి ఈ ఆర్టికల్ చదివేసేయండి.
అజిత్ విడముయర్చి, గుడ్ బ్యాడ్ అగ్లీ అనే సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈసినిమా పనులు జరుగుతున్నాయి. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే అజిత్ నటిస్తున్న రెండు సినిమాల్లోనూ త్రిష హీరోయిన్ గా నటిస్తుంది. దీంతో త్రిష అభిమానులు కూడా ఈ సినిమాల కోసం ఎదురుచూస్తున్నారు. సినిమాల గురించి పక్కన పెడితే పర్సనల్ లైఫ్ లో కూడా చాలా కేర్ గా ఉంటారు. ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తలు తీసుకుంటారు అజిత్. అయితే అదే క్రమంలో బరువు తగ్గి చాలా స్లిమ్ గా అయ్యారు. మొత్తం స్లిమ్ లుక్ లో కనిపిస్తున్నారు ఈ స్టార్ హీరో.
కొన్ని సినిమాల వల్ల బరువు పెరగాల్సి ఉంటే కొన్ని సినిమాల వల్ల బరువును తగ్గించాల్సి ఉంటుంది. మరి అజిత్ ఇప్పుడు సినిమాల కోసం బరువు తగ్గారు అనుకుంటున్నారా? కానీ కాదట కార్ రేస్ లో పాల్గొనడానికి ఈయన బరువు తగ్గారు అని టాక్. యూరప్ లో జరిగే కార్ రేస్ లో పాల్గొనడానికి ఈయన బరువు తగ్గారు. ఇక దీనికి సంబంధించిన శిక్షణ కూడా తీసుకుంటున్నారు. తనకు ఇష్టమైన రైడింగ్ కోసం ఏకంగా 25 కి.ల బరువు తగ్గడం మామూలు విషయం కాదు. అంటే రేస్ అంటే ఆయనకు ఎంత ఇష్టమో అర్థం చేసుకోవచ్చు.
మరి ఒక్కసారిగా ఇంత బరువు ఎలా తగ్గారు? అనుకుంటున్నారా? సంకల్పం, పట్టుదలతో అదే పనిగా తను వర్కౌట్స్, డైట్ చేయడం మొదలు పెట్టారట. దీన్ని క్రమం తప్పకుండా పాటిస్తూ అజిత్ బరువు తగ్గారు. అది కూడా ఏకంగా 25 కిలోలు. కొందరు కేజీ బరువు తగ్గాలంటేనే కష్టం. అలాంటిది ఈ రేంజ్ లో బరువు తగ్గారంటే ఆయన ఎంత కష్టపడ్డారో అర్థం చేసుకోవచ్చు అంటున్నారు అజిత్ అభిమానులు. మొత్తం మీద బరువు తగ్గిన అజిత్ స్మార్ట్ లుక్‌లోకి మారాడు. ఈ మార్పు వల్ల ఏకంగా 50 ఏళ్ళ వయసా? 25 ఏళ్ల వయసా అనే పొగడ్తల వర్షం కురుస్తుంది.