Rajasaab Movie : తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళని వాళ్ళు స్టార్ హీరోలుగా ఎస్టాబ్లిష్ చేసుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నారు. ఇక ఇప్పటివరకు వాళ్ళు సాధించిన విజయాలు ఒకేతైతే పాన్ ఇండియాలో వాళ్ళు సత్తాను చాటుకుంటూ ముందుకు సాగుతూ ఉండడం మరొక ఎత్తుగా మారింది. ఇక ఏది ఏమైనా కూడా ప్రభాస్ లాంటి స్టార్ హీరో సైతం ఇప్పుడు వరుస సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నాడు. అయితే ఆయన మారుతి డైరెక్షన్ లో చేస్తున్న ‘ది రాజాసాబ్’ సినిమా 2025 ఏప్రిల్ 10 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది అంటూ అనౌన్స్ చేశారు. ఇక ప్రభాస్ కి ఫౌజీ సినిమా షూటింగ్ లో భాగంగా కొన్ని గాయాలైతే అయ్యాయి. ఆ గాయాల కారణంగా రాజాసాబ్ సినిమా మీద ఎఫెక్ట్ పడే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది.ఇక ఇప్పటికే అనౌన్స్ చేసిన డేట్ కి రాజాసాబ్ సినిమా రాదనే ఒక క్లారిటీ అయితే అందరిలో వచ్చేసింది. ఎందుకంటే సినిమా షూటింగ్ లో గాని, పోస్ట్ ప్రొడక్షన్ లో గాని, విఎఫ్ఎక్స్ లో గాని చాలావరకు సమయాన్ని కేటాయించాల్సిన అవసరమైతే ఉంది. అలాగే ప్రభాస్ కూడా ఈ సినిమా కోసం కొన్ని డేట్స్ ని కేటాయించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఆయన రెస్ట్ తీసుకుంటున్నాడు. కాబట్టి ఈ సినిమా షూటింగ్ అనేది సజావుగా సాగే అవకాశాలు అయితే లేవు.
తద్వారా ఈ సినిమా అనుకున్న సమయానికి రిలీజ్ అవ్వకపోవచ్చు అంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి…ఇక ఈ సినిమా మేకర్స్ మరొక కొత్త డేట్ ని అనౌన్స్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఇక దీంతో సిద్దు జొన్నలగడ్డ హీరోగా వస్తున్న జాక్ సినిమాని ఏప్రిల్ 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నట్టుగా తెలుస్తోంది.
ఇక దానికి సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా వాళ్ళు తెలియజేయడంతో ప్రభాస్ పోటీ లో లేడు కాబట్టే సిద్దు జొన్నలగడ్డ ఆ డేట్ ను బుక్ చేసుకున్నట్టుగా తెలుస్తోంది…ఇక ఇది అధికారికంగా జరిగినట్టుగా వార్తలైతే వస్తున్నాయి.
ఇక రాజాసాబ్ ప్రొడ్యూసర్స్ అయిన పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వాళ్ళను కనుక్కున్న తర్వాతే జాక్ సినిమా ప్రొడ్యూసర్స్ ఈ డేట్ ని అనౌన్స్ చేశారనే వార్తలైతే వినిపిస్తున్నాయి…ఇక ఏది ఏమైనా కూడా ప్రభాస్ సినిమా లేట్ అవుతున్న కొద్దీ అభిమానుల్లో కొంత వరకు టెన్షన్ అయితే మొదలవుతుంది. రాజాసాబ్ సినిమా మీద పెద్దగా అంచనాలైతే లేవు. కానీ ఆ సినిమా వస్తే చూడటానికి ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు…