https://oktelugu.com/

Olympics  2024 : లింగ వివాదమున్నా.. తైవాన్ బాక్సర్ కు స్వర్ణం..పారిస్ ఒలింపిక్ కమిటీపై విమర్శలు..

ఒక అథ్లెట్ గా నేను ఉచ్చ స్థితిలో ఉన్నాను. సోషల్ మీడియాలో నాపైన రాని ఆరోపణ అంటూ లేదు. నన్ను ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టారు. అయినప్పటికీ నేను నా లక్ష్యంపై దృష్టి సారించాను. ఇలాంటి సమయంలో మా కోచ్ నుంచి కొన్ని వార్తలు విన్నాను. అయినప్పటికీ వాటిని పట్టించుకోకుండా, గుండె నిబ్బరం చేసుకున్నాను. నాకు చాలామంది మద్దతు ఇచ్చారు.. వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నానని" లిన్ పేర్కొన్నది.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : August 11, 2024 8:21 pm
    Follow us on

    Olympics 2024 : రెజ్లింగ్ లో 100 గ్రాముల బరువు ఎక్కువ ఉన్నందుకు భారత మల్ల యోధురాలు వినేశ్ ఫొగాట్ ను పారిస్ ఒలంపిక్ కమిటీ అనర్హురాలిగా ప్రకటించింది. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ భారత ఒలింపిక్ కమిటీ నిరసన తెలిపినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. దీంతో వినేశ్ “కాస్” ను ఆశ్రయించింది. వినేశ్ తనను రజత పతకానికి అర్హురాలిగా ప్రకటించాలని కాస్ లో ఫిర్యాదు చేసింది. అయితే దీనిపై శనివారం రాత్రి తొమ్మిది గంటల 30 నిమిషాలకు తీర్పు వెల్లడిస్తామని కాస్ ప్రకటించింది. కానీ ఆ తర్వాత 13వ తారీఖుకు తీర్పును వాయిదా వేస్తూ ప్రకటించింది. అయితే ఆటగాళ్ల విషయంలో ఒకేలాగా వ్యవహరించాల్సిన ఒలింపిక్ కమిటీ.. ఆశ్రిత పక్షపాతం ప్రదర్శిస్తోంది. ఎందుకంటే శనివారం జరిగిన సంఘటన పై ఆరోపణకు బలం చేకూర్చుతోంది.

    శనివారం రోలాండ్ గారోస్ మైదానంలో 507 కిలోల విభాగంలో బాక్సింగ్ పోటీలు జరిగాయి. ఈ పోటీలలో లింగ వివాదంలో ఆరోపణలు ఎదుర్కొన్న తైవాన్ బాక్సర్ లిన్ యూ టింగ్ గోల్డ్ మెడల్ సాధించింది. పోలాండ్ దేశానికి చెందిన జూలియా పై వన్ సైడ్ విక్టరీ సాధించింది. ఈ మ్యాచ్ లో లిన్ తన పిడుగుద్దులతో ప్రత్యర్థిని ఉక్కిరిబిక్కిరి చేసింది. ఆ తర్వాత ఆమె గోల్డ్ మెడల్ స్వీకరిస్తూ ఉద్వేగానికి గురైంది.

    “ఒక అథ్లెట్ గా నేను ఉచ్చ స్థితిలో ఉన్నాను. సోషల్ మీడియాలో నాపైన రాని ఆరోపణ అంటూ లేదు. నన్ను ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టారు. అయినప్పటికీ నేను నా లక్ష్యంపై దృష్టి సారించాను. ఇలాంటి సమయంలో మా కోచ్ నుంచి కొన్ని వార్తలు విన్నాను. అయినప్పటికీ వాటిని పట్టించుకోకుండా, గుండె నిబ్బరం చేసుకున్నాను. నాకు చాలామంది మద్దతు ఇచ్చారు.. వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నానని” లిన్ పేర్కొన్నది.

    లిన్ తో పాటు అల్జీరియా బాక్సర్ ఇమానె ఖేలిఫ్ శుక్రవారం 66 కిలోల విభాగంలో గోల్డ్ మెడల్ దక్కించుకుంది. చైనా ప్లేయర్ యాంగ్ లియు ను మట్టి కరిపించి పతకం దక్కించుకుంది. ఇదే క్రమంలో తన గుండెలో గూడు కట్టుకున్న ఆవేదనను వ్యక్తం చేసింది. ” ఇది నా ఎనిమిది సంవత్సరాల కల. ఇప్పుడు నేను ఒలంపిక్ ఛాంపియన్. అన్ని పరీక్షలు దాటుకొని ఇక్కడ దాకా వచ్చాను. నేను ఒక ఆడపిల్లను. అలాగే పుట్టాను, అలాగే పెరిగాను. మెరుగైన ప్రదర్శన ఇచ్చేందుకు ఒలంపిక్స్ దాకా వచ్చాను. నాపై ఎన్నో దాడులు జరిగాయి. ఇకపై అవి పునరావృతం కావని అనుకుంటున్నానని” ఖేలిఫ్ వెల్లడించింది.

    గత ఒలింపిక్స్ లో వీరిద్దరిపై అనర్హత వేటుపడింది. వీరి శరీరంలో పురుషులకు సంబంధించిన జన్యువులు ఎక్కువగా ఉన్నాయని వార్తలు వినిపించాయి. అప్పట్లో లిన్ కాంస్యం సాధించింది. ఆ తర్వాత దానిని రద్దు చేశారు. గత ఒలింపిక్స్ లో ఆమెకు ఎటువంటి ప్రతిఘటన ఎదురు కాలేదు. పారిస్ ఒలింపిక్స్ లో ప్రమాణాలను, నిబంధనలను ఆమె మొత్తం పూర్తి చేసింది. ఫైనల్స్ లో లిన్ ప్రత్యర్థి కంటే పది సెంటీమీటర్ల ఎత్తు ఎక్కువగా ఉండటం కలిసి వచ్చింది. అయితే ఇదే సమయంలో సోషల్ మీడియాలో ఒలింపిక్ కమిటీపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. వివాదాలున్న బాక్సర్లకు మెడల్స్ ఇచ్చారని.. కేవలం 100 గ్రాములు బరువు ఎక్కువగా ఉన్నందుకు వినేశ్ ఫొగాట్ కు మొండి చేయి చూపించారని ఆరోపిస్తున్నారు.