Bigg Boss 8 Telugu : ప్రతీ ఏడాది స్టార్ మా ఛానల్ లో ప్రసారమయ్యే బిగ్ బాస్ రియాలిటీ షో కి ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇప్పటి వరకు 7 సీజన్స్ టెలికాస్ట్ అయితే, సీజన్ 6 తప్ప అన్నీ సీజన్లు బ్లాక్ బస్టర్ అయ్యాయి. ముఖ్యంగా సీజన్ 7 కి అయితే ఇప్పటి వరకు స్టార్ మా ఛానల్ ఎప్పుడూ చూడని ఆల్ టైం రికార్డు టీఆర్ఫీ రేటింగ్స్ ని తెచ్చిపెట్టింది. దీంతో సీజన్ 8 పై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. బిగ్ బాస్ టీం ఆ అంచనాలను అందుకునే విధంగా ఈ సీజన్ సరికొత్తగా ప్లాన్ చేసింది. ఇప్పటికే ఈ సీజన్ కి సంబంధించిన ఒక చిన్న ప్రోమో ని వారం రోజుల క్రితం విడుదల చేసారు.
ఈ ప్రోమో చివర్లో నాగార్జున ఒక్కసారి కమిట్ అయితే అన్ లిమిటెడ్ అనగానే ప్రోమో ముగుస్తుంది. ఇదేంటి ప్రోమో మధ్యలో ఆపేసినట్టు ఉన్నారు, ఇంకా ఉందా ? అని అనిపించేలా ఈ ప్రోమో ఉన్నింది. ఆడియన్స్ అంచనాలకు తగ్గట్టుగానే నాగార్జున మొదటి ప్రోమో లో ఎక్కడ అయితే తన డైలాగ్ ని ఆపేశాడో, అక్కడి నుండే ఈరోజు విడుదలైన రెండవ ప్రోమో మొదలైంది. ఈ ప్రోమో లో నీకు అన్ లిమిటెడ్ గా ఏమి కావాలో కోరుకోమని నాగార్జున కమెడియన్ సత్య ని అడుగుతాడు. అప్పుడు సత్య నాకు ఎంటర్టైన్మెంట్ కావాలి అనగానే, నాగార్జున అందమైన అమ్మాయిలతో డ్యాన్స్ వేస్తూ సత్య ని అలరిస్తాడు. ఆ తర్వాత ఇంకా అన్ లిమిటెడ్ గా ఏమి కావాలో కోరుకో అని నాగార్జున సత్య ని అడగగా, నాకు ఒంటరితనం కావాలి అంటాడు. అప్పుడు నాగార్జున సత్య ని ఎడారిలోకి వదిలేస్తాడు.
ఇలా ప్రోమో మొత్తం ఫుల్ ఫన్నీగా ఉంటుంది. అంటే ఈ సీజన్ ఎంటర్టైన్మెంట్, టాస్కులు, ట్విస్టులు అన్నీ అన్ లిమిటెడ్ గా ఉండబోతున్నాయని ఈ ప్రోమో చూస్తే అర్థం అవుతుంది. గత సీజన్ లో ఉల్టా పల్టా కాన్సెప్ట్ బాగా వర్కౌట్ అయ్యింది. ఈ సీజన్ లో ‘ఇన్ఫినిటీ’, ‘అన్ లిమిటెడ్’ కాన్సెప్ట్ కూడా అదే రేంజ్ లో క్లిక్ అవుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. సెప్టెంబర్ 1 నుండి మొదలు కాబోతున్న ఈ సీజన్ ప్రేక్షకుల అంచనాలను అందుకుంటుందా లేదా అనేది చూడాలి. ఇకపోతే ఈ సీజన్ లో పాల్గొనే కంటెస్టెంట్స్ గురించి ఇది వరకు సోషల్ మీడియా లో మనం అనేక పేర్లని విన్నాము. మనం విన్న పేర్లే దాదాపుగా ఖరారు అయ్యాయి. వారిలో తేజస్విని గౌడా, రీతూ చౌదరీ, అంజలి పవన్, బంచిక్ బబ్లూ వంటి వారు అగ్రీమెంట్స్ మీద సంతకాలు కూడా చేసేసారట. వీరితో పాటు విష్ణు ప్రియా, యష్మీ గౌడా, కిరాక్ ఆర్ఫీ, ఆదిత్య ఓం , సెల్వరాజ్, ఇంద్రనీల్, హారిక వంటి వారు కూడా దాదాపుగా ఖరారు అయ్యినట్టు తెలుస్తుంది.
https://mail.google.com/mail/u/0/#inbox/FMfcgzQVzFNgXRGnGpnJrSqFspcdbrJJ?projector=1