Hardik Pandya – Natasha : ఈ ఏడాది హార్థిక్ పాండ్యాకు ఏదీ కలిసి రావడం లేదు. ముంబై ఇండియన్స్ జట్టు కు నాయకత్వం వహిస్తే.. అది లీగ్ దశలోనే ఇంటిదారి పట్టింది. అంతకుముందు వన్డే వరల్డ్ కప్ లో కాలికి గాయం కావడంతో.. అతడు కొద్దిరోజులు ఇంటికే పరిమితం కావలసి వచ్చింది. సరే ఇవన్నీ అతడి క్రీడా జీవితానికి సంబంధించినవి కాబట్టి.. పెద్దగా లెక్కలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఫామ్ లో ఉన్నప్పుడు మళ్లీ విజయాలు సాధిస్తాడు.. తిట్టిన వాళ్ల తోనే పొగించుకుంటాడు. కానీ, ప్రస్తుతం అతడి వ్యక్తిగత జీవితమే పెద్ద ఇబ్బందుల్లో పడింది. ఎందుకంటే అతడు నాలుగేళ్ల పాటు సహజీవనం చేసి.. ఒక బాబుకు జన్మనిచ్చి..ఆ తర్వాత పెళ్లి చేసుకొన్న నటాషాకు విడాకులు ఇచ్చాడని మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. నటాషా, హార్దిక్ పాండ్యా దంపతులకు అగస్త్య పాండ్యా అనే కుమారుడు ఉన్నాడు. మొదట్లో వీరి కాపురం అన్యోన్యంగా సాగింది. హార్దిక్ ఆడిన ప్రతి క్రికెట్ మ్యాచ్ కు నటాషా హాజరయ్యేది. అతడు కూడా ఆమెతో కలిసి ఉన్న ప్రతిక్షణాన్ని ఆస్వాదించేవాడు. ఇందుకు సంబంధించిన విషయాలను సోషల్ మీడియాలో పంచుకునేవాడు.
రెండు నెలలుగా వీరిద్దరి మధ్య మాటలు బంద్ అయ్యాయి. ఒకరిని ఒకరు సోషల్ మీడియాలో అన్ ఫ్రెండ్ చేసుకున్నారు. నటాషా తన సోషల్ మీడియా ఖాతాలలో తన కుమారుడితో ఉన్న ఫోటోలను మాత్రమే ఉంచుకుంది. అటు హార్దిక్ కూడా అలానే చేశాడు. పైగా నటాషా తన యూసర్ నేమ్ లో పాండ్యా అనే పదాన్ని తొలగించింది. దీంతో వీరిద్దరూ విడిపోతున్నారనే వాదనలకు బలం చేకూరింది. ఇటీవలి ఐపిఎల్ మ్యాచ్ లలో నటాషా కనిపించలేదు. కనీసం హార్దిక్ కు అనుకూలంగా ఒక్క పోస్ట్ కూడా సోషల్ మీడియాలో పెట్టలేదు. చివరికి హార్దిక్ కూడా మార్చి 4న నటాషా పుట్టినరోజు ఉంటే.. కనీసం శుభాకాంక్షలు కూడా చెప్పలేదు.. అయితే నటాషాకు హార్దిక్ విడాకులు ఇచ్చాడని.. భరణం లో భాగంగా 70 శాతం ఇచ్చాడని ప్రచారం జరుగుతోంది. అయితే ఆస్తిలో 50% పైగా తన అమ్మ పేరిట ఉండటం హార్దిక్ పాండ్యాకు కలిసి వస్తోందని తెలుస్తోంది. ఏవైనా వివాదాలు వస్తే ఆస్తి కోల్పోకుండా ఉండేందుకు తాను ఈ నిర్ణయం తీసుకున్నానని హార్దిక్ పాండ్యా గతంలో చెప్పాడు.
ఎంతో అన్యోన్యంగా ఉన్న హార్దిక్, నటాషా విడిపోవడానికి ప్రధాన కారణం వివాహేతర సంబంధమని తెలుస్తోంది. హార్దిక్ కు తెలియకుండా అలెగ్జాండర్ అలెక్స్ అనే వ్యక్తితో నటాషా వివాహేతర సంబంధం నడిపిస్తున్నట్టు తెలుస్తోంది. ఇదే విషయాన్ని బాలీవుడ్ లో తెర వెనుక వ్యవహారాలు వెల్లడించే ఉమైర్ సంధూ ట్విట్టర్లో ప్రకటించాడు. ” దుబాయ్ లో ఒక హోటల్లో నటాషా, మరో వ్యక్తితో కలిసి ఉంది. తన భర్త హార్దిక్ పాండ్యాకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిందని” ఉమైర్ ట్విట్టర్లో పేర్కొన్నాడు.. సెర్బియా దేశానికి చెందిన నటాషాకు మాదకద్రవ్యాలు తీసుకోవడం, వివాహేతర సంబంధాలు పెట్టుకోవడం పరిపాటి అని ఉమైర్ పేర్కొన్నాడు. ఇందులో భాగంగానే నటాషా తనకు తెలియకుండా వివాహేతర సంబంధాలు పెట్టుకోవడంతో హార్దిక్ వదిలేసాడని ప్రచారం జరుగుతోంది. మరి ఈ ప్రచారాలకు ఫుల్ స్టాప్ పడాలంటే కచ్చితంగా నటాషా, హార్దిక్ స్పందించాల్సి ఉంది.