నిరుద్యోగులకు సీఎం శుభవార్త.. 50 లక్షల మందికి ఉపాధి..?

దేశంలో నిరుద్యోగం ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో కొత్త స్కీమ్ లను అమలు చేస్తున్నా నిరుద్యోగం మాత్రం తగ్గుముఖం పట్టడం లేదు సరికదా అంతకంతకూ పెరుగుతోంది. కరోనా, లాక్ డౌన్ వల్ల గతంతో పోలిస్తే నిరుద్యోగుల సంఖ్య భారీగా పెరిగింది. ఇలాంటి తరుణంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. యోగి ఆదిత్యనాథ్ ఉత్తరప్రదేశ్ లోని నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త చెప్పారు. మిషన్ రోజ్‌గార్ […]

Written By: Navya, Updated On : November 12, 2020 9:36 pm
Follow us on


దేశంలో నిరుద్యోగం ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో కొత్త స్కీమ్ లను అమలు చేస్తున్నా నిరుద్యోగం మాత్రం తగ్గుముఖం పట్టడం లేదు సరికదా అంతకంతకూ పెరుగుతోంది. కరోనా, లాక్ డౌన్ వల్ల గతంతో పోలిస్తే నిరుద్యోగుల సంఖ్య భారీగా పెరిగింది. ఇలాంటి తరుణంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.

యోగి ఆదిత్యనాథ్ ఉత్తరప్రదేశ్ లోని నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త చెప్పారు. మిషన్ రోజ్‌గార్ పేరుతో రాష్ట్రంలో ఈ స్కీంను యోగి అమలు చేయనుండగా ఈ స్కీం ద్వారా ఏకంగా 50 లక్షల మందికి ఉపాధి కల్పించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. అంత మందికి ఉద్యోగం కల్పించడం ఆషామాషీ వ్యవహారం కానప్పటికీ యోగి అసాధ్యాన్ని సుసాధ్యం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు.

మరో రెండు రోజుల్లో దీపావళి పండుగ ఉన్న నేపథ్యంలో పండుగ అనంతరం యోగి ఈ కొత్త స్కీమ్ ను ప్రారంభించనున్నారని తెలుస్తోంది. 2020 నవంబర్ నెల నుంచి 2021 మార్చి నెల మధ్యలో యోగి సర్కార్ ఈ ఉద్యోగాల కల్పన కార్యక్రమాన్ని చేపట్టనుంది. ప్రభుత్వం ప్రైవేట్ సంస్థలపై దృష్టి పెట్టి ఆయా సంస్థల్లో కొత్త ఉద్యోగావకాశాలను సృష్టించి యువతకు ఉపాధి కల్పించాలని భావిస్తోంది.

యూపీ సీఎస్ రాజేంద్ర కుమార్ తివారీ స్కీమ్ అమలుకు సంబంధించిన ప్రణాళికను ఇప్పటికే ప్రభుత్వం సిద్ధం చేసిందని వెల్లడించారు. బీజేపీ సర్కార్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తోందని ఆయన చెప్పారు. యోగి సర్కార్ తీసుకున్న నిర్ణయం పట్ల ఆ రాష్ట్రంలోని నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.