Sanju Samson: ఐసీసీ(ICC) ముందుగానే విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం జనవరి 12 లోపు ప్రాబబుల్స్(probables)ను ప్రకటించాలి.. అయితే టీమిండియా విజ్ఞప్తి చేయడంతో ఈ వారం వరకు సమయం ఇచ్చింది.. ఐసీసీ ఇచ్చిన గడువు ప్రకారం భారత్ జట్టును వెల్లడించాలి. ఆ తర్వాత ఫిబ్రవరి 13 వరకు మార్పులు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.. అయితే ఈసారి ప్రకటించే జట్టులో అందరి దృష్టి మొత్తం సంజు శాంసన్(Sanju Samson)ఉంది. సంజు చివరిసారిగా ఆడిన వన్డే మ్యాచ్లో సెంచరీ చేశాడు. దక్షిణాఫ్రికాపై జరిగిన మ్యాచ్లో అతడు శతకం బాదాడు. చాంపియన్స్ ట్రోఫీ కోసం అతడిని టీం ఇండియా మేనేజ్మెంట్ ఫస్ట్ ప్రయారిటీగా భావించడం లేదని తెలుస్తోంది.. అంతేకాదు అతనికి జట్టులో అవకాశం కూడా ఉండకపోవచ్చు అని తెలుస్తోంది.. జాతీయ మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం రిషబ్ పంత్ (Rishabh pant) రెగ్యులర్ వికెట్ కీపర్ గా ఉంటాడని సమాచారం.. అతడికి ఇంగ్లాండ్ జట్టుతో జరిగే వన్డే, టి20 సిరీస్ కు విశ్రాంతి ఇస్తారని తెలుస్తోంది. ఛాంపియన్స్ ట్రోఫీకి అతడిని సిద్ధం చేస్తారని సమాచారం.. ఇటీవల వన్డే వరల్డ్ కప్ లో టీమిండియాకు కేఎల్ రాహుల్ వికెట్ కీపర్ గా బాధ్యతలు నిర్వర్తించాడు. అయితే ఈసారి అతని బ్యాటరీ కేటగిరీలోనే తీసుకుంటారని తెలుస్తోంది. ఈ ప్రకారం చూసుకుంటే రిషబ్ పంత్ కు బ్యాకప్ వికెట్ కీపర్ ఎవరనేది ఆసక్తికరంగా మారింది. ఈ జాబితాలో ముగ్గురు ఉన్నారు.. సంజు శాంసన్, ఇషాన్ కిషన్, ధృవ్ జూరెల్ వంటి వారు ఈ జాబితాలో కొనసాగుతున్నారు.. దేశవాలి క్రికెట్లో ఇషాన్ కిషన్ సత్తా చాటుతున్నాడు. దీంతో అతని వైపు బీసీసీఐ సెలెక్టర్లు ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నారు.
సంజు అదరగొడుతున్నాడు
మరోవైపు సంజు శాంసన్ అదరగొడుతున్నాడు. అంతర్జాతీయ మ్యాచ్లలో సత్తా చూపిస్తున్నాడు. పరుగుల వరద ఏకధాటిగా పారిస్తున్నాడు. అయితే మేనేజ్మెంట్ అతని వైపు పెద్దగా ఆసక్తి చూపించడం లేదని తెలుస్తోంది. సంజు శాంసన్ ను కేవలం టి20 ఆటగాడిగా మాత్రమే మేనేజ్మెంట్ పరిగణిస్తోందని సమాచారం. గత ఏడాది టి20 ఫార్మాట్ లో సంజు మూడు సెంచరీలు చేశాడు.. ఇక ధృవ్ జూరెల్ ఇంతవరకు వన్డేలలో ఎంట్రీ ఇవ్వలేదు.. అతడు కొనసాగిస్తున్న ఫామ్ ప్రకారం ఐసీసీ టోర్నీకి అతన్ని పరిగణలోకి తీసుకునే అవకాశాలు దాదాపు ముగిసినట్టే.. అయితే క్రీడా పండితుల అంచనా ప్రకారం రిషబ్ పంత్ కు బ్యాకప్ వికెట్ కీపర్ గా కిషన్ ను తీసుకునే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఇక ఇటీవల సంజు శాంసన్ వరుసగా మూడు సెంచరీలు చేసిన నేపథ్యంలో అతడి తండ్రి కీలక వ్యాఖ్యలు చేశాడు. తన కొడుకుకి సరైన అవకాశాలు ఇచ్చి ఉంటే మెరుగ్గా ఆడేవాడని.. ఇన్నాళ్లకు అతనికి అవకాశాలు లభించడంతో ప్రతిభను చూపిస్తున్నాడని వివరించాడు. తన కుమారుడికి కొంతమంది కెప్టెన్లు అవకాశాలు ఇవ్వలేదని.. ఇప్పుడున్న కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్, కోచ్ గౌతమ్ గంభీర్ అవకాశాలు ఇస్తున్నారని కొనియాడాడు. ఒకవేళ గనుక బీసీసీఐ సెలక్టర్లు ఛాంపియన్స్ ట్రోఫీలో సంజు శాంసన్ కు అవకాశం ఇవ్వకపోతే.. అతని తండ్రి మరోసారి విమర్శలు చేసే అవకాశం లేకపోలేదు. మరి సంజు విషయంలో బిసిసిఐ సెలెక్టర్లు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సి ఉంది.