Rajinikanth and Chiranjeevi : ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద నేటి తరం స్టార్ హీరోల హవా ఏ రేంజ్ లో ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. వీళ్ళ దాటికి సీనియర్ హీరోలు బాగా డౌన్ అయిపోయారు. వాళ్లకు ఓపెనింగ్ వసూళ్లు కూడా ఈమధ్య కాలంలో సరిగా రావడం లేదు. ఉదాహరణకు విక్టరీ వెంకటేష్ ని తీసుకోండి. ఈయన ఎప్పుడో 2007 వ సంవత్సరంలో సోలో హీరో గా సూపర్ హిట్ ని అందుకున్నాడు. ఆ తర్వాత అనేక సినిమాల్లో సోలో హీరో గా నటించినప్పటికీ ఇప్పటి వరకు కనీసం పాతిక కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను కూడా అందుకోలేకపోయాడు. ఒకప్పుడు మెగాస్టార్ చిరంజీవి తో సరిసమానంగా రికార్డ్స్ పెట్టి సంచలనం సృష్టించిన ఆయన, ఇప్పుడు కనీసం రేస్ లో లేకుండా పోయాడని అభిమానులు చాలా బాధపడేవారు. వాళ్ళను అలాంటి నిరాశ నుండి బయటపడిన చిత్రం నిన్న విడుదలైన ‘సంక్రాంతికి వస్తున్నాం’.
అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన విక్టరీ వెంకటేష్ మూడవ చిత్రమిది. ఈ సినిమాకి నిన్న వచ్చిన ఓపెనింగ్స్ ని చూసి ట్రేడ్ పండితులకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యినంత పని అయ్యింది. ఎక్కడ చూసినా హౌస్ ఫుల్స్. ఫ్యామిలీ ఆడియన్స్ ఒక్క టికెట్ కోసం యుద్దాలు చేసుకునే పరిస్థితి నెలకొంది. నిన్న టికెట్స్ దొరకకపోయేసరికి రెండవ రోజు కి అడ్వాన్స్ బుకింగ్స్ చేసుకున్నారు ప్రేక్షకులు. రెండవ రోజు కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో అన్ని షోస్ అడ్వాన్స్ గా హౌస్ ఫుల్స్ అయ్యాయి. అయితే ఈ సినిమాకి వస్తున్న వసూళ్ల సునామీ ని చూస్తుంటే కచ్చితంగా ఫుల్ రన్ లో 100 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు వస్తుందని అంచానా వేస్తున్నారు. ఇప్పటి వరకు ఇండియా లో 60 ఏళ్లకు పైగా వయస్సు దాటిన హీరోలలో చిరంజీవి, రజినీకాంత్ కి తప్ప ఈ క్లబ్ లో చోటు దక్కలేదు. వాళ్ళిద్దరి తర్వాత విక్టరీ వెంకటేష్ కి ఆ స్థానం దక్కనుంది.
అంతే కాదు నేటి తరం సూపర్ స్టార్స్ అయినటువంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్,సూపర్ స్టార్ మహేష్ బాబు, ఎన్టీఆర్ , రామ్ చరణ్ వంటి హీరోల కెరీర్ హైయెస్ట్ క్లోజింగ్ వసూళ్లను కూడా ఈ చిత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో అధిగమించే అవకాశాలు ఉన్నాయి. కేవలం తెలుగు రాష్ట్రాల నుండే ఈ సినిమాకి 130 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు ట్రేడ్ పండితులు. ఈ వారం మొత్తం ఈ చిత్రానికి పవర్ ప్లే బ్యాటింగ్ ఉంటుంది. ఇక ఆ తర్వాత ఫిబ్రవరి నెల వరకు ఈ సినిమాకి వసూళ్లు వస్తూనే ఉంటాయి. ఓవరాల్ గా ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా 300 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టినా ఆశ్చర్యం లేదని అంటున్నారు ట్రేడ్ పండితులు. చూడాలి మరి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఏమేరకు వసూళ్లు రాబడుతుంది అనేది.