https://oktelugu.com/

Rohit Sharma : రోహిత్ ఐపీఎల్ కు గుడ్ బై చెప్పబోతున్నాడా… అంబానీ కొడుకేనా కారణం?

రోహిత్ ను పక్కకు తప్పించి, హార్దిక్ పాండ్యా ను కెప్టెన్ చేయడం వెనుక ముఖేష్ అంబానీ పెద్ద కుమారుడు ఆకాష్ అంబానీ ఉన్నట్టు తెలుస్తోంది. ఆ మధ్య ముంబై జట్టు వరుసగా మ్యాచ్లలో ఓడిపోయినప్పుడు ఆకాశ్ అంబానీ రోహిత్ శర్మతో చర్చలు జరిపాడు.

Written By:
  • NARESH
  • , Updated On : May 11, 2024 / 10:29 PM IST

    Rohit Sharma

    Follow us on

    Rohit Sharma : మైదానంలో హిట్ మాన్ అవతారంలో ఉన్నప్పటికీ.. మైదానం వెలుపల మాత్రం రోహిత్ శర్మ మిస్టర్ కూల్. సరదాగా ఉంటాడు.. చలాకిగా మాట్లాడుతుంటాడు. ఆట ఆడే విషయంలో మాత్రం చాలా స్పష్టంగా ఉంటాడు. అందువల్లే ఐపీఎల్లో ముంబై జట్టు 5 సార్లు విజేతగా నిలిచింది. అత్యంత విజయవంతమైన జట్టుగా ఆవిర్భవించింది. ఈ సీజన్ తో కలుపుకొని.. గత మూడు సీజన్లలో ముంబై జట్టు ఆశించినంత స్థాయిలో ఆడటం లేదు. అందువల్ల ఈసారికి రోహిత్ ను కెప్టెన్సీ స్థానం నుంచి పక్కన పెట్టారు. దానిని హార్దిక్ పాండ్యాతో భర్తీ చేశారు. ఇక అప్పటి నుంచి ముంబై జట్టులో ముసలం మొదలైంది. ఎంతో విజయవంతమైన జట్టు కాస్తా వర్గాలుగా విడిపోయింది. ఫలితంగా దారుణమైన ఓటములతో.. ప్లే ఆఫ్ నుంచి దాదాపుగా నిష్క్రమించింది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో రోహిత్ శర్మకు సంబంధించి రోజుకో విషయం తెరపైకి వస్తోంది. తాజాగా “రోహిత్ ఐపీఎల్ కు గుడ్ బై చెప్పబోతున్నాడనే ” విషయం తెగ చక్కర్లు కొడుతోంది.

    కోల్ కతా నైట్ రైడర్స్ కు అసిస్టెంట్ కోచ్ గా అభిషేక్ నాయర్ వ్యవహరిస్తున్నాడు. ఇతడికి రోహిత్ శర్మకు మంచి స్నేహం ఉంది. వీరిద్దరూ ప్రాక్టీస్ సందర్భంగా పిచ్చాపాటిగా మాట్లాడుకుంటున్నారు. దీనిని కోల్ కతా జట్టు సోషల్ మీడియా విభాగం వీడియో తీసింది. దానిని గమనించని రోహిత్..” నాకు తెలియకుండానే అన్ని మారిపోతున్నాయి. నాకు సంబంధించినది ఏదైనా వాళ్ల నిర్ణయం మీద ఆధారపడి ఉంది. కానీ ఇవన్నీ నేను పట్టించుకునే స్థితిలో లేను. కానీ అది నా ఇల్లు భాయ్. దానిని దేవాలయం లాగా నేను నిర్మించానని” రోహిత్ పేర్కొన్నాడు.

    కోల్ కతా సోషల్ మీడియా విభాగం చిత్రీకరించిన ఆ వీడియోను.. అన్ని హ్యాండిల్స్ లో పోస్ట్ చేసింది. ఇంకేముంది రోహిత్ శర్మ చేసిన వ్యాఖ్యలు ఒక్కసారిగా చర్చకు దారితీసాయి.. ఆ సంభాషణలో “నాదేముంది.. ఇక ఇదే చివరిది” అని రోహిత్ శర్మ అన్నట్టుగా ప్రచారం జరుగుతోంది. అయితే అలాంటిదేమీ లేదని అతని అభిమానులు అంటున్నారు. ప్రస్తుతం ముంబై జట్టు దారుణమైన ఆటతీరు ప్రదర్శిస్తున్న నేపథ్యంలో ఈ వీడియో సంచలనంగా మారింది. హార్దిక్ పాండ్యా వ్యవహార శైలి.. ఆటగాళ్ల ప్రదర్శన.. వంటి విషయాలపై కొందరు సీనియర్ ఆటగాళ్లు కోచింగ్ సిబ్బంది దృష్టికి తీసుకెళ్లారని ఇటీవల ఒక ఆంగ్ల పత్రికలో కథనం ప్రచురితమైంది. దక్షిణాఫ్రికా ఆటగాడు ఏబీ డివిలియర్స్ కూడా ఇది నిజమే అన్నట్టుగా వ్యాఖ్యలు చేశాడు.. అయితే రోహిత్ ఈ స్థాయిలో కామెంట్స్ చేయడం వెనుక కెప్టెన్సీ మార్పు కారణమని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. రోహిత్ ను పక్కకు తప్పించి, హార్దిక్ పాండ్యా ను కెప్టెన్ చేయడం వెనుక ముఖేష్ అంబానీ పెద్ద కుమారుడు ఆకాష్ అంబానీ ఉన్నట్టు తెలుస్తోంది. ఆ మధ్య ముంబై జట్టు వరుసగా మ్యాచ్లలో ఓడిపోయినప్పుడు ఆకాశ్ అంబానీ రోహిత్ శర్మతో చర్చలు జరిపాడు. అప్పట్లో హార్దిక్ నుంచి రోహిత్ కు కెప్టెన్సీ ఇస్తారని ప్రచారం జరిగింది.. కానీ అది కార్యరూపం దాల్చలేదు.