KKR vs MI : పాపం నరైన్ అలా ఊహించి ఉండడు.. బుమ్రా అంటే మాటలా?

బుమ్రా అంటే అలానే ఉంటది మరి" అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఎంతో బలమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న కోల్ కతా.. ఈడెన్ గార్డెన్స్ లో తడబడింది. త్వర త్వరగా నే వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం నాలుగు వికెట్ల నష్టానికి 99 రన్స్ చేసింది. ఇప్పటికే 10 ఓవర్లు పూర్తయ్యాయి.

Written By: NARESH, Updated On : May 11, 2024 10:34 pm

KKR vs MI: Jasprit Bumrah yorker clean bowled by Sunil Narine

Follow us on

KKR vs MI : రోజూ జరిగితే దాన్ని అనుభవం అంటాం. ఎప్పుడో ఒక్కసారి జరిగితే దానిని అద్భుతం అంటాం. అలాంటి అద్భుతాన్ని కోల్ కతా లోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఆవిష్కరించాడు ముంబై ఇండియన్స్ జట్టు స్టార్ బౌలర్ జస్ ప్రీత్ బుమ్రా. ఐపీఎల్ లో భాగంగా శనివారం రాత్రి కోల్ కతా, ముంబై ఇండియన్స్ జట్లు తలపడ్డాయి. ఇప్పటికే ప్లే ఆఫ్ రేసు నుంచి నిష్క్రమించిన ముంబై .. పాయింట్లు పట్టికలో మొదటి స్థానంలో ఉన్న కోల్ కతా కు ఇది ఏమంత ముఖ్యమైన మ్యాచ్ కాదు. కాకపోతే షెడ్యూల్ లో ఉంది కాబట్టి.. రెండు జట్లు ఆడాల్సి వచ్చింది.. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ముంబై జట్టు.. బౌలింగ్ ఎంచుకుంది. కెప్టెన్ నిర్ణయం సరైనదే అని చెబుతూ.. ముంబై జట్టు బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ వేయడం ప్రారంభించారు. తొలి ఓవర్ వేసిన నువాన్ తుషారా.. ఐదవ బంతికే ముంబై ఇండియన్స్ జట్టులో ఆనందం నింపాడు. అతడు వేసిన ఐదవ బంతిని కోల్ కతా ప్రమాదకర ఆటగాడు సాల్ట్ తప్పుగా అంచనా వేశాడు. అన్షుల్ కాంబోజ్ కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. అతడు కేవలం ఐదు పరుగులు మాత్రమే చేసి నిరాశతో వెనుతిరిగాడు . అప్పటికి కోల్ కతా స్కోరు ఆరు పరుగులు.

ఈ దశలో రెండవ ఓవర్ వేయడం ప్రారంభించిన జస్ ప్రీత్ బుమ్రా కోల్ కతా కు కోలుకోలేని షాక్ ఇచ్చాడు. తను వేసిన మొదటి ఓవర్ తొలి బంతికే అత్యంత ప్రమాదకరమైన సునీల్ నరైన్ ను క్లీన్ బౌల్డ్ చేశాడు. వాస్తవానికి హాఫ్ సైడ్ దిశగా బంతి వెళ్తుందని సునీల్ భావించాడు. కానీ బుమ్రా అత్యంత తెలివిగా బంతిని స్వింగ్ చేయడంతో.. హాఫ్ సైడ్ దిశగా వెళ్తూనే.. ఒక్కసారిగా గమనం మార్చుకొని వికెట్లను గిరాటేసింది. దీంతో సునీల్ ప్రేక్షకుడిగా చూస్తూ ఉండిపోయాడు. అప్పటికే వికెట్ పడిపోవడంతో సున్నా పరుగులకే అవుట్ అయ్యాడు. నిరాశతో మైదానాన్ని వీడాడు.

ఈ సీజన్లో సునీల్ అద్భుతమైన ఫామ్ లో ఉన్నాడు. కోల్ కతా జట్టుకు అనితర సాధ్యమైన విజయాలు అందించాడు. ఇప్పటివరకు 12 మ్యాచ్లు ఆడిన అతడు.. 461 రన్స్ చేశాడు. ఇందులో ఒక సెంచరీ కూడా ఉంది. అతడి అత్యధిక స్కోరు 109. స్ట్రైక్ రేట్ 182.93. ఆరెంజ్ క్యాప్ విభాగంలో అతడు ఆరవ స్థానంలో కొనసాగుతున్నాడు. సూపర్ ఫామ్ లో ఉన్న సునీల్ న రైన్ న్ బుమ్రా అద్భుతమైన బంతితో అవుట్ చేసిన నేపథ్యంలో.. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ” చిన్న చిన్న బౌలర్లపై విరుచుకుపడే సునీల్.. డక్ అవుట్ అయ్యాడు. బుమ్రా అంటే అలానే ఉంటది మరి” అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఎంతో బలమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న కోల్ కతా.. ఈడెన్ గార్డెన్స్ లో తడబడింది. త్వర త్వరగా నే వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం నాలుగు వికెట్ల నష్టానికి 99 రన్స్ చేసింది. ఇప్పటికే 10 ఓవర్లు పూర్తయ్యాయి.