MS Dhoni Injury: చెన్నైకి షాక్‌.. ఐసీఎల్‌కు రెండు రోజుల ముందు ధోనీకి గాయం!

MS Dhoni Injury: ఐపీఎల్‌.. క్రికెట్‌ అభిమానులకు పూనకాలు తెప్పించే సీజన్‌ 16 మరో రెండు రోజుల్లో ప్రారంభం కాబోతోంది. తొలి మ్యాచ్‌ మార్చి 31న చెన్నై సూపర్‌ కింగ్స్, గుజరాత్‌ టైటాన్స్‌ మధ్య జరుగనుంది. దీంతో చెన్నైసూపర్‌ కింగ్స్‌ ఫ్యాన్స్‌ ఫుల్‌ జోష్‌లో ఉన్నారు. సీజన్‌ ఫస్ట్‌ మ్యాచ్‌లో ధోనీ బ్యాటింగ్‌ చూడబోతున్నాం అని ఎగ్జైట్‌ అవుతున్నారు. సరిగ్లా ఇలాంటి సమయంలో ఓ బ్యాడ్‌ న్యూస్‌ సదరు అభిమానుల్ని కలవరపెడుతోంది. ధోనీ గాయపడ్డాడని ప్రచారం జరుగుతోంది. […]

Written By: Raj Shekar, Updated On : March 29, 2023 1:14 pm
Follow us on

MS Dhoni Injury

MS Dhoni Injury: ఐపీఎల్‌.. క్రికెట్‌ అభిమానులకు పూనకాలు తెప్పించే సీజన్‌ 16 మరో రెండు రోజుల్లో ప్రారంభం కాబోతోంది. తొలి మ్యాచ్‌ మార్చి 31న చెన్నై సూపర్‌ కింగ్స్, గుజరాత్‌ టైటాన్స్‌ మధ్య జరుగనుంది. దీంతో చెన్నైసూపర్‌ కింగ్స్‌ ఫ్యాన్స్‌ ఫుల్‌ జోష్‌లో ఉన్నారు. సీజన్‌ ఫస్ట్‌ మ్యాచ్‌లో ధోనీ బ్యాటింగ్‌ చూడబోతున్నాం అని ఎగ్జైట్‌ అవుతున్నారు. సరిగ్లా ఇలాంటి సమయంలో ఓ బ్యాడ్‌ న్యూస్‌ సదరు అభిమానుల్ని కలవరపెడుతోంది. ధోనీ గాయపడ్డాడని ప్రచారం జరుగుతోంది. అయితే ఇది నిజం కాకూడదు అని గట్టిగా కోరుకుంటున్నారు. మరోవైపు ఇది అంత పెద్ద సమస్య అయ్యుండదులే అని మాట్లాడుకుంటున్నారు. మొన్ననే ప్రాక్టీసులో ఫుల్‌ ఎనర్జీతో కనిపించాడు.. ఇంతలోనే ఏమైంది అని క్రికెట్‌ ప్రేమికులు తెగ డిస్కస్‌ చేసుకుంటున్నారు.

ఎందుకు కుంటుతున్నాడు..
మహేంద్ర సింగ్‌ధోనీ అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి 2020లో రిటైర్‌ అయ్యాడు. అప్పటినుంచి ప్రతీ ఏడాది ఐపీఎల్‌లో మాత్రమే కనిపిస్తున్నాడు. చెన్నై సూపర్‌ కింగ్స్‌కు ఆడుతున్న మహీ.. గతేడాది జడేజాకు కెప్టెన్సీ ఇచ్చి ప్రయోగం చేశాడు. కానీ అంతగా వర్కౌట్‌ కాలేదు. దీంతో మళ్లీ తానే ఆ బాధ్యతలు తీసుకున్నాడు. ఇక ఈ సీజన్‌లో అదిరిపోయే ఫెర్ఫార్మెన్స్‌ చేయాలని గట్టిగానే ప్లాన్‌ చేస్తున్నాడు. అందులో భాగంగానే రీసెంట్‌గా చెపాక్‌లో సిక్సులు, ఫోర్లు కొడుతూ ప్రాక్టీస్‌ చేశాడు. అయితే గ్రౌండ్‌లోకి నడుచుకుంటూ వస్తున్నప్పుడు ధోనీ కాస్త కుంటుతున్నట్లు కొందరు ఫ్యాన్స్‌ గమనించారు. ఈ క్రమంలోనే గాయమైందనే న్యూస్‌ బయటకొచ్చింది.

MS Dhoni Injury

అంతా సెట్‌ అవుతుందా..
గత సీజన్‌లో ఎంట్రీ గుజరాత్‌ జట్టు.. ఏకంగా కప్‌ కొట్టి విజేతగా నిలిచింది. చెన్నైతో ఆడిన రెండు మ్యాచుల్లోనూ గుజరాత్‌ విజయం సాధించింది. ఇప్పుడు తొలి మ్యాచులో గెలిచి ప్రతీకారం తీర్చుకోవాలని చెన్నై భావిస్తుంది. ఇలాంటి టైంలో ధోనీ పరిస్థితి కాస్త కంగారు పెడుతున్నట్లు కనిపిస్తుంది. ప్రాక్టీస్‌ సందర్భంగా ధోనీ ఎడమ మోకాలు కాస్త పట్టేసిందని తెలుస్తోంది. దీంతో మోకాలికి క్యాప్‌ పెట్టుకుని ప్రాక్టీసు కోసం వచ్చాడు. అయితే ఇదేమంత పెద్ద గాయం కాదని తెలుస్తోంది. గుజరాత్‌ టైటాన్స్‌తో జరగబోయే తొలి మ్యాచుకు అంతా సెట్‌ అయిపోతుందని అభిమానులు మాట్లాడుకుంటున్నారు.