South Africa Cricket Team : నిన్న ఆఫ్గనిస్తాన్ పై.. నేడు ఐర్లాండ్ పై.. దక్షిణాఫ్రికా జట్టు ఎందుకు ఇంతలా దిగజారి పోతోంది?!

ఒకప్పుడు ఆస్ట్రేలియా జట్టును ఓడించిన టీం అది. టీమ్ ఇండియాను ఇబ్బందులకు గురిచేసిన జట్టు అది. పాకిస్తాన్ జట్టుకు చుక్కలు చూపించిన బృందం అది. వెస్టిండీస్ జట్టుకు నిద్రలేని రాత్రులను పరిచయం చేసిన సమూహమది. అలాంటి జట్టు నేడు అనామక టీమ్ లతో ఓడిపోతుంది. గతం ఎంతో ఘనం.. నేడు మాత్రం అధ్వానం అనే సామెతను నిజం చేసి చూపిస్తోంది.

Written By: Anabothula Bhaskar, Updated On : September 30, 2024 12:58 pm

SA VS IRE T20 Match

Follow us on

South Africa Cricket Team :  ఇటీవల ఆఫ్ఘనిస్తాన్ జట్టుతో జరిగిన వన్డే సిరీస్ ను దక్షిణాఫ్రికా 2-1 తేడాతో కోల్పోయింది. బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ ప్రకారం చూసుకుంటే ఆఫ్గనిస్తాన్ కంటే దక్షిణాఫ్రికా ఎన్నో రెట్లు మేలు. అయినప్పటికీ ఆఫ్గనిస్తాన్ చేతిలో తలవంచింది.. వన్డే సిరీస్ కోల్పోయింది. అంతకుముందు టి20 వరల్డ్ కప్ ఫైనల్లో భారత జట్టు చేతిలో ఓడిపోయింది. దీంతో దక్షిణాఫ్రికాపై విమర్శలు పెరిగిపోయాయి. ఈ క్రమంలోనే ప్రస్తుతం దక్షిణాఫ్రికా ఐలాండ్ జట్టుతో టీ20 సిరీస్ ఆడుతోంది. అబుదాబి వేదికగా జరిగిన తొలి మ్యాచ్లో ఓడిపోయింది. ఐర్లాండ్ జట్టు ఆల్రౌండ్ ప్రతిభతో దక్షిణాఫ్రికా జట్టును నేల నాకించింది. టి20 లలో దక్షిణాఫ్రికాపై తొలిసారి గెలుపును అందుకుంది. ఈ విజయం సాధించడంలో ఐర్లాండ్ జట్టు తరుపున అడైర్ సోదరులు రాస్ – మార్క్ ముఖ్యపాత్ర పోషించారు.. తొలి టి20 ని దక్షిణాఫ్రికా గెలవగా.. రెండవ టి20 ఐర్లాండ్ గెలుచుకుంది. మొత్తంగా ఈ సిరీస్ 1-1 తో సమం అయ్యింది.

సత్తా చూపించలేక..

టాస్ ఓడిపోయిన ఐర్లాండ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లకు 195 పరుగులు చేసింది. టి20 లలో సౌత్ ఆఫ్రికా జట్టుపై ఐర్లాండ్కు ఇదే హైయెస్ట్ స్కోర్. ఐలాండ్ జట్టు తరఫున ఓపెనర్ అడైర్ సెంచరీ చేసి ఆకట్టుకున్నాడు. అతడు 58 బంతులు ఎదుర్కొని శతకం చేశాడు. అతడి ఇన్నింగ్స్ లో ఐదు ఫోర్లు, 9 సిక్సర్లు ఉన్నాయి. మరో ఓపెనర్ స్టిర్లింగ్ 52 పరుగులు చేశాడు.. వీరిద్దరూ దూకుడుగా బ్యాటింగ్ చేయడంతో 13 ఓవర్లలోనే ఐర్లాండ్ 137 స్కోర్ చేసింది. ఒకానొక దశలో ఐర్లాండ్ 20 పరుగులు చేస్తుందని అనిపించింది. కానీ ఈ దశలో సౌత్ ఆఫ్రికా బౌలర్లు రెచ్చిపోయి బౌలింగ్ చేయడంతో స్కోర్ బోర్డ్ వేగం అందుకోలేకపోయింది. దక్షిణాఫ్రికా జట్టు తరఫున ముల్డర్ రెండు వికెట్లు దక్కించుకున్నాడు. ఎంగిడి, విలియమ్స్, పాట్రిక్ తలా ఒక వికెట్ సాధించారు. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన సౌత్ ఆఫ్రికా 20 ఓవర్లలో 9 వికెట్లు నష్టపోయి 185 పరుగులు మాత్రమే చేసింది. టాప్ ఆర్డర్ బ్యాటర్లు మాత్రమే రాణించారు. మిగతావారు రెండంకెల స్కోర్ చేయలేకపోయారు. రీజా హెండ్రిక్స్(51), మాథ్యూ(51) హాఫ్ సెంచరీలతో ఆకట్టుకున్నారు. ర్యాన్ రికెల్టన్ (36) పరుగులు చేశాడు. అయితే మిగతావారు ఆ స్థాయిలో సత్తా చూపించకపోవడంతో దక్షిణాఫ్రికా జట్టుకు ఓటమి తప్పలేదు. ఐర్లాండ్ జట్టులో అడైర్ నాలుగు వికెట్లు తగ్గించుకున్నాడు. గ్రహం మూడు వికెట్ల సొంతం చేసుకున్నాడు. ఇక ఇదే వేదికగా ఐర్లాండ్ – దక్షిణాఫ్రికా జట్లు 3 వన్డేల సిరీస్ ఆడుతాయి. ఇటీవల ఆఫ్ఘనిస్తాన్ జట్టుతో జరిగిన 3 వన్డేల సిరీస్ ను దక్షిణాఫ్రికా కోల్పోయింది. 1-2 తేడాతో ఆఫ్గాన్ జట్టు ఎదుట తలవంచింది.