https://oktelugu.com/

IPL 2024: ఐపీఎల్ చూసేవాళ్లంతా ఈ ఒక్క తప్పు అసలు చేయవద్దు…

నిజానికి ఈ బెట్టింగ్ అనేది జూదం లాంటిది ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో ఎవరికీ తెలియదు. ఒకవేళ ఒక మ్యాచ్ లో మనం సంపాదించుకున్నా కూడా మొత్తం మ్యాచ్ లు ముగిసే సమయానికి మాత్రం...

Written By:
  • Gopi
  • , Updated On : March 23, 2024 / 01:26 PM IST

    IPL watchers dont do this one mistake

    Follow us on

    మొత్తానికైతే ఐపిఎల్ సీజన్ 17 స్టార్ట్ అయింది. ఇక అందులో భాగంగానే ఈ మ్యాచ్ లు చూడడానికి జనాలు కూడా చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే చాలామంది అభిమానులు ఈ మ్యాచ్ ను చూస్తూ ఎంజాయ్ చేయడమే కాకుండా వాళ్ల ఫేవరెట్ ప్లేయర్లు ఆడే ఆట తీరుకి మురిసిపోతారు. ఇక ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ చాలామంది యూత్ మ్యాచ్ లను చూస్తూ ఎంజాయ్ చేయడమే కాకుండా దాని ద్వారా డబ్బులను కూడా సంపాదించాలనే ఒక దురుద్దేశంతో మ్యాచ్ ల మీద బెట్టింగ్ లు కాస్తున్నారు.

    నిజానికి ఈ బెట్టింగ్ అనేది జూదం లాంటిది ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో ఎవరికీ తెలియదు. ఒకవేళ ఒక మ్యాచ్ లో మనం సంపాదించుకున్నా కూడా మొత్తం మ్యాచ్ లు ముగిసే సమయానికి మాత్రం మనం చాలా వరకు డబ్బులను నష్టపోవాల్సి వస్తుంది. ఒకసారి డబ్బులు వచ్చినంత మాత్రాన మరోసారి వస్తుందనే గ్యారెంటీ లేదు. కాబట్టి డబ్బులు విషయంలో చాలా ఆచితూచి వ్యవహరిస్తేనే తప్ప ఫైనాన్షియల్ గా ఏ ఇబ్బందులు ఉండలేము. మనం చేసిన పనికి మన పేరెంట్స్ కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇక ఇప్పటికే చాలామంది ఐపీఎల్ వల్ల కూడా సర్వం పోగొట్టుకొని ఇబ్బందులు పడుతున్నా వాళ్ళు ఉన్నారు.

    కాబట్టి ఈ మ్యాచ్ లను చూస్తూ ఎంజాయ్ చేయడం వరకు మంచిదే కానీ అంతకుమించి బెట్టింగ్ ల కోసం ముందుకెళ్తే మాత్రం మనకి మిగిలేది ఏమీ ఉండదు. కోల్పోయేది తప్ప ఈ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకొని ఐపీఎల్ మ్యాచ్ లను చూడడానికి ప్రిపేర్ అయితే మంచిదని చాలామంది క్రికెట్ మేధావులు కూడా ఇప్పుడున్న యువకులకు సలహాలను ఇస్తున్నారు…

    ఇక ఇలాంటి క్రమంలోనే మ్యాచ్ ను చూస్తూ వాళ్ళ అభిమాన ప్లేయర్లు ఆడే ఆటని ఎంకరేజ్ చేస్తూ ముందుకు కదిలితే ఎలాంటి ఇబ్బంది ఉండదు అలా కాకుండా వేరే ఇల్లీగల్ ఆక్టివిటీస్ లో పాల్గొంటేనే ప్రాబ్లం అవుతుంది.ఇక ఇది ఒక్కటి గుర్తుపెట్టుకొని ముందుకు కదిలితే యూత్ ఐపిఎల్ లో రాణించే అవకాశం ఉంటుంది…