https://oktelugu.com/

Chiranjeevi: చిరంజీవి లో ఉన్న ఈ గొప్ప క్వాలిటీ మరెవరి లో ఉండదేమో…

టాలెంట్ ఉన్న ప్రతి ఒక్కరూ ఇక్కడ రాణించాలని చిరంజీవి కోరుకుంటూ ఉంటాడు. ఇక మిగతా హీరోలు అయితే మాకు సక్సెస్ రావాలి, భారీగా డబ్బులు సంపాదించుకోవాలి, భారీగా క్రేజ్ పెంచుకోవాలనే విధంగా ఆలోచిస్తారు.

Written By:
  • Gopi
  • , Updated On : March 23, 2024 / 01:47 PM IST

    Chiranjeevi

    Follow us on

    Chiranjeevi: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలామంది నటులు ప్రస్తుతం స్టార్ హీరోలుగా కొనసాగుతున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే చిరంజీవి కూడా చాలా మంచి విజయాలను అందుకొని ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పాటు చేసుకున్నాడు. ఇక ఇలాంటి క్రమంలోనే చిరంజీవి లాంటి హీరో ఇండస్ట్రీలో మరొకరు ఉండరు అని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఎవరి అయిన టాలెంట్ ఉంది అని తెలిస్తే ఆ వ్యక్తిని చేరదీసి ఆయనకి లైఫ్ ఇవ్వడం లో చిరంజీవి చాలా ముందు వరుసలో ఉంటాడు.

    ఇక ఇప్పటికే ఆయన ద్వారా ఇండస్ట్రీకి వచ్చి స్టార్లుగా ఎదిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అందులో బ్రహ్మానందం, రాఘవ లారెన్స్ లాంటి చాలామంది నటులు ఉన్నారు. వీళ్లంతా వాళ్ళకంటు ఒక ప్రత్యేకతను ఏర్పాటు చేసుకున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే వాళ్ళు చేస్తున్న ప్రతి సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంటుంది. అలా చిరంజీవి ఏం చేసిన కూడా ఒక అద్భుతంగా నిలుస్తుందనే చెప్పాలి. ఇక ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న చాలామంది నటులు చిరంజీవి చూపించిన మార్గంలోనే ఆయన ఇచ్చిన ప్రోత్సాహంతో కొనసాగుతున్నారు.

    టాలెంట్ ఉన్న ప్రతి ఒక్కరూ ఇక్కడ రాణించాలని చిరంజీవి కోరుకుంటూ ఉంటాడు. ఇక మిగతా హీరోలు అయితే మాకు సక్సెస్ రావాలి, భారీగా డబ్బులు సంపాదించుకోవాలి, భారీగా క్రేజ్ పెంచుకోవాలనే విధంగా ఆలోచిస్తారు. అంతే తప్ప ఏ ఒక్కరు మిగతా వాళ్ల గురించి ఆలోచించరు అని చాలామంది సినీ విమర్శకులు సైతం సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోల మీద విమర్శలు చేస్తూ ఉంటారు.

    అలాగే ఒక సినిమా తో సక్సెస్ కొడితే ఆయా సినిమాల దర్శకులను గాని, హీరోలను గాని తన ఇంటికి పిలిపించుకొని మరి వాళ్ళకి సన్మానం చేస్తూ ఉంటాడు. చిరంజీవి ఇలాంటి ప్రోత్సాహం ఇవ్వడంతో చాలామంది యంగ్ దర్శకులు, యంగ్ హీరోలు చాలా సినిమాలు చేస్తూ రెట్టింపు ఆనందంతో ముందుకు కదులుతున్నారనే చెప్పాలి. ఇక ఇలాంటి క్రమంలోనే వాళ్ళు చేస్తున్న సినిమాలు కూడా సూపర్ డూపర్ సక్సెస్ లు సాధిస్తూ ముందుకు వెళుతున్నారు…