IPL 2024: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ ఎడిషన్లో భాగంగా మరో రసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది. చండీగఢ్ వేదికగా శనివారం మధ్యాహ్నం రెండు గంటల 30 నిమిషాల నుంచి ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ మధ్య లీగ్ మ్యాచ్ జరగనుంది. సుదీర్ఘ విరామం తర్వాత రిషబ్ పంత్ ఢిల్లీ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. ఈ మ్యాచ్ ద్వారా అతడు క్రికెట్లోకి రీఎంట్రీ ఇస్తున్నాడు. 2022లో పంత్ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. ఆసుపత్రిలో చికిత్స పొంది, సుదీర్ఘ విరామం తర్వాత అతడు క్రికెట్ మ్యాచ్ ఆడబోతున్నాడు. ఇప్పటికే తను ఫిట్ గా ఉన్నానని పంత్ ప్రకటించాడు. పంత్ కూడా తీవ్రంగా శ్రమించాడని.. ఆట తీరును మైదానంలో చూస్తారని ఢిల్లీ కోచ్ పాంటింగ్ ప్రకటించాడు. బౌలింగ్, బ్యాటింగ్ భాగంలో ఢిల్లీ జట్టు పటిష్టంగా ఉందని అతడు వివరించాడు. ఇక గత సీజన్లో ఢిల్లీకి డేవిడ్ వార్నర్ కెప్టెన్ గా ఉన్నాడు. అప్పుడు ఆ జట్టు 9వ స్థానంలో నిలిచింది.
మొన్నటిదాకా ఢిల్లీ జట్టుకు ఆడిన శిఖర్ ధావన్ ప్రస్తుతం పంజాబ్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. ఈసారి ఎలాగైనా తన జట్టుకు విజయం అందించాలని అతడు చూస్తున్నాడు. 2014లో పంజాబ్ జట్టు ఫైనల్ వెళ్ళింది. ఆ మ్యాచ్లో కోల్ కతా చేతిలో ఓడిపోయింది. ఇక అప్పటినుంచి ఇప్పటివరకు ఆ స్థాయిలో ప్రదర్శన చూపించలేకపోయింది. పంజాబ్ జట్టుకు జితేష్ శర్మ వైస్ కెప్టెంబర్ వ్యవరిస్తున్నాడు. సికిందర్ రజా, సామ్ కరన్, లివింగ్ స్టోన్ వంటి వారు ఉండడంతో పంజాబ్ జట్టు బలంగా కనిపిస్తోంది. రబడ, అర్షదీప్, హర్షల్ పటేల్ వంటి వారితో బౌలింగ్ దళం కూడా పరవాలేదు అనిపించే స్థాయిలో ఉంది. గత సీజన్లో ఈ రెండు జట్లు పేలవమైన ప్రదర్శన కొనసాగించిన నేపథ్యంలో.. ఈసారి మెరుగైన ప్రదర్శన చేయాలని భావిస్తున్నాయి.
ఢిల్లీ జట్టు
డేవిడ్ వార్నర్, పృథ్వీ షా, మార్ష్, రిషబ్ పంత్, ఫ్రెజర్, స్టబ్స్, అభిషేక్ పోరల్, రికి, కుమార్ కుషాగ్ర, అక్షర్ పటేల్, లలిత్ యాదవ్, కులదీప్ యాదవ్, ఈశాంత్ శర్మ, ఖలీల్ శర్మ, అహ్మద్
పంజాబ్
శిఖర్ ధావన్, బెయిర్ స్టో, ప్రభు సిమ్రాన్ సింగ్, లివింగ్ స్టోన్, జితేష్ శర్మ, అశుతోష్ శర్మ, శశాంక్ సింగ్, సామ్ కరణ్, రబడా, హర్షల్ పటేల్, అర్ష్ దీప్ సింగ్.