IPL Retention Announcement 2025: మెగా వేలానికి ముందే జట్లు రి టెన్షన్ జాబితాను బీసీసీఐకి అందించాలి. ఈ గడువు అక్టోబర్ 31 సాయంత్రం ఐదు గంటల వరకు ఉంది. ఈ క్రమంలో జట్లు తమతో పాటు ఉంచుకునే ఆటగాళ్లు ఎవరు? బయటికి వెళ్లిపోయే ఆటగాళ్లు ఎవరు? అనే అంశాలపై విపరీతమైన చర్చలు సాగుతున్నాయి. రి టెన్షన్ నిబంధనల ప్రకారం ప్రతి జట్టు ఆరుగురు ఆటగాళ్లను రిటైన్ చేసుకోవాల్సి ఉంటుంది.. ఈ క్రమంలో జట్లు ఆరుగురు ఆటగాళ్లను నిలుపుకోవాల్సి ఉంటుంది. మరికొద్ది గంటల్లో రి టెన్షన్ ఆటగాళ్లపై స్పష్టత వస్తుంది. ఇప్పటికే ఆయా జట్లు ఆ జాబితాను పూర్తి చేశాయి.. అయితే స్టార్ ఆటగాళ్లను జట్టులో ఉంచుకునే యాజమాన్యాలు.. మిగతా ఆటగాళ్లను వేలానికి వదిలేయడం లేదా రైట్ టు మ్యాచ్ ద్వారా తిరిగి దక్కించుకోవాలని భావిస్తున్నాయి. ఈ జాబితాలో ముంబై జట్టు నుంచి రోహిత్, ఢిల్లీ జట్టు నుంచి రిషబ్ పంత్, లక్నో నుంచి రాహుల్ పేర్లు ఉన్నాయని జాతీయ మీడియాలో కథనాలు వినిపిస్తున్నాయి.. అంతేకాదు గత ఏడాది ముంబై జట్టు హార్దిక్ పాండ్యాను గుజరాత్ నుంచి తీసుకుని కెప్టెన్ గా నియమించింది. అయితే ఈసారి రోహిత్ శర్మానం వదిలేస్తుందని తెలుస్తోంది. దీనిపై అటు రోహిత్, ఇటు ముంబై ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు.
పంత్ వేలంలోకి వస్తే..
ఢిల్లీ జట్టు కెప్టెన్ రిషబ్ పంత్ ఒకవేళ వేలంలోకి వస్తే.. అతడిని కొనుగోలు చేయడానికి చెన్నై సూపర్ కింగ్స్ సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. అతడికి ఏకంగా కెప్టెన్సీ కూడా ఇస్తుందని ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే మహేంద్ర సింగ్ ధోని కెరియర్ చివరి దశలో ఉంది. ఆయన ఒకప్పటిలాగా ఆడే అవకాశం లేదు. పైగా ఆయన గత సీజన్ లో కెప్టెన్ నుంచి వై దొలిగాడు. అయితే ప్రస్తుతం రిషబ్ పంత్ దూకుడుగా ఆడుతున్న నేపథ్యంలో.. అతడికి కెప్టెన్సీ, వికెట్ కీపింగ్ బాధ్యతలు అప్పగించే అవకాశాలు అన్నయ్య తెలుస్తోంది..
హైదరాబాద్ జట్టులో..
గత సీజన్లో హైదరాబాద్ జట్టు ఫైనల్ దాకా వెళ్ళింది. లక్నో చేతిలో ఓడిపోయింది. ఈ జట్టులో క్లాసెన్, కమిన్స్, అభిషేక్ శర్మను రిటైన్ చేసుకుంటున్నారని తెలుస్తోంది. హెడ్, నితీష్ కుమార్ రెడ్డి ని కూడా జట్టులో ఉంచుకోనుందని సమాచారం.
లక్నో జట్టులో..
లక్నో జట్టు 2022 సీజన్లో రాహుల్ కు భారీగా ధరించి కెప్టెన్ గా నియమించింది. అయితే గత సీజన్లో లక్నో జట్టు యజమానికి, రాహుల్ కు గొడవైంది. ఇక అప్పటినుంచి ఆ జట్టు యాజమాన్యం అతడిని బయటికి పంపించాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అతడు కూడా దానికే నిర్ణయించుకున్నట్టు సమాచారం. ఒకవేళ అతడు వేలంలోకి వస్తే బెంగళూరు జట్టు కొనుగోలు చేయాలని భావిస్తోంది. పూరన్ ను టాప్ రి టెన్షన్ (18 కోట్లు) గా నియమించుకునే అవకాశం కనిపిస్తోంది. యంగ్ ప్లేయర్లు రవి బిష్ణోయ్, మయాంక్ యాదవ్ ను మిగిలిన ఎంపికలుగా చేసినట్టు తెలుస్తోంది. లక్నో జట్టు గత మూడు సీజన్లో రెండుసార్లు ప్లే ఆఫ్ దాకా వెళ్ళింది.