Homeక్రీడలుక్రికెట్‌IPL Orange Cap: రోహిత్ సెంచరీ.. అయినప్పటికీ అగ్రస్థానంలోనే విరాట్ కోహ్లీ..

IPL Orange Cap: రోహిత్ సెంచరీ.. అయినప్పటికీ అగ్రస్థానంలోనే విరాట్ కోహ్లీ..

IPL Orange Cap: ఐపీఎల్ 17వ సీజన్లో టీమిండియా రన్ మిషన్ విరాట్ కోహ్లీ దూసుకుపోతున్నాడు. దూకుడయిన బ్యాటింగ్ తో నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్నాడు. ఐపీఎల్లో ఇప్పటివరకు 6 మ్యాచ్ లు ఆడి 319 పరుగులు చేశాడు. 79.75 సగటు, 141.77 స్ట్రైక్ రేట్ తో ఆరెంజ్ క్యాప్ విభాగంలో మొదటి స్థానంలో ఉన్నాడు. ఇతడు ఈ సీజన్లో ఒక సెంచరీ కూడా చేశాడు.

రియాన్ పరాగ్

విరాట్ కోహ్లీ తర్వాత రియాన్ పరాగ్ రెండవ స్థానంలో ఉన్నాడు. రాజస్థాన్ జట్టుకు చెందిన ఈ ఆటగాడు ఇప్పటివరకు ఆరు మ్యాచులు ఆడాడు. 284 పరుగులు చేశాడు. 71 సగటుతో కొనసాగుతున్నాడు. 155.19 స్ట్రైక్ రేట్ మైంటైన్ చేస్తున్నాడు. ఈ సీజన్లో ఇతడి అత్యధిక స్కోరు ఇప్పటివరకు 84 *.

సంజు సాంసన్

రాజస్థాన్ జట్టు కెప్టెన్ గా వ్యవహరిస్తున్న ఈ ఆటగాడు.. ఈ సీజన్ లో ఇప్పటివరకు 264 రన్స్ చేశాడు. 66 సగటుతో … 155.29 స్ట్రైక్ రేట్ తో కొనసాగుతున్నాడు. ఇప్పటివరకు ఇతడి అత్యధిక స్కోరు 82*.

రోహిత్ శర్మ

ముంబై ఇండియన్స్ జట్టుకు చెందిన ఈ ఆటగాడు ఇప్పటివరకు 6 మ్యాచ్ లు ఆడాడు. 261 పరుగులు చేశాడు. 52.20 సగటు కొనసాగిస్తున్న ఈ ఆటగాడు.. 167.30 స్ట్రైక్ రేట్ తో ముందున్నాడు. ఈ సీజన్లో ఇతడి అత్యధిక స్కోరు 105*.

శుభ్ మన్ గిల్

గుజరాత్ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరిస్తున్న ఈ ఆటగాడు.. ఐపీఎల్ ఈ సీజన్ లో ఇప్పటివరకు 16 మ్యాచ్ లు ఆడాడు. 255 పరుగులు చేశాడు. 51 సగటుతో 151.78 స్ట్రైక్ రేట్ తో సత్తా చాటుతున్నాడు. ఇప్పటివరకు అతడి అత్యధిక స్కోరు 89*.

సీజన్ల వారీగా ఇలా..

ఇప్పటివరకు ఐపీఎల్ 16 సీజన్లు పూర్తయ్యాయి. 2008లో పంజాబ్ ఆటగాడు షాన్ మార్ష్ 616 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ దక్కించుకున్నాడు.

2009 సీజన్లో చెన్నై ఆటగాడు హెడెన్ 572 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకున్నాడు.

2010 సీజన్లో ముంబై ఇండియన్స్ ఆటగాడు సచిన్ టెండుల్కర్ 618 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ దక్కించుకున్నాడు.

2011లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఆటగాడు గేల్ 608 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ ఒడిసిపట్టాడు.

2012లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఆటగాడు గేల్ 733 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ విన్నర్ అయ్యాడు.

2013లో చెన్నై ఆటగాడు మైకేల్ హస్సి 733 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకున్నాడు.

2014లో కోల్ కతా ఆటగాడు రాబిన్ ఊతప్ప 660 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ ను సొంతం చేసుకున్నాడు.

2015లో హైదరాబాద్ ఆటగాడు డేవిడ్ వార్నర్ 562 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకున్నాడు.

2016లో బెంగళూరు ఆటగాడు విరాట్ కోహ్లీ 973 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ విన్నర్ అయ్యాడు. ఇప్పటివరకు ఆరెంజ్ క్యాప్ జాబితాలో విరాట్ కోహ్లీ చేసిన పరుగులే ఐపిఎల్ చరిత్రలో అత్యధిక స్కోరు.

2017లో హైదరాబాద్ ఆటగాడు డేవిడ్ వార్నర్ 641 రన్స్ చేసి ఆరెంజ్ క్యాప్ దక్కించుకున్నాడు.

2018లో హైదరాబాద్ ఆటగాడు విలియంసన్ 735 రన్స్ చేసి ఆరెంజ్ క్యాప్ విన్నర్ అయ్యాడు.

2019లో హైదరాబాద్ ఆటగాడు డేవిడ్ వార్నర్ 692 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ దక్కించుకున్నాడు.

2020లో పంజాబ్ జట్టు ఆటగాడు రాహుల్ 670 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ ధరించాడు.

2021లో చెన్నై ఆటగాడు రుతు రాజ్ గైక్వాడ్ 635 రన్స్ చేసి ఆరెంజ్ క్యాప్ దక్కించుకున్నాడు.

2022లో జోస్ బట్లర్ రాజస్థాన్ రాయల్స్ జట్టు తరఫున 863 రన్స్ చేసి ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకున్నాడు.

2023లో గుజరాత్ జట్టు ఆటగాడు గిల్ 890 రన్స్ చేసి ఆరెంజ్ క్యాప్ ధరించాడు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular