IPL Mini Auction 2026: 2026 ఐపిఎల్ కోసం బీసీసీఐ ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా వచ్చే సీజన్ కు మినీ వేలం నిర్వహణకు రంగం సిద్ధం చేసింది. ఈ క్రమంలో మంగళవారం అబుదాబి వేదికగా మినీ వేలం జరగనుంది. మినీ వేలన్ని ఘనంగా నిర్వహించడానికి బిసిసిఐ ఏర్పాట్లు చేసింది.
మినీ వేలాని కంటే ముందు బీసీసీఐ విధించిన నిబంధనల ప్రకారం ఆయా జట్లు కొంతమంది ఆటగాళ్లను తమ వద్ద ఉంచుకోగా.. మిగతా వారిని పక్కన పెట్టాయి. దీంతో ఈసారి వేలంలో చాలామంది ఆటగాళ్లు అందుబాటులో ఉన్నారు. అందిజట్లలో కెల్లా కోల్ కతా నైట్ రైడర్స్ ఎక్కువమంది ప్లేయర్లను పక్కనపెట్టింది. ఈ క్రమంలో ఆ జట్టు వద్ద ఏకంగా 64.30 కోట్ల పర్స్ వేల్యూ ఉంది. షారూక్ ఖాన్ జట్టు తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ జట్టు వద్ద 43.40 కోట్ల పర్స్ వేల్యూ ఉంది. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు వద్ద 25.50 పర్స్ వేల్యూ ఉంది. లక్నో సూపర్ జెయింట్స్ వద్ద 22.95 కోట్ల పర్స్ వేల్యూ ఉంది. ఢిల్లీ క్యాపిటల్స్ వద్ద 21.80 కోట్ల పర్స్ వేల్యూ ఉంది. తర్వాత రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వద్ద 16.40 కోట్ల పర్స్ వేల్యూ ఉంది. రాజస్థాన్ రాయల్స్ జట్టు వద్ద 16.05 కోట్ల పర్స్ వేల్యూ ఉంది. గుజరాత్ టైటాన్స్ వద్ద 12.90 కోట్ల పర్స్ వేల్యూ ఉంది. పంజాబ్ జట్టు వద్ద 11.50 కోట్ల పర్స్ వేల్యూ ఉంది. ముంబై ఇండియన్స్ వద్ద 2.75 కోట్ల పర్స్ వేల్యూ ఉంది.
కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు వద్ద భారీగా పర్స్ వేల్యూ ఉన్న నేపథ్యంలో.. ఆ జట్టు యాజమాన్యం ఎక్కువ స్థాయిలో ప్లేయర్లను తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే ఆ జట్టు భారంగా ఉన్న ప్లేయర్లను వదిలించుకుంది. వచ్చే సీజన్లో ఎలాగైనా సరే విజేతగా నిలవాలని ఆ జట్టు భావిస్తోంది. అందువల్లే గత కొద్ది సీజన్లుగా సరిగ్గా ఆడని ప్లేయర్లను మొహమాటం లేకుండా పక్కన పెట్టింది. కోల్ కతా నైట్ రైడర్స్ తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ కూడా అదే స్థాయిలో ప్లేయర్లను పక్కనపెట్టింది. ఆ జట్టు వద్ద కూడా భారీగానే పర్స్ వేల్యూ ఉంది. ఈ జట్టు కొత్త ప్లేయర్లను తీసుకునే అవకాశం ఉంది.
కోల్ కతా, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల వద్ద పర్స్ వేల్యూ భారీగా ఉండడంతో కొత్త ప్లేయర్లను ఈ రెండు జట్లు భారీగా తీసుకునే అవకాశం ఉంది. పేస్ బౌలింగ్, ఆల్ రౌండర్, మిడిల్ ఆర్డర్, స్లాగ్ ఓవర్ లలో అదరగొట్టే ప్లేయర్లకు ఈ రెండు జట్లు రెడ్ కార్పెట్ పరిచే అవకాశం ఉంది. ఓ అంచనా ప్రకారం డొమెస్టిక్ ప్లేయర్లను ఎక్కువగా తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ రెండు జట్లు సమర్థవంతమైన యంగ్ ప్లేయర్ల కోసం అన్వేషిస్తున్నాయి. ఆ జట్ల యాజమాన్యాలు కోరుకున్న లక్షణాలు ఉన్న ప్లేయర్ల పై కనక వర్షం కురుస్తుందని మాజీ క్రికెటర్లు వ్యాఖ్యానిస్తున్నారు.