IPL auction 2026: వచ్చే ఏడాది జరిగే ఐపీఎల్ కోసం నిర్వాహక బిసిసిఐ ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా నిర్వహించే మినీ వేలానికి రంగం సిద్ధమైంది. డిసెంబర్ 16న అబుదాబి ప్రాంతంలో మినీ వేలం జరుగుతుంది. ఈసారి కూడా భారీగానే ఆటగాళ్లు వేలంలో తమ పేర్లను నమోదు చేసుకున్నారు.
జాతీయ మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం వేలంలో మొత్తం 1390 మంది ప్లేయర్లు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. వారిలో 350 మంది ప్లేయర్ల వివరాలను షార్ట్ లిస్టు చేశారు. ఇందులో 240 మంది ప్లేయర్లు భారతీయులు కాగా, 110 మంది విదేశీ ప్లేయర్లు. ఇందులో 14 మంది అన్ క్యాప్డ్ విదేశీ ప్లేయర్లు ఉన్నారు.. ఐపీఎల్ యాజమాన్యాలు 77 మంది ప్లేయర్లను తీసుకోవాల్సి ఉంటుంది. ఇందులో 31 మంది విదేశీ ప్లేయర్లకు అవకాశం ఉంది.. అత్యధిక రిజర్వు ధర రెండు కోట్లు.. రెండు కోట్ల బేస్ ధరను 40 మంది ప్లేయర్లు నమోదు చేసుకున్నారు..
కోటిన్నర బేస్ ధరతో 9 మంది ప్లేయర్లు తమ పేర్లను నమోదు చేసుకున్నారు.. కోటి 25 లక్షల ధరలతో నలుగురు తమ బేస్ ధరను నిర్ణయించుకున్నారు. 17 మంది ప్లేయర్లు కోటి రూపాయల బేస్ ధరను నిర్ణయించుకున్నారు. 42 మంది ప్లేయర్లు 75 లక్షల బేస్ ధరను నిర్ణయించుకున్నారు. నలుగురు ప్లేయర్లు 50 లక్షల బేస్ ధరను నమోదు చేసుకున్నారు. ఏడుగురు ప్లేయర్లు 40 లక్షల బేస్ ధరను నమోదు చేసుకున్నారు. మిగతా 227 మంది ప్లేయర్లు 30 లక్షలను తమ బేస్ ధరగా నిర్ణయించుకున్నారు. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం ఒంటిగంట నుంచి మినీ వేలం నడుస్తుంది.
ఈసారి కోల్ కతా నైట్ రైడర్స్ తమ దగ్గర ఉన్న చాలామంది ప్లేయర్లను వదిలేసుకుంది.. కొంతమంది ప్లేయర్లను మాత్రమే తన వద్ద అంటి పెట్టుకుంది.. 2025 సీజన్లో అంతగా ఆకట్టుకోలేకపోవడంతో జట్టు మొత్తాన్ని ప్రక్షాళన చేయాలని యాజమాన్యం భావించింది.. అందువల్లే ఈ నిర్ణయం తీసుకుంది.. మొత్తంగా చూస్తే ఈ ఐపిఎల్ లో కోల్ కతా యాజమాన్యానికి పర్స్ వేల్యూ ఎక్కువగా ఉంది. అందువల్లే ఆ యాజమాన్యం ఎక్కువమంది ప్లేయర్లను కొనుగోలు చేయడానికి ఆస్కారం ఏర్పడింది.