2026 Sankranti movies: తెలుగు సినిమా ఖ్యాతి ఎల్లలు దాటి పోయింది. ఇండియాలో ఇప్పుడు ఎక్కడ చూసిన కూడా తెలుగు సినిమా హవా నే కొనసాగుతోంది… మన హీరోలు సైతం డిఫరెంట్ సబ్జెక్టులను ఎంచుకొని ముందుకు సాగుతున్నారు. ఇక సినిమా ఇండస్ట్రీలో పండగ వాతావరణం వచ్చిందంటే చాలు కొత్త సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. కారణం ఏంటంటే పండగ సమయంలో సినిమాలు థియేటర్ కి వస్తే ప్రేక్షకులు వాళ్ల ఫ్యామిలీతో కలిసి సినిమా చూడటానికి అవకాశం ఉంటుంది. తద్వారా సినిమాకి కలెక్షన్స్ ఎక్కువగా వస్తాయి. ఇక ఈ సంక్రాంతి పండుగకు మెగాస్టార్ చిరంజీవి ప్రభాస్ లతో పాటు మరి కొంతమంది హీరోలు కూడా బరిలోకి దిగుతుండడం విశేషం…ఇక చిరంజీవి హీరోగా వస్తున్న ‘మన శంకర వరప్రసాద్’ సినిమా మీద మంచి అంచనాలైతే ఉన్నాయి. ఇక ఆ అంచనాలకు తగ్గట్టుగానే సినిమాని తెరకెక్కిస్తున్నట్టుగా తెలుస్తోంది…ప్రభాస్ హీరోగా వస్తున్న రాజా సాబ్ సినిమా కూడా సంక్రాంతి బరిలో నిలుస్తుండటం విశేషం…
మారుతి డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ సినిమా మీద భారీ అంచనాలైతే ఉన్నాయి. ప్రభాస్ తన కెరీర్ లో ఎప్పుడు చేయనటువంటి ఒక డిఫరెంట్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఇక వీటితో పాటుగా రవితేజ హీరోగా వస్తున్న ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ సినిమా కూడా వస్తోంది. ఇక ఈ సినిమా మీద పెద్దగా అంచనాలైతే లేవు.
కారణం ఏంటి అంటే రవితేజ గత సినిమాలు పెద్దగా ఆడకపోవడం అలాగే తన మార్కెట్ ను కోల్పోతూ వస్తుండటం వల్ల రవితేజ సినిమాల మీద ప్రతి ఒక్కరికి నమ్మకమైతే పోయింది. సినిమా ఆడితే ఆడుతోంది. లేకపోతే అస్సాం పోతోంది అనే పాయింట్ లోనే జనాలు ఆలోచిస్తున్నారు… ఇక శర్వానంద్ హీరోగా వస్తున్న ‘నారీ నారీ నడుమ మురారి’ సినిమా మీద కూడా అందరికీ మంచి నమ్మకమైతే ఉంది.
కారణం ఏంటి అంటే ఆ సినిమా దర్శకుడైన రామ్ అబ్బవరం ఇంతకు ముందు చేసిన ‘సామజవరగమన’ సినిమా సూపర్ సక్సెస్ అయింది కాబట్టి ఆటోమేటిగ్గా ఈ సినిమా మీద మంచి అంచనాలైతే ఉన్నాయి. నవీన్ పోలిశెట్టి హీరోగా వస్తున్న ‘అనగనగా ఒక రాజు’ సినిమా కూడా ప్రేక్షకుల్లో విశేషమైన ఆదరణను సంపాదించుకోవడానికి సిద్ధమవుతోంది. చూడాలి మరి ఈ సినిమాల్లో ఏ మూవీస్ సూపర్ సక్సెస్ లను సాధిస్తాయి అనేది…