https://oktelugu.com/

IPL Mega Auction 2025 : అయ్యర్, పంత్ రికార్డులు సృష్టిస్తే.. వీళ్లు మెరుపులు మెరిపించారు.. ఇంతకీ ఈ ఆటగాళ్లు ఎవరు? ఎంతకు అమ్ముడుపోయారు?

లక్నో జట్టు కెప్టెన్ గా గత సీజన్లో వ్యవహరించిన కేఎల్ రాహుల్ ను ఈసారి ఢిల్లీ జట్టు కొనుగోలు చేసింది. ఇతడికి ఏకంగా 14 కోట్లు చెల్లించింది.

Written By:
  • NARESH
  • , Updated On : November 24, 2024 / 06:35 PM IST

    IPL Mega Auction

    Follow us on

    IPL Mega Auction 2025 : ఐపీఎల్ 2025 మెగా వేలం ఆటగాళ్లపై కోట్ల వర్షం కురిపిస్తోంది.. అనుకున్నట్టుగానే ఆటగాళ్లు రికార్డు స్థాయి ధరకు అమ్ముడుపోతున్నారు. ఇప్పటికే రిషబ్ పంత్, శ్రేయస్ అయ్యర్ స్టార్క్ రికార్డును బద్దలు కొట్టారు. ఏకంగా అయ్యర్ 26.75, పంత్ 27 కోట్లకు అమ్ముడు పోయారు.. వీరిని పంజాబ్, లక్నో జట్లు కొనుగోలు చేశాయి.

    ఐపీఎల్ 2025 మెగా వేలంలో అయ్యర్, పంత్ సరికొత్త రికార్డులు సృష్టిస్తే.. మిగతా ఆటగాళ్ళు కూడా అంత కాకపోయినా దరిద్రపు అదేస్తాయిలో భారీ ధరకు అమ్ముడుపోయారు.. గుజరాత్ జట్టు ఇంగ్లాండ్ ఆటగాడు జోస్ బట్లర్ ను 15.75 కోట్లకు కొనుగోలు చేసింది. ఇతడి బేస్ ప్రైస్ రెండు కోట్లు. 2024 సీజన్లో రాజస్థాన్ జట్టుకు ఓపెనింగ్ బ్యాటర్ గా వివరించాడు. పదునైన బ్యాటింగ్ తో మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసత్తా ఇతడికి ఉంది.. బట్లర్ కోసం గుజరాత్, లక్నో జట్లు విపరీతమైన పోటీపడ్డాయి.

    చాహల్ కు 18 కోట్లు

    ఈ మెగా వేలంలో స్పిన్నర్ యజువేంద్ర చాహల్ అద్భుతమైన ధర పలికాడు. చూడండి 18 కోట్లకు పంజాబ్ జట్టు కొనుగోలు చేసింది. ఇతడి బేస్ ప్రైస్ రెండు కోట్లు.. గత సీజన్లో ఇతడు రాజస్థాన్ జట్టు తరఫున ఆడాడు. కీలక మ్యాచ్లలో వికెట్ల మీద వికెట్లు తీసి.. జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.

    కేఎల్ రాహుల్ 14 కోట్లు

    లక్నో జట్టు కెప్టెన్ గా గత సీజన్లో వ్యవహరించిన కేఎల్ రాహుల్ ను ఈసారి ఢిల్లీ జట్టు కొనుగోలు చేసింది. ఇతడికి ఏకంగా 14 కోట్లు చెల్లించింది.

    మహమ్మద్ సిరాజ్ 12.25 కోట్లు

    టీమిండియా యువపేస్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ ను గుజరాత్ జట్టు 12.25 కోట్లకు కొనుగోలు చేసింది. ఇతడి బేస్ ప్రైస్ రెండు కోట్లు. చాలా సీజన్ల చీకటి బెంగుళూరు జట్టుకు ఆడుతున్నాడు. ఐపీఎల్ లో ఇప్పటివరకు 93 వికెట్లు పడగొట్టిన సిరాజ్..4-21 తో అద్భుతమైన ప్రదర్శన చేశాడు.

    మిచెల్ స్టార్క్ 11.75 కోట్లు

    గత సీజన్లో భారీ ధరకు అమ్ముడుపోయి రికార్డు సృష్టించిన స్టార్క్.. ఈసారి 11.75 కోట్లకే అమ్ముడుపోయాడు. ఇతడిని ఢిల్లీ జట్టు కొనుగోలు చేసింది. గత ఏడాది ఇతడిని కోల్ కతా జట్టు 24.75 కోట్లకు కొనుగోలు చేసింది. అప్పట్లో అది హైయెస్ట్ రికార్డ్ గా ఉంది.

    మహమ్మద్ షమీకి 10 కోట్లు

    టీమిండియాలో అద్భుతమైన బౌలర్ గా పేరుపొందిన మహమ్మద్ షమీ పది కోట్లకు అమ్ముడుపోయాడు. ఇతడి బేస్ ప్రైస్ 2 కోట్లు. గత సీజన్లో ఇతడిని గుజరాత్ జట్టు కొనుగోలు చేసింది. అయితే అతడు శస్త్ర చికిత్స కారణంగా ఐపీఎల్ లో ఆడలేదు. అయితే ఈసారి అతడిని హైదరాబాద్ కొనుగోలు చేసింది. ఏకంగా 10 కోట్లు చెల్లించింది. ముఖ్యంగా పవర్ ప్లే, డెత్ ఓవర్లలో అద్భుతంగా బౌలింగ్ చేయగలడు.

    లివింగ్ స్టోన్ 8.75 కోట్లు

    సంచలన బ్యాటింగ్ తో వెలుగులోకి వచ్చిన లివింగ్ స్టోన్ 8.75 కోట్లకు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కొనుగోలు చేసింది.

    డేవిడ్ మిల్లర్ 7.5 కోట్లు

    హిట్ బ్యాటర్ గా పేరుపొందిన డేవిడ్ మిల్లర్ ను 7.5 కోట్లకు లక్నో జట్టు కొనుగోలు చేసింది. గత సీజన్లో ఇతడు గుజరాత్ జట్టు తరఫున ఆడాడు.