ఐపీఎల్:కోల్‌కతాvsరాజస్థాన్..గెలుపెవరిది?

ఐపీఎల్ మరో సమఉజ్జీల సమరానికి రంగం సిద్ధమైంది. ఈరోజు కోల్‌కతా నైట్ రైడర్స్ తో రాజస్థాన్ రాయల్స్ తలపడనుంది.. రెండూ తమ నాలుగు మ్యాచ్ లలో కేవలం ఒక విజయంతో పాయింట్ల పట్టికలో చిట్టచివరన ఉన్నాయి. ఈ టీంలు ఇంకా సెట్ కాలేదు. బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లో లోపాలున్నాయి. గత కొన్ని మ్యాచ్ ల ఓటముల నుండి వాళ్లు బయటకు రావడం లేదు.. ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఈ రాత్రి వీరిద్దరూ టఫ్ ఫైట్ కు సిద్ధమవుతున్నారు. […]

Written By: NARESH, Updated On : April 24, 2021 11:09 am
Follow us on

ఐపీఎల్ మరో సమఉజ్జీల సమరానికి రంగం సిద్ధమైంది. ఈరోజు కోల్‌కతా నైట్ రైడర్స్ తో రాజస్థాన్ రాయల్స్ తలపడనుంది.. రెండూ తమ నాలుగు మ్యాచ్ లలో కేవలం ఒక విజయంతో పాయింట్ల పట్టికలో చిట్టచివరన ఉన్నాయి. ఈ టీంలు ఇంకా సెట్ కాలేదు. బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లో లోపాలున్నాయి. గత కొన్ని మ్యాచ్ ల ఓటముల నుండి వాళ్లు బయటకు రావడం లేదు.. ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఈ రాత్రి వీరిద్దరూ టఫ్ ఫైట్ కు సిద్ధమవుతున్నారు. ఈ ఎవరు గెలిచినా చివరి స్థానం నుంచి మరో రెండు పాయింట్లు లభించి ముందడుగు వేస్తారు.

– రాజస్థాన్ కు టాప్-ఆర్డర్ బాధలు
రాజస్థాన్ కు టాప్ ఆర్డర్ సమస్యలు తీరడం లేదు. బెన్ స్టోక్స్ గాయంతో వైదొలగడంతో ఆ టీం కృంగిపోయింది. ఆడిన అన్ని మ్యాచ్‌లలో విఫలమైనప్పటికీ, రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ మనన్ వోహ్రాకు అవకాశం ఇస్తోంది. యువ యశస్వి జైస్వాల్ ఓపెనర్‌గా ఈరోజు అవకాశం లభిస్తుందని భావిస్తున్నారు.. సంజు సామ్సన్, జోస్ బట్లర్ మరియు డేవిడ్ మిల్లెర్ అస్థిరత కూడా రాజస్థాన్ శిబిరాన్ని దెబ్బతీస్తోంది. స్టోక్స్, ఆర్చర్ మరియు లివింగ్స్టోన్ రాజస్థాన్ టీం నుంచి నిష్క్రమించడంతో విదేశీ ఆటగాళ్ళ కొరత ఆ టీంకు ఎక్కువగా ఉంది. పేస్ బౌలర్లు కూడా వాంఖడే పిచ్‌ను పెద్దగా ఉపయోగించుకోలేకపోతున్నారు.

-కేకేఆర్ అన్ని విభాగాలను రిపేర్ చేయాలి
కోల్‌కతా నైట్ రైడర్స్ అన్ని విభాగాలు ఈ సీజన్‌లో సరిగా రాణించడం లేదు. టాప్-ఆర్డర్ విఫలమైతే, మిడిల్ ఆర్డర్ ఆడుతోంది. మిడిల్ ఆర్డర్ ఆడని నాడు టాప్ ఆర్డర్ రాణిస్తోంది. పరస్పర విరుద్ధంగా ఆడుతున్నారు. కానీ ఆ ప్రదర్శనలు వారికి విజయాలు ఇవ్వడానికి సరిపోవు. అందరు బ్యాట్స్ మెన్ సమష్టిగా విజయాలు సాధించడానికి కష్టపడాలి. రాజస్థాన్ పేసర్లు సమర్థవంతంగా ఆడకపోవడంతో బౌలింగ్ కూడా అస్థిరంగా కనిపిస్తుంది. చివరి మ్యాచ్ లో కమలేష్ నాగర్‌కోటి కూడా విఫలమయ్యాడు. దీంతో ఈ మ్యాచ్‌లో మరో ఆటగాడికి అవకాశం దక్కవచ్చు. వాంఖడేలో జరిగిన అనేక ఇతర మ్యాచ్ ల మాదిరిగానే, ఇది కూడా అధిక స్కోరింగ్ మ్యాచ్ గా మారనుంది. టాస్ గెలిచిన జట్టు చేజింగ్ చేస్తే ఖచ్చితంగా ప్రయోజనం ఉంటుంది.

ఐపీఎల్ చరిత్ర: ఈ టీం టీంలో తలపడిన 23 మ్యాచ్‌ల్లో కోల్‌కతా 12 మ్యాచ్ లను, రాజస్థాన్ 10 విజయాలు సాధించాయి. ఒక ఆట డ్రా అయ్యింది.

మ్యాచ్ వేదిక: వాంఖడే స్టేడియం, ముంబై.

మ్యాచ్ సమయం: సాయంత్రం 07.30 PM