Homeక్రీడలుక్రికెట్‌IPL 2026: ఐపీఎల్ 2026.. తొలి బంతి ఇంకా పడనేలేదు.. టోర్నీ మొదలైంది

IPL 2026: ఐపీఎల్ 2026.. తొలి బంతి ఇంకా పడనేలేదు.. టోర్నీ మొదలైంది

IPL 2026: అదేంటి శీర్షిక అలా పెట్టారు.. ఐపీఎల్ ఆరంభానికి ఇంకా సమయం ఉంది కదా.. ప్రారంభ వేడుకలు ఇంకా మొదలు కాలేదు కదా..అనే అనుమానాలు మీలో వ్యక్తమవుతున్నాయి కదా.. మీకొచ్చిన అనుమానాలు సహజమే. అవి ఆమోదయోగ్యం కూడా. చిన్నస్వామి స్టేడియంలో తొలి బంతి పడకముందే ఐపీఎల్ ప్రారంభమైందని ఎందుకు చెప్పామంటే.. ఈ కథనం చదవండి మీకు తెలుస్తుంది..

Also Read: వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ లో త్రివిక్రమ్ శ్రీనివాస్ మాజీ ప్రేయసి.. రీ యూనియన్ అదిరిపోయింది.

ఐపీఎల్ ప్రారంభ మ్యాచ్ బెంగళూరు, హైదరాబాద్ మధ్య జరుగుతుంది. చిన్న స్వామి స్టేడియం దీనికి వేదిక అవుతుంది. ప్రారంభ వేడుకలు ముగిసిన తర్వాత మ్యాచ్ మొదలవుతుంది. అయితే దాని కంటే ముందే బెంగళూరులో ఒక ఫైవ్ స్టార్ హోటల్లో ఆటగాళ్లు బస చేస్తున్నారు. వారికోసం ఐపీఎల్ నిర్వహణ కమిటీ బాల్ రూములను ఏర్పాటు చేసింది. వారు శిక్షణ పొందడానికి వాటిని రూపొందించింది. ప్రతి గదిలో దీపాలు.. కెమెరా సిబ్బంది.. స్టైలిస్ట్.. షార్ట్ లిస్టు తో కూడిన దర్శకుడు.. పూర్తి క్రికెట్ కిట్.. దీనికి తోడు ఎక్కడ నిలబడాలో.. ఎలా ఉండాలో సూచనలు అందుకుంటున్న క్రికెటర్లు.. ప్లేయర్లు స్ట్రైక్ రొటేట్ అయినట్టుగా బాల్ రూం ల మధ్య వేగంగా కదులుతున్నారు.. ఒక నిర్దిష్ట కోణంలో.. నిర్దిష్టమైన సమయంలో ఒక వస్తువును పట్టుకోవడం.. ఆ తర్వాత పక్క గదిలోకి వెళ్తున్నారు..

ఇదంతా కూడా ప్రాక్టీస్ కోసం కాదు.. ఐపీఎల్ ప్రమోషన్ కోసం.. ఇందులో స్టార్ ఆటగాళ్లు కూడా ఉన్నారు. వరుసగా 4 షూట్లు పూర్తి చేశారు. కేవలం బెంగళూరు.. హైదరాబాద్ జట్లకు మాత్రమే ఇది పరిమితం కాలేదు.. ముంబై, చెన్నై, ఢిల్లీ.. ఇలా అనేక నగరాలలో ఈ వ్యవహారాన్ని సాగించారు.

ఐపీఎల్ కు ఈ స్థాయిలో ప్రచారం సాగించడం వల్లే ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన క్రికెట్ లీగ్ గా అవతరించింది. ఉదాహరణకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు 1.78 బిలియన్ డాలర్లు.. రాజస్థాన్ రాయల్స్ జట్టుకు 1.6 బిలియన్ డాలర్లు లభించాయంటే.. ఐపీఎల్ రేంజ్ ఏమిటో అర్థం చేసుకోవచ్చు. ఒకానొక దశలో బెంగళూరు జట్టును 2 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేస్తారని ప్రచారం జరిగినప్పటికీ.. అది ఆ మార్క్ అందుకోలేకపోయింది. కాకపోతే ఈ స్థాయిలో డబ్బును చెల్లించడానికి కార్పొరేట్ సంస్థలు ముందుకు వస్తున్నాయంటే ఇండియన్ క్రికెట్ స్టామినాను అర్థం చేసుకోవచ్చు.

ప్రస్తుత ఐపీఎల్ ను పరిశీలిస్తే.. ఈ సీజన్లో 10 జట్లకు నాయకత్వం వహిస్తున్న ఏడుగురు ఆటగాళ్లు అయ్యర్, రియాన్ పరాగ్, పాటిదార్, గిల్, రహానే, పంత్, గైక్వాడ్ టి20 వరల్డ్ కప్ గెలిచిన జట్టులో లేరు. దీనిని బట్టి విజేతలకు అవకాశాలు లభిస్తాయి.. అదే సమయంలో ఆశావాహులకు కూడా అవకాశాలు లభిస్తాయని ఐపిఎల్ నిర్వహణ కమిటీ చెప్పకనే చెప్పింది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version