Small Films vs Big Films : ‘స్టూడెంట్ నెంబర్ వన్’ సినిమాతో దర్శకుడిగా తన కెరియర్ ను మొదలుపెట్టిన రాజమౌళి మొదటి సినిమాతోనే సూపర్ సక్సెస్ ని సాధించాడు. ఇక ఆ తర్వాత చేసిన వరుస సినిమాలతో ప్రేక్షకులను మెప్పించాడు. యంగ్ హీరోలను స్టార్ హీరోలుగా మార్చడంలో కీలకపాత్ర వహించాడు. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ తో నాలుగు సినిమాలను చేసి అతన్ని స్టార్ హీరోగా మార్చడంలో తను కీలకపాత్ర వహించాడు. అలాంటి రాజమౌళి ఇప్పుడు చేస్తున్న సినిమాల విషయంలో కూడా చాలా కేర్ ఫుల్ గా వ్యవహరిస్తుండడం విశేషం…మహేష్ బాబుని హీరోగా పెట్టి చేస్తున్న ‘వారణాసి’ సినిమా విషయంలో ఆయన చాలా కేర్ఫుల్ గా ఉంటున్నాడు. ఎక్కడా కూడా ఎలాంటి మిస్టేక్ జరగకుండా ప్రతిదీ తనే క్షుణ్ణంగా పరిశీలిస్తూ ముందుకు దూసుకెళ్తుండడం విశేషం… రాజమౌళి లాంటి దర్శకుడు ఈ మధ్యకాలంలో మరొకరు ఉండరు అనేది వాస్తవం… ప్రతి విషయాన్ని తనే స్వయంగా తెలుసుకొని మరి దానికి సంబంధించిన సొల్యూషన్ ని చెప్పే ప్రయత్నం చేస్తుంటాడు. అందుకే అతని సినిమాల్లో ప్రతి విషయం అతని ప్రమేయంతోనే జరుగుతుంది. తన అనుమతి లేకుండా ఏ ఒక్క డిసీజన్ కూడా సినిమా యూనిట్ తీసుకోరు… ఇక ఏది ఏమైనా కూడా తను అనుకున్నట్టుగా షూటింగ్ స్పాట్లో జరగకపోతే ఆరోజు ప్యాకప్ చెప్పి నెక్స్ట్ డే అనుకున్నది అనుకున్నట్టుగా తీసే విధంగా ప్రణాళికలు రూపొందించుకుంటాడు.
ముఖ్యం రాజమౌళి సినిమాల వల్ల బడ్జెట్ పెరుగుతూనే పోతుంది తప్ప తగ్గడం లేదు. బాహుబలి సినిమాతో 500 కోట్ల బడ్జెట్ ని కేటాయించిన ఆయన ‘త్రిబుల్ ఆర్’ సినిమా కోసం 600 కోట్ల వరకు బడ్జెట్ ని పెట్టాడు. ఇక ఇప్పుడు వారణాసి సినిమా కోసం దాదాపు 1500 కోట్ల వరకు బడ్జెట్ ను కేటాయిస్తున్నారు. రోజురోజుకీ బడ్జెట్ పెరుగుతూ ఉండటం వల్ల సినిమాని చూసే ప్రేక్షకులు సినిమాల మీద ఇంట్రెస్ట్ పెట్టే అవకాశమైతే లేకుండా పోతుంది.
బడ్జెట్ పెరగడం వల్ల టికెట్ రేట్లు విపరీతంగా పెంచుతున్నారు. దానివల్ల సామాన్య మానవుడి పైన విపరీతంగా భారం పడుతుంది. అలాగే చిన్న సినిమాలను బతికించే పరిస్థితిలో ఎవ్వరు లేరు. 200 రూపాయల టికెట్ రేట్ తో విజువల్ వండర్స్ ను చూసిన ప్రేక్షకులు అదే 200 పెట్టి చిన్న సినిమాకు రావడానికి ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే అందులో గ్రాండీయర్ విజువల్స్ ఏమీ ఉండవు. కాబట్టి దాన్ని టీవీలో చూసినా కూడా పెద్దగా ఇంపాక్ట్ పోయే ప్రమాదం లేదు. కాబట్టి అందరు ఓటిటి ల వైపే ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. తద్వారా చిన్న సినిమాలు చూడడానికి థియేటర్ కి వచ్చే జనాల సంఖ్య తగ్గిపోయిందనే చెప్పాలి…
రాజమౌళి వల్ల సినిమా ఇండస్ట్రీకి భారీ నష్టమైతే వాటిల్లుతుంది. ఇక ఇప్పుడు రాబోయే వారణాసి సినిమా ఎన్ని వందల కోట్ల కలెక్షన్స్ ను వసూలు చేస్తుందో, దానివల్ల సినిమా ఇండస్ట్రీ కి ఇంకెన్ని ప్రాబ్లమ్స్ రాబోతున్నాయో తలుచుకుంటే భయమేస్తుంది… దీంతో కంప్లీట్ గా చిన్న సినిమాల దుకాణం బంద్ అయిపోయిన ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు…
