Homeఎంటర్టైన్మెంట్IPL 2026 RCB Vs SRH: రాయల్ చాలెంజర్స్ ను భయపెడుతున్న బెంగళూరు..

IPL 2026 RCB Vs SRH: రాయల్ చాలెంజర్స్ ను భయపెడుతున్న బెంగళూరు..

IPL 2026 RCB Vs SRH: ఐపీఎల్ లో ఏ జట్టుకైనా సొంత మైదానం ఉంటుంది. సొంత మైదానంలో స్థానిక ప్రేక్షకుల మద్దతు ఉంటుంది. సొంత మైదానం లో పిచ్ మీద ఆటగాళ్లకు అవగాహన ఉంటుంది కాబట్టి .. ప్రతి సందర్భంలో అడ్వాంటేజ్ లభిస్తూ ఉంటుంది. అందువల్లే సొంత మైదానంలో ఆటగాళ్లు రెచ్చిపోతుంటారు. ప్రత్యర్థి జట్టు ప్లేయర్లకు చుక్కలు చూపిస్తుంటారు. ప్రస్తుత ఐపిఎల్ లో సొంత మైదానాలలో జరిగే మ్యాచ్ లలో సత్తా చూపించాలని ఆయా జట్లు భావిస్తుంటే.. బెంగళూరు మాత్రం సొంత మైదానాన్ని తలచుకొని కలవర పడుతోంది.

Also Read: వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ లో త్రివిక్రమ్ శ్రీనివాస్ మాజీ ప్రేయసి.. రీ యూనియన్ అదిరిపోయింది..

గత సీజన్లో బెంగళూరు విజేతగా నిలిచింది. కానీ సొంత మైదానంలో మాత్రం పరాజితగా మిగిలిపోయింది. గత సీజన్లో తమ తొలి 3 హోమ్ గ్రౌండ్ మ్యాచ్లను బెంగళూరు జట్టు ప్లేయర్లు కోల్పోయారు. లెంత్ బంతులను ఆడలేక పోయారు. బౌన్స్ అయ్యే బంతులను అనవసరంగా వేటాడి మూల్యం చెల్లించుకున్నారు. ఇందులో విరాట్ కోహ్లీ కూడా ఉన్నాడు. స్క్వేర్ ముందు క్రాస్ బ్యాటెడ్ ఫుల్ షాట్లు ఆడి ఆటగాళ్లు తమ నిర్లక్ష్యాన్ని చాటుకున్నారు. అయితే ఈసారి గత తప్పిదాలను పునరావృతం చేయకూడదని బెంగళూరు ప్లేయర్లు భావిస్తున్నారు.. గత సీజన్లో సొంతమైదానంలో ఎదురైన ఓటముల నుంచి పాఠాలు నేర్చుకున్న బెంగళూరు ప్లేయర్లు.. ఈసారి ఆ తప్పిదాలు జరగకుండా చూసుకుంటున్నారు.

చిన్న స్వామి స్టేడియంలో బెంగళూరు, హైదరాబాద్ ప్లేయర్లు కొద్దిరోజులుగా ప్రాక్టీస్ చేస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ ప్లేయర్లు సెంటర్ వికెట్ మీద ప్రధానంగా దృష్టి పెట్టారు. పక్కనే ఉన్న నెట్స్ లో బ్యాటర్లు బంతులను స్టాండ్స్లోకి అవలీలగా పంపించేశారు. ఏకంగా ఐదుగురు గ్రౌండ్స్ మెన్ అరగంటకు పైగా పిచ్ ను చదును చేశారు.

చిన్నస్వామి స్టేడియంలో ఈ రెండు జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ 288 పరుగులు చేసింది. చేజింగ్లో బెంగళూరు 262 పరుగుల వద్ద ఆగిపోయింది. చిన్నస్వామి స్టేడియంలో చివరిగా క్రికెట్ మ్యాచ్ జరిగి దాదాపు ఏడాది అయింది. అయితే ఈ మైదానంపై ఉన్న పిచ్ కాస్త భిన్నంగా ఉందని క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. అండి ఫ్లవర్ అంచనా ప్రకారం.. ఈసారి పిచ్ చూసేందుకు భిన్నంగా ఉందని.. ఆడేందుకు కూడా అలానే ఉంటుందని తెలుస్తోంది.. గత పది రోజులుగా ఈ పిచ్ మీద ప్రాక్టీస్ చేస్తున్న నేపథ్యంలో ప్లేయర్లకు అవగాహన వచ్చి ఉంటుందని తెలుస్తోంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version