spot_img
Homeక్రీడలుక్రికెట్‌IPL 2026 Kolkata Knight Riders Chances: IPL 2026: కోల్"కథ" ఈసారి మారుతుందా.. నాలుగో...

IPL 2026 Kolkata Knight Riders Chances: IPL 2026: కోల్”కథ” ఈసారి మారుతుందా.. నాలుగో ట్రోఫీ అందుకుంటుందా..

IPL 2026 Kolkata Knight Riders Chances: ఐపీఎల్ లో హైయెస్ట్ ట్రోఫీలు అందుకున్న జట్లలో ముంబై, చెన్నై కొనసాగుతున్నాయి. ఈ జట్ల తర్వాత ఆ స్థాయిలో అద్భుతమైన రికార్డు ఉన్న జట్టుగా కోల్ కతా నైట్ రైడర్స్ కు పేరుంది. 2024 లో ఫైనల్ లో హైదరాబాద్ జట్టును ఓడించి కోల్ కతా ఐపీఎల్ ట్రోఫీని అందుకుంది.

2024 తో పాటు అంతకంటే రెండుసార్లు విజేతగా నిలిచి.. త్రీ స్టార్ ఛాంపియన్ గా అవతరించింది కోల్ కతా. గత ఏడాది డిపెండింగ్ ఛాంపియన్ గా రంగంలోకి దిగిన కోల్ కతా.. ఆ స్థాయిలో ఆడ లేకపోయింది. దారుణమైన ఆట తీరు ప్రదర్శించి అభిమానులను తీవ్రంగా నిరశపరిచింది. మరో ఐదు రోజుల్లో ఈ టోర్నీ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో.. కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాల్సి ఉంది.

కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు 2012, 2014, 2021, 2024 సీజన్లో ఫైనల్ వెళ్ళింది. ఐపీఎల్ చరిత్రలో నాలుగు సార్లు ఫైనల్ వెళ్లిన కోల్ కతా.. ఒక్కసారి మాత్రమే ట్రోఫీని కోల్పోయింది. మిగతా మూడుసార్లు లీగ్ మొత్తం అద్భుతమైన ప్రదర్శన చేసి.. ఫైనల్లో కూడా ట్రోఫీలు అందుకొని సరికొత్త చరిత్ర సృష్టించింది.

2026 సీజన్ లో అద్భుతమైన ప్రదర్శన చేయాలని కోల్ కతా భావిస్తోంది. ఈ జట్టుకు రహనే నాయకత్వం వహిస్తున్నాడు.. గత సీజన్లో జట్టు విఫలమైంది కాబట్టి.. ఈసారి కూడా అటువంటి ఫలితం వస్తుందని అనుకోవద్దని.. కచ్చితంగా ఈ సీజన్ మాదే అని రహానే చెబుతున్నాడు. ఆటగాళ్లు కూడా అదే లక్ష్యంతో మైదానంలో శ్రమిస్తున్నారని అతడు చెబుతున్నాడు. దీనిని బట్టి కోల్ కతా కథ ఈసారి మారుతుందని అభిమానులు అంచనా వేస్తున్నారు.

అతని మీద నమ్మకం

కోల్ కతా జట్టులో గ్రీన్ కీలక ఆటగాడిగా కనిపిస్తున్నాడు. ఇతడికి కోల్ కతా యాజమాన్యం వేలంలో 25.20 కోట్లు చెల్లించింది.. కెప్టెన్ రహనే, సునీల్ నరైన్, టీం సిఫెర్ట్, ఫిన్ అలెన్ వంటి ప్లేయర్లు ఈ జట్టుకు ప్రధాన బలం. అద్భుతమైన ప్లేయర్లు జట్టులో ఉన్న నేపథ్యంలో బ్యాటింగ్ సర్దుబాటు ఎలా చేయాలో మేనేజ్మెంట్ కు అర్థం కావడం లేదు.

కసరత్తు చేయాల్సిందే

కోల్ కతా లో అలెన్ అత్యంత ప్రమాదకరమైన ఆటగాడు.. ఇతడు ఇటీవల టీ20 వరల్డ్ కప్ లో దక్షిణాఫ్రికా మీద సెమి ఫైనల్ మ్యాచ్లో 33 బంతుల్లోనే సెంచరీ చేశాడు. నిలకడైన ఆటగాడిగా పేరుపొందాడు. రఘు వంశీ, రింకు సింగ్, రమణదీప్ సింగ్, రాహుల్ త్రిపాటి వంటి వారు కూడా అద్భుతాలు చేయగలరు. ఒకవేళ ఇంపాక్ట్ ప్లేయర్లుగా రఘు వంశీ, త్రిపాటి, త్యాగి రంగంలోకి దిగితే.. రెగ్యులర్ జట్టులో రమణదీప్, రింకు సింగ్ చోటు దక్కించుకునే అవకాశం ఉంది.

బౌలింగ్ పెద్ద సమస్య

బ్యాటింగ్ పరంగా కోల్ కతా అద్భుతంగా కనిపిస్తున్నప్పటికీ.. బౌలింగ్ మాత్రం పెద్ద లోపం గా ఉంది. పేస్ బౌలర్లు గాయపడిన నేపథ్యంలో స్పిన్నర్లు బౌలింగ్ భారాన్ని మోయాల్సి వస్తోంది. సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి స్పిన్ మాయాజాలాన్ని ప్రదర్శించాల్సి ఉంది. హర్షిత్ రానా గాయపడిన నేపథ్యంలో.. అతడి స్థానాన్ని ముజరబాని భర్తీ చేస్తాడని కోల్ కతా యాజమాన్యం భావిస్తోంది. పేస్ బౌలింగ్ లయ తప్పితే మాత్రం.. కోల్ కతా జట్టు మూల్యం చెల్లించుకోవలసి ఉంటుంది.

పేస్ బౌలర్లు హర్షిత్, ఆకాష్ గాయాల వల్ల డోర్ ని మొత్తానికి దూరమయ్యారు. పతిరన కూడా గాయపడ్డాడు. అయితే అతడు కోలుకుంటే తదుపరి మ్యాచ్లకు అందుబాటులోకి వస్తాడని తెలుస్తోంది.

జట్టులో ఉన్న ప్లేయర్లు వీళ్లే

పతిరణ, సోలంకి, రహానే, సిఫర్ట్, రచిన్ రవీంద్ర, అలెన్, గ్రీన్, పావెల్, రింకు సింగ్, రమణదీప్ సింగ్, సునీల్ నరైన్, ఉమ్రాన్ మాలిక్, వరుణ్ చక్రవర్తి, ముజరాబాని, వైభవ్ అరోరా, కార్తిక్ త్యాగి, సార్ధకరంజన్, మనీష్ పాండే, రఘు వంశీ, అనుకూల్ రాయ్.

ఇప్పటివరకు కోల్ కతా ఐపీఎల్ లో 265 మ్యాచ్ లు ఆడింది. ఇందులో 136 మ్యాచ్ లలో విజయం సాధించింది. 127 మ్యాచ్ లలో ఓడిపోయింది. ఇందులో రెండు రద్దు అయ్యాయి. 2012, 2014, 2024 లో కోల్ కతా ఛాంపియన్ గా నిలిచింది. 2021 లో రన్నరప్ తో సరిపెట్టుకొంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Sidiri Appalaraju Arrest

Sidiri Appalaraju Arrest: అరెస్టు చేసే దాకా తెచ్చుకున్న ఆ మాజీ మంత్రి!

Sidiri Appalaraju Arrest: ఎట్టకేలకు మాజీమంత్రి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు సీదిరి అప్పలరాజు అరెస్టయ్యారు. అప్పలరాజు కుమారుడు ఆరవ్ వర్మ నడిపిన బైక్ ఢీకొని దానయ్య అనే గొర్రెల కాపరి...
Healthy Dinner

Healthy Dinner: రాత్రి సమయంలో ఈ ఆహారం తింటున్నారా…

Healthy Dinner: ప్రస్తుత కాలంలో చాలామంది నిద్ర సమస్యను ఎదుర్కొంటున్నారు. అయితే కొందరు ఉద్యోగాలు ఇతర కారణాలతో ఒత్తిడిని ఎదుర్కొని సరైన నిద్ర పోవడం లేదు. మరికొందరు రాత్రి సమయంలో జీర్ణం...
RRB JE Recruitment 2026

RRB JE Recruitment 2026: రైల్వేలో యువతకు బంపర్‌ ఆఫర్.. ఈ ఛాన్స్‌ మిస్‌ చేసుకోకండి!

RRB JE Recruitment 2026: భారతీయ రైల్వేలు దేశంలోని అతిపెద్ద పబ్లిక్‌ సెక్టార్‌ సంస్థల్లో ఒకటి. ఇప్పుడు ఆ సంస్థలోని ముఖ్యమైన టెక్నికల్‌ పోస్టులను భర్తీ చేయడానికి రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డులు (ఆర్‌ఆర్‌బీ)...
Cockroach Facts

Cockroach Facts: తల లేకపోయినా ఈ జీవి బతుకుతుంది.. సృష్టికే సవాల్ విసిరే దీని కథేంటో తెలుసా

Cockroach Facts: ఒక నిమిషం గాలి పీల్చుకోకుండా మనం ఉండగలుగుతామా.. అక్కడి దాకా ఎందుకు తల లేకుండా బతకగలుగుతామా.. ఇది సాధ్యమవుతుందా.. కానీ ఆ జీవి విషయంలో సాధ్యమవుతుంది. ఎందుకంటే అది సృష్టికే...
JP Nadda

JP Nadda: నడ్డా చెప్పింది నిజమే.. పేపర్ లీక్ ల గురించి మాట్లాడే అర్హత కాంగ్రెస్ కు లేదు..

JP Nadda: ఈ దేశంలో పేపర్ లీక్ ల గురించి మాట్లాడే అర్హత ఏ పార్టీకి కూడా లేదు. ఈ మాట నూటికి నూరు శాతం కాదు కోటి శాతం నిజం....
Oktelugu Epaper