IPL 2025 : ఐపీఎల్ లో ఇంతవరకు ట్రోఫీ దక్కించుకోలేని ఢిల్లీ జట్టు మొదటి స్థానంలో కొనసాగుతోంది. రెండవ స్థానంలో గుజరాత్ ఉంది. మూడో స్థానంలో లక్నో కొనసాగుతోంది. వాస్తవానికి ఈ టోర్నీలో టైటిల్ ఫేవరెట్లుగా చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ పేరుపొందాయి. ఈ రెండు జట్లు కూడా చేరి ఐదు సార్లు విజేతలుగా నిలిచాయి. 2020లో ముంబై ఇండియన్స్ చివరిసారిగా విజేతగా నిలిచింది.. చెన్నై సూపర్ కింగ్స్ 2023 లో ఛాంపియన్ గా ఆవిర్భవించింది. 2017 నుంచి 2023 వరకు.. అంటే దాదాపు 6 సీజన్లు అయితే ముంబై, లేదా చెన్నై ఐపీఎల్ విజేతలుగా నిలిచాయి. గత సీజన్లో కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు ఛాంపియన్ గా నిలిచింది. ఈ సీజన్లో కోల్ కతా నైట్ రైడర్స్ పర్వాలేదనిపిస్తుండగా.. చెరి ఐదుసార్లు ఛాంపియన్లుగా నిలిచిన ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మాత్రం 9, 10 స్థానాలలో కొట్టుమిట్టాడుతున్నాయి. వాస్తవానికి ఆటగాళ్లపరంగా, మేనేజ్మెంట్ల ప్రకారంగా చూసుకుంటే ఈ రెండు జట్లు అన్నింటికంటే బలమైనవి. కానీ ఇవి ఈ సీజన్లో మాత్రం ఆ స్థాయిలో ప్రదర్శన చేయలేకపోతున్నాయి.
Also Read : రోహిత్ ఎక్కడ ఉంటే.. అక్కడ చిరునవ్వుంటుంది.. వైరల్ వీడియో
కెప్టెన్ మారినప్పటికీ..
గత సీజన్లో చెన్నై జట్టుకు రుతు రాజ్ గైక్వాడ్ కెప్టెన్ గా వచ్చాడు. 2023 లో చెన్నై జట్టుకు సారధ్యం వహించిన మహేంద్ర సింగ్ ధోని.. 2024 లో తప్పుకున్నాడు. అయితే 2025లో అనివార్యంగా అతడు కెప్టెన్ అయ్యాడు. రుతు రాజ్ గైక్వాడ్ మోచేతి గాయం వల్ల ఐపీఎల్ మొత్తానికి దూరమయ్యాడు. ధోని సారథ్యంలో కూడా చెన్నై జట్టు విజయాల బాట పట్టలేకపోయింది. ఇటీవల కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు తో జరిగిన మ్యాచ్లో దారుణమైన ఓటమిని చవిచూసింది.
ఇక ముంబై ఇండియన్స్ కూడా గత రెండు సీజన్లలో పెద్దగా ఆకట్టుకోలేక పోయింది. 2023 సీజన్లో రోహిత్ శర్మ నాయకత్వంలో ముంబై ఇండియన్స్ పెద్దగా విజయాలు సాధించలేకపోయింది. ఇక గత సీజన్లో గ్రూప్ దశలోనే నిష్క్రమించింది.. ఈ సీజన్లో తొమ్మిదవ స్థానంలో కొట్టుమిట్టాడుతోంది. ఒకప్పుడు కెప్టెన్ గా ఉన్న రోహిత్ శర్మ ముంబైలో కీలక ఆటగాడిగా ఉన్నప్పటికీ.. అంతగా ప్రభావం చూపించలేకపోతున్నాడు. హార్థిక్ పాండ్యా నాయకత్వంలో పస లేకపోవడంతో ముంబై జట్టు విజయాలు సాధించలేకపోతోంది.. ఒకప్పుడు ఐపీఎల్ ను శాసించిన చెన్నై, ముంబై.. ఇవాళ ఈ స్థాయికి దిగజారడం పట్ల అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సమూలమైన మార్పులను ఆయా జట్లలో చేపడితే.. విజయాలు సాధ్యమవుతాయని.. ఇలాగే వదిలేస్తే ఈ సీజన్లో కూడా దారుణమైన ఫలితాలు వస్తాయని క్రికెట్ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.
5 time Champions MI – 9th in the Table.
5 time Champions CSK – 10th in the Table. pic.twitter.com/3RTzdQfKR2
— Johns. (@CricCrazyJohns) April 12, 2025